• search
 • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులు ప్రారంభం-తొలిరోజు గవర్నర్, మంత్రుల దర్శనాలు

|
Google Oneindia TeluguNews

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి నుంచి తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు. తొలిరోజు రాష్ట్ర గవర్నర్ హరిచందన్ తో పాటు దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, స్దానిక ఎమ్మెల్యేలు, అధికారులు హాజరై అమ్మవారి దర్శనం చేసుకున్నారు. భారీ ఎత్తున సాగే శరన్నవరాత్రుల కోసం ప్రభుత్వం ఈసారి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

ఇంద్రకీలాద్రిపై దసరా ప్రారంభం

బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రులు అంగరంగవైభవంగా ప్రారంభమయ్యాయి. ఇవాళ తొలిరోజు స్వర్ణ కవచాలంకృత దుర్గా దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. అష్టభుజాలతో సింహాసనంపై త్రిశూలధారియై కనకపు ధగధగలతో మెరుస్తున్న జగన్నాతను దర్శించుకోవడం కోసం భక్తులు బారులు తీరారు. కోవిడ్ నిబంధనల కారణంగా పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులను అనుమతించారు. నవరాత్రులు ప్రారంభమైన తొలిరోజు నుండి భవానీ లు అమ్మవారిని దర్శించుకున్నారు.

గవర్నర్, మంత్రుల దర్శనం

రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్, ఆయన సతీమణి సుప్రవ హరిచందన్, దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కుటుంబ సభ్యులతో అమ్మవారిని దర్శించుకున్నారు. రోజువారీ 10 వేల మంది భక్తులకు దర్శనానికి అనుమతిస్తూనే వీఐపీల దర్శనానికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ 9 రోజులు పలువురు వీఐపీలు అమ్మవారిని దర్శించకునే అవకాశముంది. మూలా నక్షత్రం రోజున సీఎం జగన్ రాష్ట్రప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు పస్త్రాలు సమర్పించనున్నారు. దసరా మొదటి రోజు కనకదుర్గమ్మ దర్శనం ఎంతో ఆనందకరమని గవర్నర్ తెలిపారు. దుర్గే దుర్గతి నాశని... అంటూ అమ్మవారిని ప్రార్ధించినట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందాలని కోరుకున్నట్లు గవర్నర్ పేర్కొన్నారు. కరోనాను ప్రపంచం నుంచీ దూరం చేయాలని అమ్మవారిని కోరుకున్నట్లు కూడా గవర్నర్ తెలిపారు. అమ్మవారి దర్శనంతో కరోనా తొలగిపోవాలని ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించారు.

  AP CM Has Maintained His Cool In Pawan Kalyan Matter | Oneindia Telugu

  భక్తులకు ఇబ్బంది లేకుండా భారీఏర్పాట్లు

  కనకదుర్గమ్మ ఆలయ ఈవో డి.భ్రమరాంబ, ధర్మకర్తల మండలి చైర్మన్ ఫైలా సోమినాయుడు, సామినాయుడు ఇంద్రకీలాద్రి కొండపై దసరా ఏర్పాట్లు ను పరిశీలించారు. తొమ్మిది రోజుల పాటు భక్తులకు ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసినట్లు ఆయన ఈవో ప్రకటించారు. క్యూలైన్లో కేశఖండన శాల అన్నప్రసాదాలు శానిటేషన్ అన్నిరకాల సిబ్బంది సమన్వయంతో పని చేస్తురన్నారు. ప్రత్యక్ష పరోక్ష పూజలకు కూడా అన్ని విధాల ఏర్పాట్లు చేశామన్నారు. వీఐపీల తాకిడి ఉన్న సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా 5 వరుసలు క్యూలైన్లు ఏర్పాటు చేశామన్నారు.
  కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దసరా నవరాత్రులు జరుపుకోవాలని అధికారులు కోరారు. గతంలో కొండచరియలు పడటం లాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు వారు తెలిపారు. తిరుపతి తర్వాత రెండో దేవాలయం గా విజయవాడ ఇంద్రకీలాద్రి ని తయారు చేస్తామని ఆలయ ఈవో తెలిపారు.

  English summary
  dussehra sarannavaratris begins on vijayawada indrakeeladri hill today. governor biswabhushan harichandan and minister vellampalli srinivas has visited the temple on first day of dussehra festival.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X