విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శిబిరాల్లోకి వస్తేనే సాయమా.. ఇదేంది జగన్, సర్కార్‌పై దేవినేని ఉమా ఫైర్..

|
Google Oneindia TeluguNews

భారీ వర్షాల వల్ల జనజీవనం ఇబ్బంది పడుతోంది. తీర ప్రాంత ప్రజలు/ లోతట్టు ప్రాంతాలకు చెందిన జనం ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అయితే ప్రభుత్వ సాయంపై మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు పెదవి విరిచారు. వర్ష ప్రభావిత ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతుంటే.. శిబిరాలకు వస్తేనే సాయం చేస్తామని ప్రభుత్వం చెప్పడం భావ్యం కాదన్నారు.

శిబిరాలకు రానీ ప్రజల పరిస్థితి ఏంటీ అని దేవినేని ఉమా ప్రశ్నించారు. వారిని పట్టించుకోరా అని అడిగారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. గ్రామాల్లో విద్యుత్ తీగలను గోదావరి ప్రవహం తాకుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో కరెంట్ లేక వందలాది గ్రామాలు అంధకారంలో ఉన్నాయని చెప్పారు. కానీ ప్రభుత్వం మాత్రం శిబిరాలకు రావాల్సిందేనని భీష్మించుకొని కూర్చొందని తెలిపారు.

ex minister devineni uma slams cm jagan mohan reddy

చేసేదేమీ లేక ప్రజలు పిల్లలతో కొండలపైకి ఎక్కి టెంట్లో ఉంటున్నారని దేవినేని ఉమా తెలిపారు. ఏజెన్సీలో ప్రజల ఆకలి కేకలు ప్రభుత్వానికి వినిపించడం లేదా అన్నారు. పంట నష్టపోయిన రైతులకు చేయాతనివ్వాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కోరిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. వరద బాధితులను ఆదుకోవాలని కూడా కోరగా.. చంద్రబాబు మాటలు వినబడుతున్నాయా జగన్ అని ట్వీట్ చేశారు. రాష్ట్రంలో వర్షాల వల్ల ప్రజలు పడుతోన్న ఇబ్బందులకు సంబంధించి వీడియోను కూడా దేవినేని ఉమా పోస్ట్ చేశారు.

English summary
ex minister devineni uma maheshwar rao slams cm jagan mohan reddy on flood relief works.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X