• search
 • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

దివ్య కేసు .. నాగేంద్రను ఎన్ కౌంటర్ చెయ్యాలన్న తండ్రి , ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడిన వైద్యులు

|

విజయవాడ దివ్య తేజస్విని మృతి కేసులో రోజుకో రకమైన సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిన్నటికి నిన్న దివ్య తేజస్విని, తాను పెళ్లి చేసుకున్నామని , దివ్య ఇంట్లో తల్లిదండ్రులు వారి పెళ్లిని అంగీకరించకపోవడంతోనే ఇద్దరు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకొని ఎవరు గొంతు వారే కోసుకున్నామని నిందితుడు నాగేంద్రబాబు చెప్పారు. అయితే అదంతా అబద్ధమని ఆమె తల్లిదండ్రులు ఖండిస్తున్నారు. ప్రేమోన్మాది ఘాతుకానికి బలైపోయిన దివ్యతేజస్విని తండ్రి తన కుమార్తెను అత్యంత కిరాతకంగా హత్య చేసిన నాగేంద్ర కు ఉరి శిక్ష పడాలని లేదా ఎన్కౌంటర్ చేసి చంపాలంటూ డిమాండ్ చేశారు.

దిశ స్ఫూర్తితో దివ్య కేసులో ఏడు రోజులలో ఛార్జ్ షీట్ దాఖలు చేస్తాం : ఏపి డిజిపి గౌతమ్ సవాంగ్

 ఎన్ కౌంటర్ చెయ్యండి .. దివ్య తేజస్విని తండ్రి డిమాండ్

ఎన్ కౌంటర్ చెయ్యండి .. దివ్య తేజస్విని తండ్రి డిమాండ్

నాగేంద్ర నేరుగా తన ఇంటికి వచ్చి తన కుమార్తె పై దాడి చేసి 13 కత్తి పోట్లు పొడిచి చంపాడని కన్నీటిపర్యంతమయ్యారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నాగేంద్ర ను ఎన్కౌంటర్ చేయాలని దివ్య తేజస్విని తండ్రి డిమాండ్ చేస్తున్నారు. తన కూతురు బతికి ఉంటే అసలు విషయం బయటపడేదని, దివ్య చనిపోవడంతో కట్టుకథలు అల్లుతున్నాడని దివ్య తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఫోటోలను మార్ఫ్ చేసి పెళ్లి చేసుకున్నట్లుగా కట్టుకథలు చెప్తున్నాడు అంటూ దివ్య తల్లిదండ్రులు మండిపడుతున్నారు.

తల్లిదండ్రులను ప్రశ్నిస్తున్న పోలీసులు .. తల్లిదండ్రుల మండిపాటు

తల్లిదండ్రులను ప్రశ్నిస్తున్న పోలీసులు .. తల్లిదండ్రుల మండిపాటు

నాగేంద్ర దివ్యను చంపాలని నిర్ణయించుకునే పక్కా ప్లాన్ తో ఇదంతా చేస్తున్నారని వారంటున్నారు .నాగేంద్ర ఇచ్చిన వాంగ్మూలం మేరకు పోలీసులు దివ్య నాగేంద్ర రహస్య వివాహం పై తల్లిదండ్రులను ప్రశ్నిస్తున్నారు. దీంతో పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని నాగేంద్ర తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తన బిడ్డను అన్యాయంగా బలి తీసుకున్నాడని వారు ఆరోపిస్తున్నారు . దివ్య ఇంజనీరింగ్ చదువుకునే అమ్మాయి అని, తాము ఎంతో గారాబంగా పెంచుకున్నామని తల్లి రోదిస్తుంది.

దివ్యపై జరుగుతుంది అసత్య ప్రచారం అంటున్న తల్లి

దివ్యపై జరుగుతుంది అసత్య ప్రచారం అంటున్న తల్లి

నాగేంద్ర ఒక పెయింటర్ అని, గంజాయి తాగుతూ చిల్లరగా తిరిగే వాడని , అలాంటి తిరుగుబోతును దివ్య ఎందుకు పెళ్లి చేసుకుంటుంది అని తల్లి కుసుమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా కావాలని చేస్తున్న దుష్ప్రచారం , అదంతా నమ్మొద్దు అంటూ దివ్య తల్లి కుసుమ కోరుతున్నారు. మరోవైపు యువతిపై కత్తితో దాడి చేసి ప్రాణాలు తీసి, ఆపై తాను పొడుచుకొని తీవ్రంగా గాయపడినట్టుగా భావిస్తున్న నాగేంద్ర కు గుంటూరు జిజిహెచ్ ఆసుపత్రిలో వైద్య చికిత్సలు కొనసాగుతున్నాయి.

  Vijayawada Kanaka Durga Flyover Opened For Traffic బెజవాడ వాసులుకు ట్రాఫిక్ కష్టాల నుండి ఉపశమనం..!!
  తీవ్రంగా గాయపడిన నాగేంద్రకు సర్జరీ .. ప్రాణాలు కాపాడిన వైద్యులు

  తీవ్రంగా గాయపడిన నాగేంద్రకు సర్జరీ .. ప్రాణాలు కాపాడిన వైద్యులు

  నాగేంద్ర కు కత్తి పోట్లతో తీవ్ర రక్తస్రావం కావడంతో శస్త్రచికిత్స చేసి వైద్యులు రక్తస్రావాన్ని ఆపారు. అతని అన్నవాహిక పేగులకు గాయాలయ్యాయని, వాటి కోసం ఆపరేషన్ చేసినట్లుగా వైద్యులు వెల్లడించారు. అతను సాధారణ స్థితికి రావడానికి మూడు వారాల సమయం పడుతుందని డాక్టర్లు చెబుతున్నారు. మరోపక్క దిశ స్ఫూర్తిగా 7 రోజుల్లో ఈ కేసులో చార్జిషీటు దాఖలు చేస్తామని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. సిపి స్వీయ పర్యవేక్షణలో దర్యాప్తు జరిగేలా ఆదేశాలు జారీ చేసినట్లుగా ఆయన వెల్లడించారు . చిన్నారులపై, మహిళలపై దాడులకు పాల్పడితే ఎట్టిపరిస్థితుల్లోనూ పోలీస్ శాఖ ఉపేక్షించదని ఏపీ డీజీపీ పేర్కొన్న విషయం తెలిసిందే .

  English summary
  In Divya Tejaswini's case, Divya's father is demanding that Nagendra be encountered instead of repeating similar incidents. Nagendra suffered severe bleeding with stab wounds and doctors operated and rescued Nagendra.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X