ఇప్పుడు ఎన్నికలు లేవే.. ఇంటికి రాను.. మహిళతో రోజా
ఎన్నికల సమయంలో జనం.. వారి బాగోగులు నేతలకు గుర్తుకు వస్తాయి. అప్పుడు వారి ఇళ్లలోకి వస్తారు. అవసరమైతే భోజనం కూడా చేస్తారు. ఎలక్షన్ ముగిసిందా.. ఇక అంతే పట్టించుకోరు. ఇప్పుడు సోషల్ మీడియా వల్ల నేతల చర్యలు వెంటనే జనానికి తెలుస్తున్నాయి. అలా మంత్రి రోజా.. ఓ మహిళతో అన్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అదేంటి ఆమె ఇలా బిహేవ్ చేసిందని కొందరు అంటున్నారు. మరికొందరు విమర్శలు చేస్తున్నారు.

బస్తీలో రోజా...
రోజా
ఓ
బస్తీలో
పర్యటిస్తున్నారు.
అక్కడ
అంతా
మహిళలే
ఉన్నారు.
అందులో
ఓ
మహిళ
చొరవ
తీసుకుంది.
తమ
ఇంటికి
రావాలని
కోరింది.
నేతలను
అలా
కోరడం
సహజమే..
కానీ
అందుకు
రోజా
వింతగా
ప్రవర్తించారు.
ఇంటికి
రావాలని
కోరితే..
ఇప్పుడు
ఎన్నికలు
లేవు..
ఇంటికి
రావడానికి
అని
కామెంట్
చేశారు.
దీంతో
ఆమె
బాధపడింది.
వీడియోలో
రోజా
స్పష్టంగా
మాటలు
వినిపిస్తున్నాయి.

ఇంటికి రమ్మంటే ఇలా..
నేతలు కనిపించగానే ఇంటికి రావాలని కోరతారు. ఇక రోజా సినీ తార కూడా కావడంతో అలా కోరతారు. ఆమె తప్పు లేదు.. రోజా కూడా తర్వాత వస్తా అని చెబితే బాగుండేది. కానీ ఎన్నికలు కావని చెప్పడం మాత్రం కరెక్టు కాదు. అంటే ఎన్నికలు ఉంటేనా వస్తారా అనే వాదన వస్తోంది. ఎన్నికలు లేకుంటే జనం బాగోగులను పట్టించుకోరు. రోజా కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సరికాదు రోజా...
రోజా ఇటీవల మంత్రి పదవీ కూడా చేపట్టారు. జనంతో కలిసిపోవాలి.. కలిసి పోతున్నారు. కానీ మహిళల పట్ల ప్రవర్తించడం తప్పు.. కానీ రోజా ఇలా చేయడం సరికాదు. నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. ఎన్నికల సమయంలోనే జనం.. వారి బాగుగులు గుర్తుకు వస్తారా అని అడుగుతున్నారు. మిగతా సమయంలో వారంటే ఇంత చులకన అని అంటున్నారు. ఇదీ మంచి పద్దతి కాదని సూచిస్తున్నారు. జనంతో ఉండి.. వారితో కలిసిపోవాలని సూచిస్తున్నారు. కానీ వారు అంటే చిన్నచూపు ఎంత మాత్రం తగదని సజెస్ట్ చేస్తున్నారు.