విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దివ్య హత్య కేసుపై జగన్ ఫోకస్ - సీఎంను కలిసిన మృతురాలి కుటుంబం - రూ.10 లక్షలు పరిహారం

|
Google Oneindia TeluguNews

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విజయవాడ బీటెక్ విద్యార్థిని దివ్య తేజస్విని హత్య కేసుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేక దృష్టి సాధించారు. దివ్య తల్లిదండ్రులు జోసెఫ్‌, కుసుమ, సోదరుడు దినేశ్‌లు మంగళవారం తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసులో సీఎంను కలిసి, న్యాయం చేయాల్సిందిగా అభ్యర్థించారు. హోం మంత్రి సుచరిత, విజయవాడ తూర్పు వైసీపీ ఇంచార్జ్‌ దేవినేని అవినాశ్‌లు దివ్య కుటుంబాన్ని సీఎం వద్దకు తీసుకెళ్లారు. దివ్య కుటుంబానికి రూ.10లక్షల ఆర్థికసాయం అందించాలని హోంమంత్రికి సీఎం సూచించారు.

సీఎం రేసులో చిత్తూరు వైసీపీ నేత - జగన్‌పై 2లక్షల మెజార్టీ ఇలా - వాలంటీర్ల దుస్థితి:ఎంపీ రఘురామసీఎం రేసులో చిత్తూరు వైసీపీ నేత - జగన్‌పై 2లక్షల మెజార్టీ ఇలా - వాలంటీర్ల దుస్థితి:ఎంపీ రఘురామ

జగన్ ఓదార్పు..

జగన్ ఓదార్పు..

తనను కలిసేందుకు వచ్చిన దివ్య కుటుంబంతో సీఎం అరగంటకుపైగా మాట్లాడారు. జరిగిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకుని, ఆ కుటుంబాన్ని ఓదార్చారు. అనంతరం మంత్రి సుచరిత, దివ్య కుటుంబం మీడియాతో మాట్లాడారు. తమ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లామని, నిందితులను కఠినంగా శిక్షించాలని కోరామని, అందుకు సీఎం హామీ ఇచ్చారని దివ్య తండ్రి జోసెఫ్ వెల్లడించారు.

 నాగేంద్రబాబుపై దిశ యాక్ట్..

నాగేంద్రబాబుపై దిశ యాక్ట్..

ప్రెస్ మీట్ లో హోం మంత్రి మాట్లాడుతూ.. ఏపీలో ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరిస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు చెప్పారు. దివ్య తల్లిదండ్రులు చెప్పిన మాటలు విని సీఎం చలించిపోయారని, ఆ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారని, రూ. 10లక్షలు ఆర్థిక సాయం కూడా ప్రకటించారని మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న నిందితుడు నాగేంద్రబాబు కొలుకోగానే అదుపులోకి తీసుకుంటామని, అతనిపై దిశ చట్టం కింద కూడా కేసు నమోదు చేస్తామని సుచరిత చెప్పారు. పాత పరిచయాన్ని సాకుగా వాడుకుని దివ్య తేజస్వినిని నాగేంద్ర వేధించేవాడని, ఇలాంటి ఘటనలపై మహిళలు ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని హోం మంత్రి అన్నారు.

 దివ్య కేసుపై జగన్ ప్రత్యేక దృష్టి

దివ్య కేసుపై జగన్ ప్రత్యేక దృష్టి

సీఎంతో భేటీ అనంతరం దివ్య కుటుంబీకులు, హోం మంత్రి నిర్వహించిన ప్రెస్ మీట్ లో రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ కూడా మాట్లాడారు. దివ్యను కిరాతకంగా హత్య చేయడం బాధాకరమని, ఆమె కుటుంబానికి పభుత్వం అండగా ఉంటుందని డీజీపీ భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక దృష్టి సారించారని డీజీపీ తెలిపారు. 7 రోజుల్లో ఘటనపై చార్జిషీటు దాఖలు చేస్తామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని సవాంగ్ వెల్లడించారు.

ఏపీలో కరోనా: అరుదైన రికార్డు - 94.9శాతంతో దేశంలోనే టాప్ - మరింత తగ్గిన కొత్త కేసులుఏపీలో కరోనా: అరుదైన రికార్డు - 94.9శాతంతో దేశంలోనే టాప్ - మరింత తగ్గిన కొత్త కేసులు

English summary
Days after her 21-year-old daughter Divya Tejaswini was killed by her alleged husband Budigi Nagendra Babu alias Chinna Swamy, her parents met Chief Minister Y S Jagan Mohan Reddy. The Chief Minister announced Rs 10 lakh compensation to Divya’s parents.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X