విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

క్యాపిటల్ వార్ .. జగన్ ను హెచ్చరించిన దేవినేని ఉమ.. నిరసన దీక్ష విరమణ..

|
Google Oneindia TeluguNews

ఏపీలో రాజధానిపై కొనసాగుతున్న రగడ ఇంకా ఉధృతంగానే కొనసాగుతుంది. హై పవర్ కమిటీ వేసి రాజధానిపై తుది ప్రకటన వాయిదా వేసినప్పటికీ రాజధాని గ్రామాల్లో రైతుల ఆందోళనలు ఆగటం లేదు. ఇక రైతుల పోరాటానికి మద్దతుగా టీడీపీ ముందుకు వచ్చింది.అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు 24 గంటల దీక్షను చేపట్టారు. 24 గంటలపాటు దీక్ష చేసిన ఆయన ప్రస్తుతం దీక్ష విరమించారు.

అమరావతిలో భూములు కొన్నవాళ్లే అల్లర్లకు కారణమట..రాజధానిపై స్పీకర్ తమ్మినేని వ్యాఖ్యలుఅమరావతిలో భూములు కొన్నవాళ్లే అల్లర్లకు కారణమట..రాజధానిపై స్పీకర్ తమ్మినేని వ్యాఖ్యలు

సీఎం జగన్‌ మానసిక వ్యాధితో బాధపడుతున్నాడన్న దేవినేని ఉమ

సీఎం జగన్‌ మానసిక వ్యాధితో బాధపడుతున్నాడన్న దేవినేని ఉమ

రాజధానిపై ఆందోళన చేపట్టిన రైతులకు మద్దతు తెలుపుతూ దేవినేని గొల్లపూడిలోచేసిన దీక్షను ఈ రోజు మధ్యాహ్నం పలువురు రైతులు నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు.ఇక ఈ నేపధ్యంలో ఆయన రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఇక దీక్ష సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్‌ మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని టీడీపీ నేత దేవినేని ఉమ ఎద్దేవాచేశారు. రైతుల ఆందోళనను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.

రాజధానిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని దేవినేని డిమాండ్

రాజధానిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని దేవినేని డిమాండ్ చేశారు. రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చారని తమ భూములను త్యాగం చేసిన రైతులనుద్దేశించి మంత్రులు హీనంగా మాట్లాడుతున్నారని దేవినేని విమర్శలు గుప్పించారు. జగన్‌ అధికారం చేపట్టాక ప్రజలు పండగల్ని మర్చిపోయారని మండిపడ్డారు దేవినేని ఉమ. ఇసుక కొరత ద్వారా లక్షల మంది కడుపుకొట్టారని నిర్మాణ రంగ కార్మికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారని దుయ్యబట్టారు.

 రైతుల ఉసురు పోసుకుంటే అడ్రెస్ లేకుండా పోతారని హెచ్చరిక

రైతుల ఉసురు పోసుకుంటే అడ్రెస్ లేకుండా పోతారని హెచ్చరిక

ఉద్యమాల ద్వారానే జగన్‌ పిచ్చి తగ్గుతుందన్నారు.జీఎన్‌రావు ఆర్డీవోగా ఉన్నప్పుడే రెండుసార్లు సస్పెండ్‌ అయ్యారని అలాంట్ వ్యక్తిని కమిటీ చైర్మన్ గా నియమించి ఆయన రాష్ట్ర భవిష్యత్‌ను నిర్ణయిస్తే ప్రజలు ఏమైపోతారని నిలదీశారు. ప్రజాభిప్రాయం స్వీకరించకుండా కమిటీలు రిపోర్ట్‌లు ఎలా ఇస్తాయని ఆయన ప్రశ్నించారు. విశాఖలో ఎంపీ విజయసాయిరెడ్డి పెద్ద ఎత్తున భూములను కొనుగోలు చేశారని అందుకే విశాఖ రాజధాని అని చెప్తున్నారన్నారు. రాజధాని రైతుల ఉసురు పోసుకుంటే అడ్రెస్ లేకుండా పోతారని దేవినేని హెచ్చరించారు .

English summary
Many farmers have given devineni uma lemon juice this afternoon to stop the 24 hours protest for farmers of capital . Devineni continued his support of the agitating farmers in the capital. Speaking on the occasion, he said that CM Jagan is suffering from mental illness. He criticized the government doesn't caring about the farmers protest .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X