విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రోజాకు రాజధాని రైతుల నిరసన సెగ .. దొంగ దారిన రోజా కాన్వాయ్ .. టీడీపీ ఎద్దేవా

|
Google Oneindia TeluguNews

నగరి ఎమ్మెల్యే ఏపీఐఐసి చైర్మన్ రోజాకు రాజధాని గ్రామాల్లో నిరసన సెగ తగిలింది .అడుగడుగునా ఎమ్మెల్యే రోజాకు చేదు అనుభవం ఎదురైంది. రాజధాని అమరావతి విషయంలో ఎమ్మెల్యే రోజా వైఖరి చెప్పాలని రాజధాని ప్రాంత రైతులు ఎమ్మెల్యే రోజాను అడ్డుకున్నారు. రాజధానిపై సమాధానం కావాలని నిలదీశారు .

నిరాధార వార్తలకు సిగ్గు పడాలి.. కియా తరలింపు వార్తలపై మండిపడ్డ రోజానిరాధార వార్తలకు సిగ్గు పడాలి.. కియా తరలింపు వార్తలపై మండిపడ్డ రోజా

Recommended Video

Mahila JAC Extends Support For Amaravathi Farmers | Oneindia Telugu
ఎస్‌ఆర్ఎం యూనివర్సటీ సమ్మిట్‌లో పాల్గొన్న రోజాకు చేదు అనుభవం

ఎస్‌ఆర్ఎం యూనివర్సటీ సమ్మిట్‌లో పాల్గొన్న రోజాకు చేదు అనుభవం

ఈరోజు ఉదయం నీరుకొండ ఎస్‌ఆర్ఎం యూనివర్సటీ సమ్మిట్‌లో రోజా పాల్గొన్నారు. విషయం తెలిసిన మహిళలు, రైతులు అక్కడకు చేరుకుని సమ్మిట్ బయట ఆందోళనకు దిగారు. అమరావతికి న్యాయం చేయాలంటూ మహిళలు నినాదాలు చేశారు. ఇక ఈ నేపధ్యంలో నేలపాడు ఎస్‌ఆర్ఎం యూనివర్సిటీ నుంచి గుంటూరు వైపు వెళ్తుండగా పెదపరిమి వద్ద రోజా వాహనాన్నిఅడ్డుకున్న రైతులు ఆందోళన చేశారు .

రోజా వాహనాన్ని అడ్డుకుని నిలదీసిన రాజధాని రైతులు

రోజా వాహనాన్ని అడ్డుకుని నిలదీసిన రాజధాని రైతులు


వాహనాన్ని ముందుకు వెళ్లనీయకుండా అడ్డుగా నిల్చుని రోజాను నిలదీశారు. రాజధానిపై రోజా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు రైతులు .జగన్ మూడు రాజ్దానులకు అనుకూలంగా మాట్లాడుతున్న రోజా రాజధాని విషయంలో అమరావతి ప్రాంత రైతులకు సమాధానం చెప్పాలని వారన్నారు . విషయం తెలిసిన పోలీసులు అక్కడకు భారీగా చేరుకున్నారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు రోజాను వెనుక గేటు నుంచి బయటకు తీసుకెళ్లారు.

దొడ్డి దారిన రోజాను పంపించిన పోలీసులు .. టీడీపీ ఆగ్రహం

దొడ్డి దారిన రోజాను పంపించిన పోలీసులు .. టీడీపీ ఆగ్రహం


విషయం తెలుసుకున్న మహిళలు రోజా కాన్వాయ్‌ను వెంబడించారు. ఈ ఘటనతో యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త వార్తావరణం నెలకొంది. ఎమ్మెల్యే రోజాకు చేదు అనుభవం ఎదురైంది. ఇక ఈ ఘటనపై రోజా నిప్పులు చెరుగుతున్నారు. ఇక రాజధాని రైతుల పక్షాన పోరాటం చేస్తున్న టీడీపీ మాత్రం రోజాను దొంగ దారిన తీసుకువెళ్లటం దేనికి అని ప్రశ్నిస్తున్నారు. తాజా ఘటనపై టీడీపీ నాయకురాలు దివ్యవాణి మాట్లాడుతూ రాజధాని రైతులకు రోజా సమాధానం చెప్పల్సిన అవసరం ఉందన్నారు.

సమాధానం చెప్పకుండా దొంగ దారిన వెళ్ళటం దేనికి అని దివ్యవాణి ఫైర్

సమాధానం చెప్పకుండా దొంగ దారిన వెళ్ళటం దేనికి అని దివ్యవాణి ఫైర్


ఒకవైపు ఏపీలో ముఖ్యమంత్రిగా చెప్పుకునే జగన్ రాజధాని రైతుల ముందుకు రాకుండా దొంగదారిన వెళ్లిపోతున్నారని, ఇప్పుడు ఎమ్మెల్యే రోజా కూడా ప్రజల మధ్యలోకి రాలేక, కారు దిగకుండా దొంగదారిన వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. నవమాసాలు అంటే 9 నెలల జగన్ పాలనలో నవమోసాలు బయటకు వచ్చాయని, అందుకే ప్రజలు వైసీపీ ప్రభుత్వాన్ని ఛీ కొడుతున్నారని దివ్యవాణి అన్నారు. రోజా సమాధానం చెప్పకుండా పలాయనం చిత్తగించారని దివ్యవాణి ఎద్దేవా చేశారు.

English summary
Nagari MLA APIIC chairman Roja faced protest in the capital villages. Farmers in the capital region have blocked MLA Roja's convoy and asked MLA Roja's stance on capital Amaravati. Demands to be answered on capital. The police sent her another way. TDP leader Divyavani criticized this.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X