విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వామ్మో .. పీవీపీ కూడా తగ్గట్లేదుగా .. కేశినేనికి చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారుగా

|
Google Oneindia TeluguNews

Recommended Video

PVP, కేశినేని నాని మధ్య జరుగుతున్న ట్విట్టర్ వార్ || PVP Gave A Very Strong Counter To Kesineni Nani

విజయవాడ ఎంపీ కేశినేని నాని, పీవీపీల మధ్య ట్విట్టర్ వార్ ముదిరింది. ఇక నానీ పీవీపీపై ట్విట్టర్ వేదికగా మరోసారి రెచ్చిపోయారు. నిన్నటి వరకు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నపై ట్విట్టర్ యుద్ధం చేసిన కేశినేని నాని తన రూటు మార్చుకున్నారు. ఈసారి వైసీపీ నేత పివీపీని టార్గెట్ చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక ఆయన సమాధానంగా దారుణంగా వ్యాఖ్యలు చేశారు .

అప్పుడు జన్మభూమి కమిటీలు.. ఇప్పుడు గ్రామ వాలంటీర్లు .. సర్కార్ మారినా అదే సంతఅప్పుడు జన్మభూమి కమిటీలు.. ఇప్పుడు గ్రామ వాలంటీర్లు .. సర్కార్ మారినా అదే సంత

 పీవీపీ.. నువ్వు బ్యాంకులకు కట్టవలసిన వేల కోట్లు కడితే మంచిదన్న కేశినేని నానీ

పీవీపీ.. నువ్వు బ్యాంకులకు కట్టవలసిన వేల కోట్లు కడితే మంచిదన్న కేశినేని నానీ

ఇక టీడీపీ నేత బుద్దా వెంకన్న ను కూడా కలిపి ప్రబుద్దుడుతో నీకున్న అక్రమ సంబంధం ప్రజలకి అర్థమైందంటూ చేసిన వ్యాఖ్యలపై హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. అంతేకాదు నేను ఎవరికైనా ఏమి అయినా ఇవ్వాలి అని ఎవరి దృష్టికి వచ్చినా నా వద్దకు తీసుకువస్తే నేను చెల్లించడానికి సిద్దంగా వున్నానని వందల సార్లు చెప్పడం జరిగింది. ఎప్పటికీ దానికి నేను కట్టుబడి వున్నాను అంటూ ట్విట్ చేశారు.మరోవైపు నువ్వు బ్యాంకులకు కట్టవలసిన వేల కోట్లు కడితే దేశానికి మంచి చేసినవాడివి అవుతావు అంటూ ట్వీట్ చేసిన నానీ పీవీపీకి చురకలు అంటించారు. వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) ఎవరికైనా బాకీ ఉంటే చెల్లిస్తాననీ, అయితే అంతకుముందు బ్యాంకులకు వేలకోట్లు ఎగ్గొట్టిన వ్యక్తి, అప్పులు చెల్లించాలని కేశినేని పీవీపీకి హితవు పలికారు.

తాను తాతల సొమ్ముతో సోకులు చేసే వేలిముద్రగాడిని కాదు .. అప్పులు ఎగ్గొట్టటం రాదన్న పీవీపీ

తాను తాతల సొమ్ముతో సోకులు చేసే వేలిముద్రగాడిని కాదు .. అప్పులు ఎగ్గొట్టటం రాదన్న పీవీపీ

ఇక దీంతో ఎంపీ కేశినేని నానిని ఉద్దేశించి ఘాటుగా విమర్శలు చేశారు పీవీపి. తాను తాతల సొమ్ముతో సోకులు చేసే వేలిముద్రగాడిని కాదని పీవీపీరివర్స్ కౌంటర్ వేశారు . వేల కోట్ల రూపాయలతో వ్యాపారాలు చేసి వేలాది ఉద్యోగాలను సృష్టించామని ఆయన చెప్పుకున్నారు . వేల కోట్లు బ్యాంకులకు అప్పులను ఎగ్గొట్టడం ఎలాగో ‘మీ గురువు'ను అడగాలని కేశినేనికి సూచించారు. ఆ రహస్యాన్ని తమకూ చెబితే ఆ కొత్త బిజినెస్ నేర్చుకుంటామని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీంతో ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ చర్చ జరుగుతుంది. ఇక పార్టీ మారిన, మారుతున్న నేతలను ఉద్దేశించి ఈ ఉదయం ఆయన ఓ ట్వీట్ పెట్టారు. ఎవరిని ఉద్దేశించి విమర్శిస్తున్నానన్న విషయాన్ని మాత్రం చెప్పలేదు.కానీ అది నానీని ఉద్దేశించే అని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ముందు నీది పసుపు నిక్కరో, ఖాకి నిక్కరో తేల్చుకోవయ్యా సామి. సక్రమ సంబంధమో లేక అక్రమ సంబంధమో ప్రజలే తేలుస్తారని వ్యాఖ్యానించారు.

ఇంతకీ ఏ పార్టీ .. అటు ఇటు కానోళ్ళని బెజవాడలో చాలా పేర్లతో పిలుస్తారన్న పీవీపీ స్ట్రాంగ్ కౌంటర్

ఇంతకీ ఏ పార్టీ .. అటు ఇటు కానోళ్ళని బెజవాడలో చాలా పేర్లతో పిలుస్తారన్న పీవీపీ స్ట్రాంగ్ కౌంటర్

అటు ఇటు కానోళ్ళని మన బెజవాడలో చాలా పేర్లతో పిలుస్తారు. ఆటోనగర్ వెళ్లి అడిగితే చాలా క్లియర్ గా చెపుతారు అని అన్నారు. ఆపై "బై ది వే, ప్రతి సారి కొత్త నిక్కర్ కుట్టించాలన్నా,‌ మీటర్లు మీటర్లు గుడ్డ అవసరమాయే.. అసలే కరువు కాలం" అని మరో ట్వీట్ పెట్టారు. మొన్నటికి మొన్న బ్యాక్ సీట్లు పెంచుతున్నారు అన్న పీపీవీపీ ఇప్పుడు నిక్కర్ల మీద సెటైర్లు వేశారు. ఇదంతా చూస్తున్న వాళ్ళు వామ్మో .. పీవీపీ కూడా ఏం తగ్గట్లేదుగా .. కేశినేనికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారుగా అని మాట్లాడుకుంటున్నారు. ఇక వీరి మధ్య రగులుకున్న ఈ వివాదం ఎక్కడిదాకా పోతుందో అన్న చర్చ ఏపీలో ప్రధానంగా జరుగుతుంది.

English summary
The twitter war between two TDP leaders Kesineni Nani and YSRCP leader Potluri Vara Prasad has continueing . Nani tweeted that if you pay the Thousands of crores owed to the banks will be good for the country. MP Kesineni Nani has been severely criticized for this.PVP countered that he was not a fingerprintman who would enjoy with the grand parents property . He claims to have done business worth thousands of crores and created thousands of jobs. How to evoid debts to the banks i don't know.. will you ask your god father and let me know ..PVP countered .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X