విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తింగిరి ప్రభుత్వానికి మాత్రం పట్టదు, కరోనాపై దేశవ్యాప్తంగా అలర్ట్, ఎన్నికల వాయిదాపై దేవినేని ఉమా

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నది. దీనిని విపక్షాలు స్వాగతించాయి. కానీ అధికార వైసీపీ మాత్రం ఈసీ తీరును తప్పుపట్టింది. వైసీపీ తీరు సరికాదని.. మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టంచేశారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ గురించి భయాందోళన నెలకొన్న నేపథ్యంలో... అరికట్టేందుకు రాష్ట్రంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారని ఉమా ప్రశ్నించారు.

వెల్ కం..

వెల్ కం..


5 కోట్ల మంది ప్రజలు, రాజకీయ పార్టీలు ఏపీ ఈసీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారని దేవినేని ఉమా తెలిపారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ఎన్నికలు వాయిదా పడ్డాయని భయపడిపోతోందని ఆరోపించారు. అధికారంలో ఉన్న పార్టీ చేయాల్సిన పనిని ఎన్నికల సంఘం చేసిందని గుర్తుచేశారు. మీరు సరిగ్గా బాధ్యత నిర్వహిస్తే.. ఈసీ కల్పించుకోవాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. మీ డ్యూటీని విస్మరించడం వల్లే సమస్య తలెత్తిందని గుర్తుచేశారు.

విపత్తు, మహమ్మారి

విపత్తు, మహమ్మారి

కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో విదేశాల నుంచి ప్రయాణికులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించిన విషయాన్ని గుర్తుచేశారు. కరోనా వైరస్ విపత్తుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని.. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ మహమ్మారిగా పేర్కొన్నదని తెలిపారు. పొరుగు రాష్ట్రం తెలంగాణలో ఈ నెల 31వ తేదీ వరకు విద్యాసంస్థలను మూసివేసిందని చెప్పారు. కానీ సీఎం జగన్ మాత్రం అవేమీ పట్టించుకోవడం లేదని.. స్థానిక సంస్థల్లో గెలవడమే లక్ష్యంగా పెట్టుకుందని మండిపడ్డారు.

ఆంక్షలు..

ఆంక్షలు..

నెల్లూరులో ఎందుకు ఆంక్షలు విధిస్తున్నారని దేవినేని ఉమా ప్రశ్నించారు. సినిమా హాళ్లు, కాలేజీలు, స్విమ్మింగ్ పూల్స్ ఎందుకు మూసివేశారని నిలదీశారు. అక్కడి పరిస్థితిని సీఎం జగన్ ప్రజలకు ఎందుకు వివరించడం లేదని అడిగారు. ప్రజల ఆరోగ్యం అంటే మీకు పట్టదా.. 13 జెడ్పీ చైర్మన్లను గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నారా అని అడిగారు. మెజార్టీ ఎంపీపీ స్థానాలను గెలుచుకోవడంపైనే దృష్టిసారించరా అని అడిగారు.

నోరు మెదపరేంటీ..?

నోరు మెదపరేంటీ..?

మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో గెలవడమే టార్గెట్‌గా పెట్టుకున్నట్టు అనిపిస్తోందని చెప్పారు. దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా అంటే భయపడుతున్నాయని.. కానీ ఈ తింగిరి ప్రభుత్వం మాత్రం భయపడటం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలోని పరిస్థితి వైద్యారోగ్యశాఖ మంత్రి ఎందుకు మాట్లాడటం లేదు, మిగతా అధికారులు ఎందుకు నోరు మెదపడం లేదు అని ప్రశ్నించారు.

English summary
ex minister devineni uma maheshwar rao welcome ap local body election Postpone.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X