విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

16 నెల‌లు జైలుకు వెళ్ల‌లేదు: మ‌ంద‌ల‌గిరి..ఆయ‌న మంత్రిగా: మ‌ండ‌లిలో లోకేశ్ వ‌ర్సెస్ మంత్రి అనిల్‌..!

|
Google Oneindia TeluguNews

ఏపీ శాస‌న‌మండ‌లిలో మంత్రి అనిల్ వ‌ర్సెస్ టీడీపీ స‌భ్యుడు లోకేశ్ మ‌ధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది.
విద్యా మండ‌లి నిధుల మ‌ళ్ళింపు పైన మొద‌లైన వాగ్వాదం జ‌గ‌న్ కేసుల వ‌ర‌కు వెళ్లింది. తమపై 11 చార్జిషీట్లు లేవని... 16 నెలలు జైలుకు వెళ్లలేదని లోకేశ్ వ్యాఖ్యానించటంతో మంత్రి అనిల్ సైతం తీవ్రంగా స్పందించారు. మంగ‌ళ‌గిరిని పిల‌వ‌టం రాని వారు..వ‌ర్దంతికి - జ‌యంతికి తేడా తెలియ‌ని వారు మంత్రులుగా ప‌ని చేసారంటూ అనిల్ ఫైర్ వ్యాఖ్యా నించారు. ఆర్ద‌రాత్రి చిదంబ‌రం కాళ్లు ప‌ట్టుకొని జ‌గ‌న్ పైన కేసులు బ‌నాయించారని అనిల్ ఆరోపించారు. దీంతో.. రెండు ప‌క్షాల‌కు చెందిన ఎమ్మెల్సీల మ‌ధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

1.33ల‌క్ష‌ల ఉద్యోగాల భ‌ర్తీకి ఆమోదం: కొత్త బిల్లుల‌కు గ్రీన్ సిగ్న‌ల్‌ 1.33ల‌క్ష‌ల ఉద్యోగాల భ‌ర్తీకి ఆమోదం: కొత్త బిల్లుల‌కు గ్రీన్ సిగ్న‌ల్‌

విద్యాశాఖ నిధుల పైన మొద‌లై...

విద్యాశాఖ నిధుల పైన మొద‌లై...

ఏపీ శాస‌న మండ‌లిలో మంత్రి అనిల్‌..టీడీపీ ఎమ్మెల్సీ లోకేశ్ మ‌ధ్య డైలాగ్ వార్ జ‌రిగింది. మండ‌లిలో ఉన్నత విద్యా మండలిలో నిధుల అక్రమాలపై శాసనమండలిలో వాడివేడి చర్చ జరిగింది. బ్రిటీష్ కౌన్సిల్‌కు ఏడు కోట్లు, జ్ఞానబేరి కార్యక్రమానికి 5.4 కోట్లు ఇచ్చారని విద్యాశాఖ మంత్రి సురేష్ ఆరోపించారు. ఈ వ్యవహారాల్లో అప్పటి మంత్రి, అధికారు లు నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డార‌ని ఆరోపించారు. ఉన్నత విద్యా శాఖ నిధులు రూ.180 కోట్లను పసుపు కుంకు మ కు మల్లించారని సురేష్ ఆరోపించారు. దీనికి టీడీపీ ఎమ్మెల్సీ లోకేశ్ ధీటుగా స‌మాధానం ఇచ్చారు. తాము నిధుల ను పేద ప్ర‌జ‌ల కోస‌మే మ‌ళ్లించామ‌ని..సొంత కంపెనీల కోసం కాద‌ని స్ప‌ష్టం చేసారు. త‌మ పైన 11 ఛార్జ్ షీట్లు లేవ‌ని ..16 నెల‌ల జైలుకు వెళ్ల‌లేదంటూ చేసిన వ్యాఖ్య‌ల‌తో ర‌గ‌డ మొద‌లైంది.

మంత్రి అనిల్ ఫైర్‌...

మంత్రి అనిల్ ఫైర్‌...

స‌భ‌లో లోకేశ్ చేసిన వ్యాఖ్య‌ల‌తో మంత్రులు సీరియ‌స్‌గా రియాక్ట అయ్యారు. మంత్రులు సురేష్‌కు నీటి పారుద‌ల శాఖా మంత్రి అనిల్ జ‌తయ్యారు. అనిల్ స్పందిస్తూ తమది వెన్నుపోటు పార్టీ కాదని..చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకోలేదని మంత్రి అనిల్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. మంత్రి సరైన ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయటం సరికాదన్నారు. అనిల్ కుమార్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని లోకేష్ డిమాండ్ చేశారు. సాక్ష్యాధారాలు లేకుండా ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని హెచ్చ‌రించారు. మంగ‌ళ‌గిరిని..మంద‌ల గిరి అని..జ‌యంతికి - వ‌ర్దంతికి కూడా తేడా తెలియ‌ని వారు మంత్రులుగా ప‌ని చేసారంటూ ఎద్దేవా చేసారు. లోకేష్‌కు మాతృభాషలో ట్రైనింగ్ ఇప్పించాల్సిన అవసరం ఉందని అనిల్ అన్నారు. అర్ధరాత్రి కాంగ్రెస్‌తో కుమ్మక్కై చిదం బరం కాళ్లు పట్టుకుని వైఎస్ జగన్‌పై తప్పుడు కేసులు పెట్టించారన్నారు. 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను కొనగోలు చేశారని అనిల్ విమర్శలు గుప్పించారు.

స‌మావేశాల్లో సువ్వా నేనా అన్న‌ట్లుగా..

స‌మావేశాల్లో సువ్వా నేనా అన్న‌ట్లుగా..

అటు శాస‌న‌స‌భ‌లో..ఇటు శాస‌న‌మండ‌లిలో అధికార - ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య ప్ర‌తీ రోజు ప్రతీ అంశంలో వాగ్వాదం చోటు చేసుకుంటున్నాయి. స‌మావేశాలు ప్రారంభ‌మైన నాటి నుండి రెండు పార్టీల మ‌ధ్య హోరా హోరీగా స‌వాళ్లు ప్ర‌తి స‌వాళ్లు జ‌రుగుతున్నాయి. ఇక‌..ఇప్పుడు ప్ర‌భుత్వం గ‌త అయిదేళ్ల టీడీపీ హ‌యాంలో చోటు చేసుకున్న అవినీతి పైన విచార‌ణ‌కు సిద్ద‌మైంది. దీంతో..టీడీపీ సైతం దీని పైన ప్ర‌భుత్వాన్ని కార్న‌ర్ చేసే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఈ క్ర‌మంలో వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లు..నిరూప‌ణ‌లతో అసెంబ్లీ స‌మావేశాలు పూర్తిగా ప‌క్క‌దారి ప‌డుతున్నాయి. అయితే, శాస‌న‌స‌భ‌లో ఎంత ర‌గ‌డ జ‌రిగినా స్పీక‌ర్ మాత్రం ప్ర‌శ్నోత్త‌రాల‌ను పూర్తి చేయ‌టం మాత్రం స‌భ్యుల‌కు మేలు చేసే అంశం.

English summary
Dialogue war between Minister Anil and TDP MLC Lokesh in legislative council in peak. Ministers target TDP members on funds diversion in Education department.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X