విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దుర్గమ్మ తెప్పోత్సవంపై సందిగ్ధం ... కృష్ణమ్మ ఉధృతి నేపధ్యంలో డైలమా

|
Google Oneindia TeluguNews

ఏపీలోని బెజవాడలో కొలువైన తల్లి కనకదుర్గమ్మ దసరా శరన్నవరాత్రులు జరుగుతున్నాయి . ప్రతి ఏడు అత్యంత వైభవంగా జరిగే విజయవాడలోని కనకదుర్గ అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ ఏడు కరోనా కారణంగా కరోనా నిబంధనల మేరకు కొనసాగుతున్నాయి. ఒకపక్క కరోనా, మరోపక్క రాష్ట్రంలో విపరీతంగా కురిసిన భారీ వర్షాలు దసరా వేడుకలకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరు కాకుండా చేశాయి. ఇంద్రకీలాద్రిపై విరిగి పడుతున్న కొండచరియలు కూడా భక్తులకు విఘాతంగా మారాయి .

విరిగిపడ్డ కొండచరియ: ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డుపై బండరాళ్లు: భయాందోళనల్లో భక్తులువిరిగిపడ్డ కొండచరియ: ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డుపై బండరాళ్లు: భయాందోళనల్లో భక్తులు

 కృష్ణా నదిలో అమ్మవారి తెప్పోత్సవం జరిగేనా ?

కృష్ణా నదిలో అమ్మవారి తెప్పోత్సవం జరిగేనా ?

ఇదిలా ఉంటే విజయవాడ దసరా ఉత్సవాల్లో భాగంగా ఆఖరి రోజున కృష్ణానదిలో జరిగే కనకదుర్గ అమ్మవారి నదీవిహారం పై కూడా సందిగ్ధత నెలకొంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా నదికి విపరీతంగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో అమ్మవారి తెప్పోత్సవం నిర్వహించాలా వద్దా అన్నది ఇప్పుడు సంశయంగా మారింది . ఈనెల 25వ తేదీన అమ్మవారి తెప్పోత్సవం నిర్వహించాలి. అయితే ఇప్పటివరకు తెప్పోత్సవ నిర్వహణపై దుర్గ గుడి అధికారులకు క్లారిటీ రాలేదు.

ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణానదికి వరద ఉధృతి ..

ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణానదికి వరద ఉధృతి ..

ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద మూడు లక్షల 77 వేల క్యూసెక్కుల అవుట్ ఫ్లో కొనసాగుతుండగా తెప్పోత్సవానికి మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉన్న కారణంగా వరద ఉధృతి తగ్గుతుందా లేదా అన్నది అర్ధం కాకుండా ఉంది. మరోపక్క ఇరిగేషన్ శాఖ అధికారులు కృష్ణా నదిలో వరద ఉధృతి ఎక్కువగా ఉందని, వరద ఉధృతి తగ్గితేనే తెప్పోత్సవానికి అనుమతిస్తామని చెప్తున్నారు. అయితే విజయవాడ దుర్గ గుడి అధికారులు ప్రస్తుతం అమ్మవారిని నదీ విహారం చేయించేందుకు హంసవాహనం ఐతే సిద్ధం చేస్తున్నారు.

ఇరిగేషన్ అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే తెప్పోత్సవం

ఇరిగేషన్ అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే తెప్పోత్సవం

ఇరిగేషన్ శాఖ అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇస్తే అమ్మవారి తెప్పోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించనున్నారు. మరి కృష్ణమ్మ ఉధృతి అప్పటికి తగ్గుతుందా? లేదా మరింత ఉదృతంగా కృష్ణానది ప్రవహిస్తే అమ్మవారి తెప్పోత్సవం కొనసాగుతుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
అటు ఇరిగేషన్ , ఇటు ఆలయాధికారులు తెప్పోత్సవ నిర్వహణపై తర్జన భర్జన పడుతున్నారు.

Recommended Video

Vijayawada Kanaka Durga Flyover Opened For Traffic బెజవాడ వాసులుకు ట్రాఫిక్ కష్టాల నుండి ఉపశమనం..!!
 నేడు మహాలక్ష్మిగా భక్తులకు దర్శనం ఇచ్చిన అమ్మవారు

నేడు మహాలక్ష్మిగా భక్తులకు దర్శనం ఇచ్చిన అమ్మవారు

దసరా ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మిదేవి గా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇటీవల ఇంద్రకీలాద్రి పర్వతంపై కొండచరియలు విరిగి పడుతున్న నేపథ్యంలో పోలీసులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మరిన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కరోనా నేపథ్యంలో గతంతో పోలిస్తే ఈసారి అమ్మవారి దర్శనానికి ఇప్పటివరకు వచ్చిన భక్తులు సంఖ్య తక్కువనే చెప్పాలి.

English summary
In Vijayawada Goddess Kanakadurga river cruise on the Krishna River on the last day as part of the Dussehra celebrations is also in doubt. It is now doubtful whether the Theppotsavam will be held as the Krishna River is flooded due to heavy rains . kanakadurga Theppotsavam should be organized on the 25th of this month. So far, however, the Durga temple authorities have not received any clarification on the conduct of the teppotsavam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X