విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దమ్ముంటే క్యాబినెట్ భేటీ అమరావతిలో పెట్టు: సీఎం జగన్‌కు దేవినేని సవాల్

|
Google Oneindia TeluguNews

ఏపీ సీఎం మూడు రాజధానుల ప్రకటనతో ఏపీలో రాజుకున్న అగ్గి చల్లారటం లేదు. రాజధాని తరలింపు వద్దు అంటూ రాజహ్దాని రైతుల పోరాటం ఇంకా కొనసాగుతుంది. ఇక తాజాగా రాజధాని విషయంలో తుది నిర్ణయం తీసుకోటానికి మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని భావిస్తున్న జగన్ ఈ నెల 27 వ తేదీన విశాఖ వేదికగా మంత్రివర్గ భేటీ నిర్వహిస్తున్నారు. అయితే వైజాగ్ వేదికగా క్యాబినెట్ భేటీ పెట్టటంపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్ర విమర్శు గుప్పిస్తున్నారు. ఏపీ సీఎం జగన్ కు సవాల్ చేస్తున్నారు .

జగన్ వి తుగ్లక్ నిర్ణయాలు ..వైజాగ్ లో అందుకే క్యాబినెట్ భేటీ .. దేవినేని ఉమాజగన్ వి తుగ్లక్ నిర్ణయాలు ..వైజాగ్ లో అందుకే క్యాబినెట్ భేటీ .. దేవినేని ఉమా

జగన్ క్యాబినెట్ భేటీ అమరావతిలో పెట్టాలని సవాల్ చేసిన దేవినేని ఉమా

జగన్ క్యాబినెట్ భేటీ అమరావతిలో పెట్టాలని సవాల్ చేసిన దేవినేని ఉమా

అమరావతిలో మంత్రివర్గ భేటీ పెట్టే దమ్ము లేక వైజాగ్ లో క్యాబినెట్ భేటీ పెడుతున్నారని ఎద్దేవా చేస్తున్న ఉమా జగన్ కు దమ్ము, ధైర్యం ఉంటె మంత్రివర్గ భేటీ అమరావతిలో నిర్వహించాలని సవాల్ చేశారు .మాట తప్పని వాడు, మడమ తిప్పని వాడైతే ఈ నెల 27న నిర్వహించే కేబినెట్ సమావేశాన్ని వెలగపూడిలోని సచివాలయంలో ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి దేవినేని ఉమా జగన్ కు ఛాలెంజ్ చేశారు.

మంత్రుల వ్యాఖ్యలకు అమరావతిలో సమాధానం దొరుకుతుందని చెప్పిన ఉమా

మంత్రుల వ్యాఖ్యలకు అమరావతిలో సమాధానం దొరుకుతుందని చెప్పిన ఉమా

అమరావతిని శ్మశానం అని, ఎడారి అని, పందులు తిరుగుతున్నాయి అని వైసీపీ మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలకు క్యాబినెట్ భేటీ సచివాలయంలో జరిపితే సమాధానం దొరుకుతుంది అని ఆయన అభిప్రాయపడ్డారు. క్యాబినెట్ భేటీ సెక్రటేరియట్ లో నిర్వహించాలని దేవినేని ఉమా డిమాండ్ చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికే రాజధానిని మారుస్తున్నారని ఆరోపించిన ఆయన వైజాగ్ లో భారీగా భూములు కొనుగోలు చేసి ఇన్సైడర్ ట్రేడింగ్ కు పాల్పడాలనే ఇదంతా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైజాగ్ భూ కుంభకోణం, ఇన్ సైడర్ ట్రేడింగ్ ను వదిలే ప్రసక్తే లేదన్న మాజీ మంత్రి

వైజాగ్ భూ కుంభకోణం, ఇన్ సైడర్ ట్రేడింగ్ ను వదిలే ప్రసక్తే లేదన్న మాజీ మంత్రి

ఇక సీఎం జగన్ అండ్ గ్యాంగ్ విశాఖ భూకుంభకోణానికి సంబంధించి సీబీఐ ఎంక్వయిరీ వేస్తే మళ్లీ జైలుకు వెళ్లక తప్పదంటూ దేవినేని ఉమా హెచ్చరించారు. విశాఖలో ఇన్ సైడర్ ట్రేడింగ్ లో ఎవరైతే భూములు కొనుగోలు చేశారో, గత ఏడు నెలలుగా ఎవరైతే భూ దోపిడీకి పాల్పడ్డారో వాళ్లందరిని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఇక ఇప్పుడు రాజధాని మారిస్తే మళ్ళీ టీడీపీ అధికారంలోకి వస్తే రాజధాని అమరావతిలోనే ఉంటుందని, రాజధాని అమరావతిలో నిర్వహించే మొదటి కేబినెట్ మీటింగ్ లోనే ఈ నిర్ణయాలు తీసుకుంటామని జగన్ ని హెచ్చరించారు.

రాజధాని అమరావతిలోనే ఉండాలని దేవినేని ఉమా డిమాండ్

రాజధాని అమరావతిలోనే ఉండాలని దేవినేని ఉమా డిమాండ్


ఐదు కోట్ల మంది ఆంధ్ర ప్రజలను ఏపీ ముఖ్యమంత్రి జగన్ అయోమయంలో పెట్టారని, రాజధాని విషయంలో జగన్ చేస్తున్న గందరగోళానికి ఏపీ ప్రగతిలో వెనక్కు పోతుందని ఆయన పేర్కొన్నారు. రివర్స్ టెండరింగ్ ల పేరుతో అంతా రివర్స్ పాలన చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. క్యాబినెట్ భేటీ నిర్వహణ వైజాగ్ లో చెయ్యటం పై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు విమర్శలు గుప్పించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజా రాజధాని అమరావతిలోనే కొనసాగాలని డిమాండ్ చేశారు.

English summary
TDP leader Devineni Uma Maheshwara Rao has criticized AP chief minister Jagan for confusing five crore Andhra people. He challenged to conduct A cabinet meeting in Amravati. Jagan is going to conduct the cabinet meet in Vizag on 27th of this month . So, former minister Devineni Uma Challenged jagan to conduct the meet in secreteriat .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X