విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జ‌గ‌న్ ఫిక్స్ చేస్తారా: ఒంట‌రైన కోడెల‌..పార్టీ నుండి నో స‌పోర్ట్‌: టీడీపీలో కంటిన్యూ అవుతారా..!

|
Google Oneindia TeluguNews

మాజీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్ కుటుంబం చిక్కుల్లో చిక్క‌కుంది. నాడు టీడీపీ హ‌యాంలో స్పీక‌ర్‌గా వ్య‌వ‌హ‌రించిన కోడెల పేరుతో ఆయ‌న సంతానం చేసిన అక్ర‌మాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి.ప్ర‌తీ రోజు బాధితులు వారి పైన ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. దీని పైన వైసీపీ నేత విజ‌య సాయిరెడ్డి పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో కోడెల‌కు మ‌ద్ద‌తుగా ఏ టీడీపీ నేత ముందుకు రావ‌టం లేదు. దీంతో..ఇప్పుడు కోడెల ఒంట‌రి వాడ‌య్యారు. ప్ర‌భుత్వం ఇప్పుడు ఏం చేస్తుంద‌నేది ఆస‌క్తి క‌రంగా మారింది.

జ‌గ‌న్ పాల‌న‌..జేసీ..ప‌రిటాల : ఆ మాట‌ల వెనుక ప‌ర‌మార్ధం: అనంత‌లో కొత్త స‌మీక‌ర‌ణాలు..! జ‌గ‌న్ పాల‌న‌..జేసీ..ప‌రిటాల : ఆ మాట‌ల వెనుక ప‌ర‌మార్ధం: అనంత‌లో కొత్త స‌మీక‌ర‌ణాలు..!

కోడెల సంతానం పైన వ‌రుస ఫిర్యాదులు..

కోడెల సంతానం పైన వ‌రుస ఫిర్యాదులు..

టీడీపీ సీనియ‌ర్ నేత‌..మాజీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్ కుటుంబ స‌భ్యుల పైన పెద్ద ఎత్తున అవినీతి ఆరోప‌ణ‌లు వెల్లు వెత్తుతున్నాయి. గ‌తంలోనే వీరి పైన ఆరోప‌ణ‌లు ఉన్నా..అధికారంలో ఉండ‌టంతో ఎవ‌రూ బ‌య‌ట‌కు వ‌చ్చి ఫిర్యాదు చేయ‌లేదు. ఇక‌, ఇప్పుడు అధికారం కోల్పోవ‌టంతో ప్ర‌తీ రోజు కోడెల సంతానం పైన ఫిర్యాదుల ప‌రంప‌ర సాగుతోంది.
దీని పైనా రాజ‌కీయంగా కోడెల పూర్తిగా ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డ్డారు. ఆయ‌న పైన అధికార పార్టీ ఎంపీ విజ‌య సాయిరెడ్డి విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఒక్క టీడీపీ నేత సైతం ఇప్ప‌టి వ‌ర‌కు కోడెల‌కు మ‌ద్ద‌తుగా మాట్లాడ‌లేదు. ఇదే స‌మ‌యంలో ఎన్నిక‌ల్లో ఓట‌మి మీద జ‌రిగిన సమీక్షా స‌మావేశంలోనూ పార్టీ నేత‌లు కోడెల కుటుంబ స‌భ్యుల అక్ర‌మాలు..ఆయ‌న పైన ఉన్న వ్య‌తిరేక‌త గురించి అంద‌రి స‌మక్షంలోనే అధినేత‌కు వివ‌రించారు. ఇదంతా త‌న ముందే జ‌రుగుతున్నా కోడెల మాత్రం నోరు మెద‌ప‌లేదు.

టీడీపీ నేత‌ల కీల‌క నిర్ణ‌యం..

టీడీపీ నేత‌ల కీల‌క నిర్ణ‌యం..

మాజీ స్పీక‌ర్ కోడెల కుటుంబం పైన రాజ‌కీయ వేధింపుల్లో భాగంగానే కేసులు న‌మోదు చేస్తున్నారంటూ ఆయ‌నకు మ‌ద్దతుగా డీజీపీకి క‌లిసి ఫిర్యాదు చేయాల‌ని తొలుత టీడీపీ నేత‌లు భావించారు. అయితే ప్ర‌తీ రోజు ఫిర్యాదులు వ‌స్తుండటం..వారు మీడియా ముందుకు వ‌చ్చి నేరుగా ఆరోప‌ణ‌లు చేస్తుండ‌టంతో టీడీపీ నేత‌లు ఆలోచ‌న‌లో ప‌డ్డారు.
కోడెల వైఖరిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో చంద్రబాబు మిన్నకుండిపోయినట్లు సమాచారం. కోడెల కుటుంబీకులపై ఎప్పటి నుంచో తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు వస్తున్నాయని..ఈ విష‌యంలో పార్టీ నుండి మ‌ద్ద‌తిస్తే మొత్తంగా న‌ష్టం జ‌రుగుతుంద‌ని టీడీపీ ఉప నేత బుచ్చయ్యచౌదరి ఆ సమావేశంలో మండిపడినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో పార్టీ తలదూర్చితే ఆయన అవినీతి వ్యవహారాలను సమర్థించినట్లవుతుందని, మౌనంగా ఉంటే మంచిదని, లేకపోతే ఉన్న పరువు కూడా పోతుందని చెప్పడంతో చంద్రబాబు వెనక్కి తగ్గినట్లు పార్టీ నేత‌లు చెబుతున్నారు.

ఒంట‌రైన కోడెల‌..అడుగులు ఎటువైపు

ఒంట‌రైన కోడెల‌..అడుగులు ఎటువైపు

ఊహించ‌ని విధంగా తాజా ఎన్నిక‌ల్లో స‌త్తెన‌ప‌ల్లి టిక్కెట్ ఖ‌రారైన స‌మ‌యం నుండి కోడెల ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. త‌న‌యుడు చేస్తున్న వ‌సూళ్ల గురించి హెచ్చ‌రిక‌లు వ‌చ్చినా..కోడెల సీరియ‌స్‌గా తీసుకోలేదు. ఫ‌లితంగా నాటి నుండి నేటి వ‌ర‌కు స‌మాధానం చెప్పుకోలేని స్థితిలోకి వెళ్లిపోయారు. కోడెల పైకి రాజ‌కీయ వేధింపులు అని ఖండించే ప్ర‌య‌త్నం చేస్తున్నా.. ఆధారాల‌తో స‌హా వ‌స్తున్న ఫిర్యాదులు త‌మ‌కు న‌ష్టం చేస్తాయ‌నే ఆందోళ‌న‌లో ఉన్నారు. తాను పార్టీ ఆరంభం నుండి ప‌ని చేస్తున్నా.. తాను క‌ష్టాల్లో ఉన్న స‌మ‌యంలో పార్టీ నేత‌లు ఎవ్వ‌రూ మ‌ద్ద‌తు ఇవ్వ‌క‌పోవ‌టం పైన ఆయ‌న అస‌హ‌నంతో ఉన్న‌ట్లు తెలుస్తోంది. మ‌రి..ఇప్పుడు కోడెల రాజ‌కీయంగా ఎటువంటి నిర్ణ‌యం తీసుకుంటార‌నేది ఆస‌క్తి క‌రంగా మారింది.

English summary
Ex Speaker Kodela Siva Prasad child facing many complaints. Since 15 days daily people lodging complaint against Kodela son and daughter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X