విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దొంగ జేఏసీలు, చంద్రబాబు లాంటి సన్నాసులతో కాదు చర్చించాల్సింది : మంత్రి కొడాలి నానీ

|
Google Oneindia TeluguNews

ఏపీలో మూడు రాజధానులను ప్రజలు స్వాగతిస్తుంటే ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు రోడ్ల మీదకు వచ్చి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఏపీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. దొంగ జేఏసీలు, పెయిడ్ ఆర్టిస్ట్ ల ఉద్యమాలు, చంద్రబాబు లాంటి సన్నాసులు, వెధవల మాటలు నమ్మవద్దని ఆయన పేర్కొన్నారు.

చంద్రబాబు నాయుడు పిట్టల దొర.. పగటి వేషగాడు: మంత్రి కొడాలి నానీ చంద్రబాబు నాయుడు పిట్టల దొర.. పగటి వేషగాడు: మంత్రి కొడాలి నానీ

రాజధాని రైతులకు సమస్య ఉంటే సీఎం జగన్ దగ్గరకు రావాలన్న కొడాలి నానీ

రాజధాని రైతులకు సమస్య ఉంటే సీఎం జగన్ దగ్గరకు రావాలన్న కొడాలి నానీ


రాజధాని రైతులకు సమస్య ఉంటే సీఎం జగన్ దగ్గరకు రావాలి కానీ చంద్రబాబు దగ్గరకు వెళ్లకూడదని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు చెబుతున్న మాటలు నమ్మి మోసపోవద్దని కొడాలి నాని వ్యాఖ్యానించారు. చంద్రబాబునాయుడు తమ బినామీల ఆస్తుల కోసమే ఇంతగా రాష్ట్రంలో అరాచకం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. నిరసనల కారణంగా పాలనా వికేంద్రీకరణపై ఏపి ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకునేది లేదని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు .

చంద్రబాబుతో ర్యాలీలు చేస్తే న్యాయం జరగదన్న నానీ

చంద్రబాబుతో ర్యాలీలు చేస్తే న్యాయం జరగదన్న నానీ

అమరావతి రైతులు తమకు అన్యాయం జరిగితే టిడిపి చీఫ్ ఎన్ చంద్రబాబు నాయుడు వెనుక ర్యాలీలు చేస్తే న్యాయం జరగదని , రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని ఆయన సూచించారు. అమరావతి ప్రాంత రైతులను కేవలం టీడీపీ స్వార్ధ రాజకీయాల కోసం తీసుకెళ్తున్నారని చంద్రబాబును నాని విమర్శించారు. రాజధాని అమరావతినే ఉంటె టీడీపీ నేతలు, చంద్రబాబు బినామీల భూమి విలువలు అసాధారణంగా పెరుగుతాయని చెప్పారు. టిడిపి అధినేత చంద్రబాబును నమ్మకుండా రైతులు వాస్తవంగా ఆలోచించాలని ఆయన సూచించారు.

రాజధాని రైతులకు చంద్రబాబు భ్రమలు కల్పించారని ఫైర్

రాజధాని రైతులకు చంద్రబాబు భ్రమలు కల్పించారని ఫైర్

రాష్ట్రానికి రాజధాని విషయంలో రాజధాని రైతులకు చంద్రబాబు భ్రమలు కల్పించారని ఇప్పుడు వాస్తవ పరిస్థితులు చెప్తున్నా వారికి అర్ధం కావటం లేదని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు . రాజధాని రైతులకు వారి భూములు కోట్లకు పడగలెత్తినట్టు భ్రమలు కల్పించారన్నారు. రాజధాని నిర్మాణం ముందు తాత్కాలిక భవనాలని చెప్పి ఇప్పుడు మళ్ళీ మాట మారుస్తున్నరన్నారు. ఇప్పుడు ఉన్న భవనాలతో రూపాయి ఖర్చు లేకుండా పాలన సాగించవచ్చు అని మళ్ళీ మోసం చేస్తున్నారని కొడాలి నానీ అన్నారు

గాలి కబుర్లు చెప్పే గాలి మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు అంటూ ఆగ్రహం

గాలి కబుర్లు చెప్పే గాలి మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు అంటూ ఆగ్రహం

కమిటీలు, నివేదికలు, ప్రభుత్వానికి వచ్చిన ఫీడ్ బ్యాక్ మూడు రాజధానులతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని చెప్తే అమరావతి రాతులను మోసం చేసి గాలి కబుర్లు చెప్తున్న గాలి మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు అని ఆయన మండిపడ్డారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో 33 వేల ఎకరాలను రైతుల నుంచి కొల్లగొట్టేందుకు మాయ మాటలు చెప్పారని చంద్రబాబుపై నాని నిప్పులు చెరిగారు. ఇక జిఎన్ రావు కమిటీ నివేదిక, బోస్టన్ కమిటీ, హైపవర్ కమిటీల నివేదికల ఆధారంగానే జగన్ నిర్ణయం తీసుకుంటారని కొడాలి నానీ చెప్పారు. రైతులకు సమస్యలు ఉంటె చర్చించాల్సింది చంద్రబాబు వంటి వెధవలతో కాదని నానీ ఘాటుగా విమర్శించారు.

English summary
Minister Kodali Nani said that the AP government will not change its decision on decentralisation of power and development because of protests. He suggested that Amaravati farmers to approach the State government if injustice was done to them instead of rallying behind TDP chief N Chandrababu Naidu. Nani criticised Chandrababu for taking farmers of Amaravati region for a ride by saying that their land values will increase abnormally. He advised farmers to think in real terms instead of believing the TDP chief.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X