దివ్య తేజస్విని హత్య కేసులో నాగేంద్ర అరెస్ట్ కు రంగం సిద్ధం .. వైద్యులు డిశ్చార్జ్ చెయ్యగానే ..
విజయవాడ బీటెక్ విద్యార్థిని దివ్య తేజస్విని మృతి కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించిన పోలీసులు ఈ కేసులో పక్కా ప్రణాళిక ప్రకారమే దివ్య హత్య చేసినట్లుగా నిర్ధారించిన విషయం తెలిసిందే .ఈ హత్యకేసులో నిందితుడు నాగేంద్రను అరెస్ట్ చెయ్యటానికి పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు.
దివ్య తేజస్విని కేసులో విచారణ పూర్తి చేశామని చెబుతున్న పోలీసులు, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేశామని చెబుతున్నారు. ఆస్పత్రి వర్గాలు నాగేంద్ర ను డిశ్చార్జ్ చెయ్యటానికి ఓకే అంటే అరెస్ట్ చేస్తామని అంటున్నారు.
దివ్య తేజస్విని హత్య కేసు దర్యాప్తులో కీలక మలుపు .. పక్కా ప్లాన్ ప్రకారమే హత్య

పక్కా ప్లాన్ ప్రకారమే దివ్య హత్య
దివ్య కేసు నిందితుడి అరెస్ట్ గురించి విజయవాడ సీపీ శ్రీనివాసులు మాట్లాడుతూ ఫోరెన్సిక్ మెడికల్ రిపోర్టులు వచ్చాయని, నాగేంద్ర ఎవరికి వారిమే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు అని చెప్పిన విషయంలో ఎలాంటి వాస్తవం లేదని పేర్కొన్నారు. దివ్య తేజస్విని నిందితుడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించినట్లుగా ఆధారాల ద్వారా తెలుస్తోందని, ఆ సమయంలోనే ఆమె చేతులకు కత్తి గాట్లు పడ్డాయని పేర్కొన్నారు.
గొంతు కోసి, కడుపులో పలుమార్లు పొడిచి దివ్యను నాగేంద్ర పక్కా ప్లాన్ ప్రకారమే హతమార్చారని ఆయన అన్నారు.

వైద్యులు నాగేంద్రను డిశ్చార్జ్ చేస్తే అరెస్ట్ చేస్తాం : సీపీ శ్రీనివాసులు
శాస్త్రీయ ఆధారాలు నివేదికలో ఉన్నాయని తెలిపిన సిపి కత్తిపోట్లపై నిపుణుల నుండి అభిప్రాయాలను కూడా తీసుకున్నామంటూ స్పష్టం చేశారు. దివ్య తేజస్విని హతమార్చడంతో పాటుగా తనకు తాను కత్తితో తీవ్రంగా గాయపరచుకున్న నాగేంద్ర కు గుంటూరు జిజిహెచ్ ఆసుపత్రిలో వైద్య చికిత్స అందించిన విషయం తెలిసిందే. నాగేంద్ర కు కత్తిపోట్లు కడుపులో బలంగా దిగటంతో ఆపరేషన్ చేసిన వైద్యులు నాగేంద్ర ప్రాణాలను కాపాడారు. నాగేంద్ర ఆసుపత్రిలో ఇంతకాలం చికిత్స పొందుతున్న నేపథ్యంలోనే అరెస్టు చేయలేకపోయామని, వైద్యులు నాగేంద్ర ను డిశ్చార్జ్ చేసే లీగల్ ఫార్మాలిటీస్ పూర్తి చేసి అరెస్టు చేస్తామని పేర్కొన్నారు.

మరోమారు కస్టడీకి తీసుకుని విచారిస్తాం అంటున్న పోలీసులు
కోర్టులో హాజరుపరిచిన తర్వాత న్యాయమూర్తి అనుమతితో మరోసారి కస్టడీలోకి తీసుకొని నాగేంద్ర నుండి వివరాలు రాబడతామని స్పష్టం చేశారు విజయవాడ సిపి.
ప్రేమోన్మాది ఘాతుకానికి బలైపోయిన దివ్యతేజస్విని తల్లిదండ్రులు నేడు ఏపీ సీఎం జగన్ ను కలిశారు . నేరస్తుడికి కఠిన శిక్ష పడేలా చేస్తామని సీఎం జగన్ కూడా దివ్య తల్లిదండ్రులకు మాటిచ్చారు. అంతే కాదు ప్రేమోన్మాది దాడిలో మృతి చెందిన దివ్య కుటుంబానికి పది లక్షల రూపాయల ఆర్ధిక సాయం అందిస్తామని సీఎం జగన్ చెప్పారు .