విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మాజీమంత్రి కొల్లు రవీంద్రకు నో బెయిల్: పిటిషన్ తిరస్కరించిన కృష్ణా జిల్లా కోర్టు, రాజమండ్రి జైలులోనే

|
Google Oneindia TeluguNews

మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు జిల్లా కోర్టు బెయిల్ తిరస్కరించింది. వైసీపీ నేత మోకా భాస్కర్ రావు హత్య కేసులో కొల్లును పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. గత నెలలో మోకా భాస్కర్ రావు హత్య జరగగా.. రవీంద్ర ప్రమేయంతో హత్య జరిగిందని పోలీసులు చెబుతున్నారు. హత్య చేశారని భావిస్తోన్న నిందితులు చెప్పిన వాంగ్ములాన్ని బట్టి.. కొల్లు రవీంద్రను కూడా అరెస్ట్ చేశారు. అక్కడినుంచి ఆయనను జైలుకు తరలించారు. హత్య కేసులో రవీంద్ర ఏ-4 నిందితుడిగా ఉన్నారు.

 మాజీమంత్రి కొల్లు రవీంద్రపై కక్షసాధింపు, గోడ దూకారని అసత్య ప్రచారం: దేవినేని ఉమా ఫైర్ మాజీమంత్రి కొల్లు రవీంద్రపై కక్షసాధింపు, గోడ దూకారని అసత్య ప్రచారం: దేవినేని ఉమా ఫైర్

గత నెలలో కోనేరు సెంటర్ సమీపంలో చేపల మార్కెట్ వద్ద జరుగుతున్న పనులను పర్యవేక్షిస్తున్న సమయంలో మోకా భాస్కర్ రావుపై దాడి జరిగింది. ఇద్దరు ఆగంతకులు నిల్చొన్న భాస్కరరావును తోసేయగా.. కింద పడిపోయాడు. అందరూ చూస్తుండగానే కత్తితో ఛాతిలోకి పొడిచారు. కత్తి పోట్లకు జేబులో ఉన్న మొబైల్ పేలిపోయింది. ఒంటిపై ఉన్న చొక్కా కాలి.. శరీరంపై గాయాలు ఏర్పడ్డాయి. గుండెలో పొడవడంతో తీవ్ర రక్తస్రావం కావడంతో.. ఆస్పత్రికి తరలించే మార్గంలో భాస్కరరావు చనిపోయారు.

ex minister kollu ravindra bail plea dismiss by court..

Recommended Video

India-China Border Issue:కీలకమైన పాయింట్లు,పాంగోంగ్ సరస్సు వద్ద మాత్రం చైనా దళాలు ఇప్పటికీ ఉన్నాయి !

తర్వాత ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి ఇచ్చిన సమాచారం ఆధారంగా చింతా చిన్నను కూడా అదుపులోకి తీసుకున్నారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రమేయంతోనే హత్య చేశామని వారు చెప్పడంతో.. రవీంద్రను ఏ-4 నిందితుడిగా చేర్చారు. కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్‌కు పంపించారు. ప్రస్తుతం రవీంద్ర రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. మరోవైపు టీడీపీ మాత్రం కక్షసాధింపు చర్యగా అభివర్ణిస్తోంది. కావాలనే హత్య కేసులో ఇరికించారని.. తమను న్యాయం చేయాలని కోరుతున్నారు.

English summary
ex minister kollu ravindra bail petition dismiss by krishna district court. he is a-4 accused ycp leader moka bhaskar rao murder case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X