విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీ సీఎం జగన్ కు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ బహిరంగ లేఖ

|
Google Oneindia TeluguNews

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఏపీ విభజన చాలా అన్యాయం జరిగిందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఏపీ విభజనపై చర్చను చేపట్టాలని లోక్ సభ స్పీకర్ కు నోటీసు ఇవ్వాల్సిందిగా వైసిపి ఎంపీలకు సూచించాలని ఆయన తన లేఖ ద్వారా కోరారు.

టీడీపీకి మరో ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్ షాక్ ... వైసీపీ నేతలతో టచ్ లోకి .. రీజన్ ఇదేటీడీపీకి మరో ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్ షాక్ ... వైసీపీ నేతలతో టచ్ లోకి .. రీజన్ ఇదే

ఏపీకి అన్యాయం

ఏపీకి అన్యాయం

విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని, ఆ అన్యాయం గురించి ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా కూడా గతంలో పార్లమెంట్ వేదికగా ప్రస్తావించారని ఉండవల్లి అరుణ్ కుమార్ తన లేఖ ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. 18 నుండి జరగనున్న శీతాకాల సమావేశాల్లో కచ్చితంగా ఏపీ విభజన అంశం ప్రస్తావనకు తీసుకు వచ్చేలా వైసిపి ఎంపీలు నోటీసులు ఇవ్వాలని ఆయన సూచించారు .

ఏపీ విభజనపై చర్చ చేపట్టాలి

ఏపీ విభజనపై చర్చ చేపట్టాలి

ఏ పార్లమెంట్లో ఇంత హడావుడిగా ఏపీ విభజన జరిగిందో ఆ పార్లమెంట్లో ఇప్పటివరకు ఏపీ విభజనపై చర్చ జరగలేదని, ఈ సారైన చర్చ జరిగేలా వైసిపి పట్టుబట్టాలని ఆయన తన లేఖ ద్వారా సీఎం జగన్ కు తెలిపారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఉండవల్లి అరుణ్ కుమార్ సీఎం జగన్మోహన్ రెడ్డికి రాసిన లేఖ ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

అప్పుల రాష్ట్రంగా ఏపీ

అప్పుల రాష్ట్రంగా ఏపీ

ఏపీకి ఇచ్చిన హామీలు నేటికి నెరవేరక పోవడంతో, ఏపీ అప్పుల రాష్ట్రంగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో పార్లమెంటులో ఏపీ విభజనపై చర్చ జరిగితే బావుంటుంది అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. మరి సీఎం జగన్ ఉండవల్లి రాసిన లేఖపై స్పందిస్తారా లేదా అన్నది వేచి చూడాలి.

English summary
Former MP Vundavalli Arun Kumar has shot off an open letter to Chief Minister YS Jagan Mohan Reddy, urging him to ask his party MPs to give notice to the Lok Sabha Speaker for taking up discussion in the ensuing Parliament session over the injustice meted out to truncated Andhra Pradesh during the bifurcation of the united state. In the letter, Arun Kumar brought to the notice of the chief minister that Prime Minister Narendra Modi and Home Minister Amit Shah were aware of injustice done to Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X