విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇంద్రకీలాద్రిపై "నో జీన్స్".. ట్రెడిషనల్ దుస్తులైతేనే "ఎంట్రీ"

|
Google Oneindia TeluguNews

విజయవాడ : బెజవాడ కనకదుర్గ సన్నిధిలో కొత్త ఆంక్షలు అమలుకానున్నాయి. కొత్త ఏడాదిలో సరికొత్త రూల్స్ తెరపైకి వచ్చాయి. జనవరి ఫస్ట్ నుంచి డ్రెస్ కోడ్ అమల్లోకి వచ్చింది. ఆలయానికి వచ్చే భక్తులెవరైనా సరే డ్రెస్ కోడ్ పాటించాల్సిందే. కాదు, కూడదంటే దర్శనం కుదరదని.. వచ్చిన దారిలోనే తిరిగి వెళ్లాల్సి ఉంటుందని చెబుతున్నారు అధికారులు.

ఆడ, మగ తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఇకపై కనకదుర్గ ఆలయంలో డ్రెస్ కోడ్ పాటించాల్సి ఉంటుంది. ఈమేరకు ఆలయ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ కోటేశ్వరమ్మ వివరాలు వెల్లడించారు.

ఆడవారికి అలా.. మగవారికి ఇలా

ఆడవారికి అలా.. మగవారికి ఇలా

విజయవాడ కనకదుర్గ గుడిలో జనవరి ఫస్ట్ నుంచి డ్రెస్ కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు విడిగా డ్రెస్ కోడ్ పాటించాల్సి ఉంటుంది. మహిళా భక్తులు స్లీవ్‌లెస్‌ టాప్స్, స్లీవ్‌లెస్‌ జాకెట్స్, మిడ్డీలు, జీన్స్, టీషర్స్ట్, కురచ దుస్తులు ధరించి వస్తే ఇకపై ఆలయంలోకి అనుమతించరు. కొత్త నిబంధనల ప్రకారం చీరలు, లంగాఓణీ, సంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించాలి.

మగవారికి కూడా డ్రెస్ కోడ్ నిబంధనలు వర్తిస్తాయి. ఇకపై టీ షర్ట్స్, షర్ట్స్ వేసుకుని వస్తే ఆలయంలోనికి అనుమతించబోరు. ధోతీలు మాత్రమే ధరించి అమ్మవారి దర్శనానికి రావాల్సి ఉంటుంది. డ్రెస్ కోడ్ పాటించనివారికి ఎట్టి పరిస్థితుల్లో ఆలయ ప్రవేశం ఉండబోదని తేల్చి చెప్పారు ఈవో.

మహిళాభక్తులకు 100 రూపాయలతో చీర

మహిళాభక్తులకు 100 రూపాయలతో చీర

డ్రెస్ కోడ్ తెలియకుండా వచ్చినవారికి గానీ, తెలిసిన పాటించకుండా నిర్లక్ష్యం చేసేవారిని ఆలయ అధికారులు అడ్డుకోనున్నారు. ఒకవేళ మహిళా భక్తులు సంప్రదాయ దుస్తుల్లో రాని పక్షంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. అలాంటివారి దగ్గర్నుంచి 100 రూపాయలు తీసుకుని అమ్మవారి చీరను అందించనున్నారు. అంతేగాదు దుస్తులు మార్చుకునేందుకు వీలుగా ప్రత్యేక గదులు ఏర్పాటు చేస్తున్నట్లు ఈవో వివరించారు.

డ్రెస్ కోడ్ పక్కాగా అమలు

డ్రెస్ కోడ్ పక్కాగా అమలు

దేశవ్యాప్తంగా ఇప్పటికే చాలా దేవాలయాల్లో డ్రెస్ కోడ్ అమలవుతోంది. భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించేలా పలు ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. భక్తులు కూడా డ్రెస్ కోడ్ ఫాలో అవుతున్నారు. అదే క్రమంలో తాజాగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై డ్రెస్ కోడ్ అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ట్రెడిషనల్ దుస్తులకు సంబంధించి భక్తులు అవగాహన పెంచుకోవాలని, తీరా ఇక్కడకు వచ్చాక ఇబ్బందులు పడొద్దని సూచించారు ఈవో.

English summary
new rules implemented in vijayawada kanakadurga temple. Dress code starts from january first. Devotees compulsory follow the dress code who came to temple.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X