చంద్రబాబును అన్నందుకు గొంతు క్యాన్సర్ తో పోతావ్ .. కొడాలి నానీకి దేవినేని ఉమ శాపం
ఏపీ మంత్రి కొడాలి నానిపై మాజీ మంత్రి దేవినేని ఉమ విరుచుకుపడ్డారు. కొడాలి నాని చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన దేవినేని ఉమా కొడాలి నాని తాటాకు చప్పుళ్ళకు ఇక్కడ భయపడే వారు ఎవరూ లేరని హెచ్చరించారు. మంత్రి హోదాలో ఉండి కొడాలి నాని వాడుతున్న భాష తీవ్ర అభ్యంతరకరం అన్నారు. చదువు సంస్కారం లేకుండా కొడాలి నాని మాట్లాడుతున్నారని దేవినేని ఉమా కొడాలి నానీపై ఫైర్ అయ్యారు.
ఏపీలో విద్యుత్ మీటర్ల రగడ: రైతులపై ఒక్క రూపాయి భారం పడినా రాజీనామా చేస్తానన్న మంత్రి

మీవి చిల్లర రాజకీయాలు, గల్లీ రాజకీయాలు ... ఉమా ఫైర్
చంద్రబాబు వయసు గురించి, మా చావుల గురించి మాట్లాడితే చేసిన తప్పులు కనిపించకుండా పోతాయా అంటూ ప్రశ్నించారు . చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని సంస్కార హీనంగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. చిల్లర రాజకీయాలు, గల్లీ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అసమర్ధతను, అవినీతిని కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని కొడాలి నాని తీరు గర్హనీయం అంటూ పేర్కొన్నారు. చంద్రబాబును, దేవినేని ఉమను బూతులు తిడితే అసమర్థత కప్పిపుచ్చుకోవచ్చు అని భావిస్తున్నారా? అంటూ ప్రశ్నించారు .

నానీ బెదిరింపులపై డీజీపీ సుమోటోగా కేసు బుక్ చెయ్యాలని డిమాండ్
రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబుపై హీనంగా మాట్లాడినందుకు గొంతు క్యాన్సర్ తో పోతావు అంటూ శాపనార్థాలు పెట్టారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందని దుయ్యబట్టారు. లారీలతో గుద్దిస్తాం అన్న కొడాలి నాని బెదిరింపులపై డిజిపి సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి దేవినేని ఉమ. వ్యక్తిగత విమర్శలకు దిగడం, నోటికొచ్చినట్టు తిట్టడం కరెక్ట్ కాదన్నారు దేవినేని ఉమా. రాష్ట్రంలో భావప్రకటన స్వేచ్ఛ ఉందా లేదా అని ప్రశ్నించారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరికలు జారీ చేశారు.

అభివృద్ధి చెయ్యలేకే ఎదురు దాడులు .. నోటికొచ్చిన తిట్లు
చంద్రబాబు చేసిన అభివృద్ధిని ముందుకు తీసుకు వెళ్ళ లేక వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని దేవినేని ఉమ కొడాలి నాని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు సహాయం చేసినందుకు ఒక టిడిపి కార్యకర్త కు వైసీపీ కార్యకర్త సోషల్ మీడియాలో కృతజ్ఞతలు చెప్తే , వైసిపి కార్యకర్తలు వేధింపులకు గురి చేశారంటూ, అతను చనిపోయేలా చేశారంటూ ఆరోపణలు గుప్పించారు దేవినేని ఉమా. కొడాలి నాని బెదిరిస్తే భయపడి పారిపోయేవారు టిడిపి లో ఎవరూ లేరని బల్లగుద్ది మరీ చెప్పారు ఉమా.

చంద్రబాబు పెద్ద బిచ్చగాడు అంటూ కొడాలి నానీ తీవ్ర వ్యాఖ్యలు
అంతకు ముందు మంత్రి కొడాలి నాని చంద్రబాబు పై, దేవినేని ఉమా పై విరుచుకుపడ్డారు. దోమలపై దండయాత్ర చంద్రబాబు కరోనాకు భయపడి ఎందుకు పారిపోతున్నారు అని ప్రశ్నించారు. టీడీపీ నేత అచ్చెన్నాయుడులా ఆస్పత్రిలో పడుకున్న అడ్డగాడిద ఎవరూ లేరని తిట్ల దండకం అందుకున్నారు. తననుబూతుల మంత్రి అంటున్నారని తాను బూతులు తిడితే దేవినేని ఉమ, చంద్రబాబు బ్రతికి ఉంటారా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు పెద్ద బిచ్చగాడిని, తనకు రాజకీయ భిక్ష పెట్టడం ఏంటి అని ప్రశ్నించిన కొడాలి నాని జోలె పట్టుకొని అడుక్కుతినే బ్యాచ్ మీదని వ్యాఖ్యానించారు. దేవినేని ఉమ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు