vizag steel plant private ex minister kollu ravindra CM ys jagan mohan reddy వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కొల్లు రవీంద్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి
వైఎస్ జగన్‌కు అంతా తెలుసు.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మాజీమంత్రి కొల్లు రవీంద్ర
స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అంశం ఏపీలో అగ్గిరాజేసింది. కేంద్రం/ రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ మండిపడుతోంది. ఉన ఒక వనరును కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారని ఫైరవుతున్నారు. సీఎం జగన్‌పై టీడీపీ నేతలు ఒంటికాలిపై లేస్తున్నారు. జగన్ చెబితేనే ప్రైవేటీకరణ అంశం తెరపైకి వచ్చిందని తెలిపారు. కానీ పైకి మాత్రం వైసీపీ నేతలు కూడా ఖండిస్తారని చెప్పారు.
విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ గొంతు కోసి సీఎం జగన్, వైసీపీ నేతలు నాటకాలు ఆడుతున్నారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. ఆయన శుక్రవారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ప్రైవేటీకరణకు ముందే అంగీకరించి.. ఏం తెలియనట్టు ప్రధానికి లేఖ రాయడం ఏంటి అని ప్రశ్నించారు. ఇదీ సరికాదు అని.. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని చెప్పారు. సరైన సమయంలో తగినవిధంగా బుద్ది చెబుతారని తెలిపారు.

స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ టీడీపీ ఎమ్మెల్యే గంటా రాజీనామా చేశారని గుర్తుచేశారు. అదే వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేస్తున్నారని కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. ఆ పార్టీకి పదవులే ముఖ్యం అని చెప్పారు. కానీ తమకు ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై రాజీలేకుండా పోరాడుతామని చెప్పారు.