విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌‌పై కక్ష..చంద్రబాబుతో సాయిరెడ్డి స్కెచ్ - కన్నా కోవర్టు ముసుగు - ఎవరికెవరు ఫిట్టింగ్?

|
Google Oneindia TeluguNews

వ్యవహారం మంచైనా, చెడైనా పక్క పార్టీలను తిట్టడమే ఇవతలి పార్టీలు సహజంగా చేసే పని. కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా తయారైంది. ఒక పార్టీ నేతలు ఇంకో పార్టీ తరఫున వకాల్తా పుచ్చుకోవడం.. ఆ ఇంకో పార్టీలోని ఓ వర్గం భిన్నంగా స్పందించడం.. ఇద్దరూ కలిసి మూడో పార్టీని టార్గెట్ చేసినట్లే చేసి యూటర్న్ తీసుకోవడం.. పొలిటికల్ థ్రిల్లర్ ను తలపిస్తోంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జాతీయ పార్టీ బీజేపీ మధ్య ట్విస్టింగ్ వ్యవహారాలు తారా స్థాయికి చేరాయి. అసలు ఎవరు ఎవరి కోసం మాట్లాడుతున్నారో.. ఏకోణంలో ఫిట్టింగ్స్ పెడుతున్నారో.. అంతిమంగా ఇది ఎటు దారి తీస్తుందోననే చర్చ లోతుగా సాగుతోందిప్పుడు..

Recommended Video

Pawan Kalyan ట్వీట్ పై హర్షం వ్యక్తం చేస్తున్న CM Jagan ఫ్యాన్స్ || Oneindia Telugu

జగన్ భార్య భారతికి బ్లాక్‌మనీ లింకులు.. బాలినేని ఘటనపై లోకేశ్ బాంబు.. సాయిరెడ్డి లోకజ్ఞాన ప్రబోధజగన్ భార్య భారతికి బ్లాక్‌మనీ లింకులు.. బాలినేని ఘటనపై లోకేశ్ బాంబు.. సాయిరెడ్డి లోకజ్ఞాన ప్రబోధ

వద్దన్నా అదే పనిగా..

వద్దన్నా అదే పనిగా..

మూడు పార్టీల మధ్య కొనసాగుతోన్న మాటల యుద్ధంలో వైసీపీ యోధుడిగా ఎంపీ విజయసాయి రెడ్డి వీర ప్రతాపం చూపిస్తున్నారు. ‘‘బీజేపీ జోలికి రాకండి.. మేం టీడీపీనేకాదు, అవసరమైతే వైసీపీని కూడా భారీగా గుల్ల చేయగలం''అని ఏపీ ఇన్ చార్జి సునీల్ దేవధర్ అంతటి వ్యక్తి హెచ్చరించిన తర్వాత కూడా సాయిరెడ్డి తన పంథా వీడలేదు. ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణపై అదేపనిగా విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. తాజాగా మూడు రాజధానులపై గవర్నర్ కు కన్నా లేఖ రాయడాన్నిబట్టి ఆయన చంద్రబాబు కోవర్టేనని రుజువైనట్లు ఎంపీ పేర్కొన్నారు. దీనికి కన్నాతోపాటు బీజేపీలోని ఇతర నేతలూ దిమ్మతిరిగే రీతిలో కౌంటరిచ్చారు.

దేశంలో తొలిసారి.. జగన్ ప్రతిష్ట రెట్టింపు.. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆవిష్కణకు కేంద్రం ఫండింగ్.దేశంలో తొలిసారి.. జగన్ ప్రతిష్ట రెట్టింపు.. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆవిష్కణకు కేంద్రం ఫండింగ్.

ఇంకా ఎన్నాళ్లీ ముసుగు?

ఇంకా ఎన్నాళ్లీ ముసుగు?


ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు అంశం పూర్తిగా రాష్ట్రానికే సంబంధించిందని, కేంద్రం జోక్యం చేసుకోబోదని బీజేపీ హైకమాండ్ మొదటి నుంచీ బల్లగుద్ది చెబుతోంది. కానీ అందుకు విరుద్ధంగా, మూడు రాజధానుల బిల్లును ఆమోదించొద్దంటూ ఆ పార్టీ ఏపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ గవర్నర్ కు లేఖరాయడంతో హైకమాండ్ ఆగ్రహించిందని వార్తలు వచ్చాయి. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ సాయిరెడ్డి మరోసారి కన్నాను టార్గెట్ చేశారు. ‘‘కన్నా లక్ష్మీనారయణ చంద్రబాబు కోవర్టు అని మళ్ళీ స్పష్టమైంది. సొంత పార్టీ అభిప్రాయానికి వ్యతిరేకంగా చంద్రబాబుకి అనుకూలంగా రాజధాని బిల్లు ఆమోదించవద్దని గవర్నర్ గారికి లేఖ రాసారు. దీనితో పార్టీ అధిష్టానం ఆగ్రహానికి కూడా గురయ్యాడు. ఇంకా ఎన్నాళ్ళు ఈ ముసుగు కన్నా?''అని ప్రశ్నించారు.

బాబుతో భౌతిక దూరం..

బాబుతో భౌతిక దూరం..


కన్నాపై విమర్శల పరంపరను కొనసాగిస్తూ, బీజేపీ హైకమాండ్ హితవుగా సాయిరెడ్డి మరిన్ని వాగ్బాణాలు వదిలారు. చంద్రబాబుతో భౌతిక దూరం పాటించాలని బీజేపీ అగ్రనాయకత్వం హెచ్చరించినా కన్నా వినడంలేదని, ఎంతసేపూ టీడీపీ లైన్ లోనే లేఖలు రాస్తున్నారని మండిపడ్డారు. ‘‘కరోనా టైంలోనైనా సోషల్ డిస్టెన్స్ పాటించకపోతే ఎలా కన్నా? బీజేపీ స్టేట్ ఇన్ చార్జి సునీల్ దేవధర్ కూడా రాజధానుల ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వ ఇష్టం అన్నారుగా కన్నా. అయినా కూడా ఏంటిది? ఓహో ఇదంతా నీ పచ్చ స్వామి భక్తినా?'' అని సెటైర్లు వేశారు. దీనికి కన్నా..

ఏడాదిగా ఏం చేస్తున్నట్లు?

ఏడాదిగా ఏం చేస్తున్నట్లు?

ఒకదిక్కు వైసీపీ నేతలు తనను ‘చంద్రబాబు కోవర్డు'అని ఆరోపిస్తున్నప్పటికీ కన్నా సైతం శైలిని మార్చుకోకపోవడం గమనార్హం. చంద్రబాబు నిజంగా అవినీతిపరుడైతే ఆయనపై జగన్ సర్కారు ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ మరోసారి టీడీపీ అధినేతకు అనుకూల వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అక్రమాలపై వైసీపీ గతంలో రూపొందించిన ‘‘ఎంపరర్ ఆఫ్ కరప్షన్'' కరపత్రాన్ని సైతం గుర్తుచేశారు. ‘‘ఎంపరర్ ఆఫ్ కరప్షన్ లో మీరు(వైసీపీ) ప్రకటించిన రూ.3లక్షల కోట్ల అవినీతిపై మీరు అధికారం చేపట్టాక తీసుకున్న చర్యలేంటి ?''అని కన్నా సవాలు విసిరారు.

అందుకే జగన్‌కు పిచ్చి సలహాలు..

అందుకే జగన్‌కు పిచ్చి సలహాలు..

తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుణ్ణి అవమానిస్తోన్న వైసీపీని తిట్టే క్రమంలో బీజేపీ నేతలు.. సీఎం జగన్ కు మాత్రం మినహాయింపులిస్తూ, ఆయనపై సాఫ్ట్ కార్నర్ ప్రదర్శిస్తుండటం గమనార్హం. ఈ క్రమంలో బీజేపీ నేత లంకా దినకర్ అనూహ్య వాదనను తెరపైకి తెచ్చారు. చంద్రబాబుకు అసలైన తొత్తు విజయసాయిరెడ్డే అని, జగన్ కు చెడ్డపేరు తేవాలనే ఇలా వ్యవహరిస్తున్నాడని బాంబు పేల్చారు. ఎంపీ రఘురామ వివాదంలోనూ విలన్ సాయిరెడ్డేనని దినకర్ తేల్చేశారు. ‘‘కొన్ని జీవితాలకు ఎప్పటికీ బుద్ధిరాదు. రఘరామకృష్ణమరాజు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడల్లా ఆ ఒత్తిడి నుంచి బయటపడటానికి సాయిరెడ్డి ఏదో ఒక వేషం వేస్తాడు. అందులోనూ ఇవాళ అమావాస్య కావడంతో అసలు రూపం బయటికొచ్చింది. చంద్రబాబు తొత్తు సాయిరెడ్డే. జగన్ పై పగపట్టి పిచ్చి సలహాలిచ్చి చెడ్డ పేరు తెస్తున్నాడు'' అని దినకర్ పేర్కొన్నారు. ప్రస్తుత ఎపిసొడ్ లో వ్యూహాత్మక మౌనం పాటిస్తోన్న టీడీపీ.. ఎదురుదాడి కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది.

English summary
amid several warnings form bjp high command, ysrcp mp vijaya sai reddy once agin targets ap bjp chief kanna laxminarayana, accusing him as chandrababu's covert. bjp's lanka dinakar strong counter to vijaya sai reddy
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X