విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మూడు రాజధానులపై బీజేపీ అంత్మథనం- కేంద్రాన్ని సమర్ధించలేక- వైసీపీని విమర్శించలేక...

|
Google Oneindia TeluguNews

ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం అందరి ఎక్కువగా బీజేపీకే చుక్కలు చూపిస్తున్నట్లుగా కనిపిస్తోంది. రాజధానుల ఏర్పాటు విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని తేలిపోగా.. ఇప్పుడు బీజేపీ నేతలు అసలు మూడు రాజధానులు ఎందుకంటూ కొత్తగా వేస్తున్న ప్రశ్నలు ఆ పార్టీ ద్వంద వైఖరికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. కేంద్రం తలుచుకుంటే అసలు ఈ ప్రక్రియే ముందుకు సాగదని తెలిసి కూడా కేంద్ర పెద్దల వైఖరికి వ్యతిరేకంగా కాషాయ నేతలు చేస్తున్న ప్రకటనలు ఆ పార్టీలో మరింత గందరగోళానికి తెర లేపుతున్నాయి. ముఖ్యంగా ప్రారంభమే కాని రాజధానుల్లో అవినీతిని ప్రశ్నిస్తామంటూ సీనియర్ నేత రామ్‌మాధవ్ చేసిన ప్రకటన ఈ గందరగోళానికి హైలెట్‌గా నిలిచిందనే వాదన వినిపిస్తోంది.

ముందునుంచీ గందరగోళమే...

ముందునుంచీ గందరగోళమే...

ఏపీలో మూడు రాజధానుల ప్రకటన రాగానే ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు దీనిపై ఎలాంటి స్పష్టమైన వైఖరీ ప్రకటించలేదు. ఆ తర్వాత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ అమరావతే రాజధానిగా ఉంటుందంటూ ప్రకటించి మూడు రాజధానులకు తాము వ్యతిరేకమంటూ చెప్పకనే చెప్పారు. ఆ తర్వాత కేంద్రం జోక్యం కోరతామంటూ బీజేపీ నేతలు స్వరం పెంచారు. చివరికి కేంద్రాన్ని బీజేపీ నేతలు అడగకముందే పార్లమెంటులో టీడీపీ ఎంపీలు కేశినేని, గల్లా అడిగిన ప్రశ్నలకు అప్పుడే క్లారిటీ వచ్చేసింది. అయినా నిన్న మొన్నటి వరకూ సుజనా చౌదరి వంటి నేతలు కేంద్రం జోక్యం చేసుకుని తీరుతుందంటూ ప్రకటనలు చేస్తూ వచ్చారు. దీనిపై పదేపదే జీవీఎల్, సునీల్ దేవధర్ వంటి నేతలు స్పష్టత ఇచ్చినా దాన్ని లెక్కచేయకుండా సోము వీర్రాజును అధ్యక్షుడిగా ప్రకటించాక కూడా ఇదే గందరగోళాన్ని కొనసాగించారు.

పార్టీ పగ్గాలు మారినా...

పార్టీ పగ్గాలు మారినా...

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజును ప్రకటించిన తర్వాత కూడా ఎంపీ సుజనా చౌదరి రాజధానిలో కేంద్రం జోక్యం చేసుకుంటుందంటూ చేసిన వ్యాఖ్యలను ఏకంగా సోము వీర్రాజే ఖండించాల్సి వచ్చింది. ఆ వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని చెప్పుకోవాల్సి వచ్చింది. అ తర్వాత ఇదంతా ఎందుకని మూడు రాజధానులపై తమ స్టాండ్ వివరిస్తూ సోము వీర్రాజు ఓ ప్రెస్‌నోట్ విడుదల చేశారు. అందులోనూ కేంద్రం రాజధానిలో జోక్యం చేసుకోబోదని, కానీ పార్టీ గతంలో అమరావతికి మద్దతుగా చేసిన రాజకీయ తీర్మానం అనుసరిస్తామంటూ చేసిన ప్రకటన మరింత గందరగోళానికి దారి తీసింది. అంటే గతంలో అమరావతికి మద్దతుగా నిర్ణయం తీసుకున్నాం కాబట్టి దాన్నుంచి యూటర్న్ తీసుకోలేని పరిస్ధితి ఉందంటూ సోమువీర్రాజు చెప్పినట్లయింది.

రామ్ మాథవ్ ప్రకటనతో మరింత..

రామ్ మాథవ్ ప్రకటనతో మరింత..


ఇప్పటికే మూడు రాజధానులపై ఎలా స్పందించాలో తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్ర బీజేపీ నేతలకు సీనియర్ నేత రామ్ మాథవ్ ఓ క్లారిటీ ఇస్తారనుకుంటే ఆయన నిన్న జరిగిన సోము వీర్రాజు పదవీ స్వీకార సభలో మరింత గందరగోళానికి తెర దీశారు. కేంద్రం రాజధానిపై గతంలో జోక్యం చేసుకోలేదని, ఇప్పుడూ జోక్యం చేసుకోబోదన్నారు. అయినా అంత పెద్ద యూపీకే ఓ రాజధాని ఉంది మీకు మాత్రం మూడు రాజధానులు ఎందుకంటూ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తద్వారా కేంద్రం వైఖరికీ, పార్టీ వైఖరికీ తేడా ఉందన్నట్లుగా చెప్పుకొచ్చారు. దీంతో అసలు బీజేపీకి ఇష్టం లేని మూడు రాజధానులకు కేంద్రం మాత్రం ఎలా మద్దతిస్తుందనే ప్రశ్నలు తలెత్తాయి.

Recommended Video

AP 3 Capitals : అమరావతి ముహుర్తానికే ప్రధాని మోదీ చేతుల మీదుగా విశాఖలో శంకుస్థాపన..! || Oneindia
మొదలు కానీ రాజధానుల్లో అవినీతి...

మొదలు కానీ రాజధానుల్లో అవినీతి...

సోము వీర్రాజు పదవీ ప్రమాణ సభలో రామ్‌ మాథవ్ మరో ఆసక్తికర వ్యాఖ్య కూడా చేశారు. గతంలో అమరావతి రాజధాని నిర్మాణంలో అవినీతి జరిగితే ప్రశ్నించామని, ఇప్పుడు మూడు రాజధానుల్లో జరిగినా ప్రశ్నిస్తామంటూ ఓ ఊహాజనిత ప్రశ్నకు తెరలేపారు. మూడు రాజధానులకు ఎంత ఖర్చుపెడతారో ఏపీ ప్రభుత్వం చెప్పకపోయినా, నిధులపై కేంద్రం స్పందించకపోయినా అవినీతి కచ్చితంగా జరుగుతుందని రామ్ మాథవ్ అంచనా వేయడమేంటని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా మొదలు కాని మూడు రాజధానులపై కొత్త ప్రశ్నలు లేవనెత్తడం, అవినీతి జరిగితే ప్రశ్నిస్తామనడం ద్వారా కాషాయ నేతలు అసలు ఈ వ్యవహారంలో ఎంత సీరియస్‌గా ఉన్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయనే ప్రచారం జరుగుతోంది.

English summary
dilemma continues in andhra pradesh bjp unit over formation of three capitals in the state. one side bjp says that centre has no role in it and other side leaders questioning the whole idea.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X