విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రకాశం బ్యారేజ్ కి మళ్ళీ వరద .. ఈ సారి తెలుగురాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలే కారణం

|
Google Oneindia TeluguNews

మొన్నటి వరకు అంతర్రాష్ట్ర వరదల కారణంగా ప్రకాశం బ్యారేజీకి వరద నీరు పోటెత్తితే, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు వాగులు ,వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఫలితంగా వరద నీరు మరోసారి ప్రకాశం బ్యారేజ్ కు పోటెత్తనుంది.ఖమ్మం జిల్లాలో కురుస్తున్న వర్షాలకు ప్రకాశం బ్యారేజీకి వరద మొదలైంది.

ఆ నిర్ణయంతో రాష్ట్రాన్ని దివాలా తీయిస్తారా అని మాత్రం రెచ్చిపోకండి... చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలుఆ నిర్ణయంతో రాష్ట్రాన్ని దివాలా తీయిస్తారా అని మాత్రం రెచ్చిపోకండి... చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు

 ఉధృతంగా ప్రవహిస్తున్న మున్నేరు , మధిర వాగులు .. కృష్ణా నదికి చేరుతున్న వరద నీరు

ఉధృతంగా ప్రవహిస్తున్న మున్నేరు , మధిర వాగులు .. కృష్ణా నదికి చేరుతున్న వరద నీరు

మున్నేరు, మధిర వాగుల నుంచి వరద నీరు కృష్ణానదికి చేరుతుంది .ఈ రెండు వాగుల నుంచి 30వేల క్యూసెక్కుల నీరు బ్యారేజీకి వస్తోంది. బ్యారేజీ నిర్వహణ అధికారులు మొత్తం 20 గేట్లను అడుగు మేర ఎత్తారు. వీటితో 33వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇందులో 18,500 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వెళ్తుండగా, మరో 14,500 క్యూసెక్కుల నీటిని సాగు నీటి కాల్వలకు ఇస్తున్నారు.

ఇటీవల ఎగువ రాష్ట్రాల్లో కురిసిన వర్షాలతో వచ్చిన కృష్ణా నది వరదల కారణంగా సుమారుగా 300 టీఎంసీల సముద్రంలోకి వెళ్లింది. బ్యారేజీ ఎగువ, దిగువ భాగాలు జలకళను సంతరించుకున్నాయి.

ప్రకాశం బ్యారేజ్ వద్ద భారీగా వరద నీరు.. గణేష్ నిమజ్జన ఏర్పాట్లకు సురక్షితం కాదన్న అధికారులు

ప్రకాశం బ్యారేజ్ వద్ద భారీగా వరద నీరు.. గణేష్ నిమజ్జన ఏర్పాట్లకు సురక్షితం కాదన్న అధికారులు

ఇక తాజాగా మన తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు ఇటీవల వరదల నాటి పరిస్థితి పునరావృతమయ్యే లా కనిపిస్తుంది. మరో రెండు, మూడు రోజులపాటు ఖమ్మం జిల్లా నుంచి వరద నీరు వస్తుందని అధికారులు చెబుతున్నారు..వరద కారణంగా వినాయక నిమజ్జనానికి జరుగుతున్న ఏర్పాట్లకు అంతరాయం ఏర్పడింది. ప్రతి సంవత్సరం ప్రకాశం బ్యారేజీకి దిగువన విగ్రహ నిమజ్జనాలకు ఏర్పాట్లు చేస్తారు. కానీ వరద నీరు పోటెత్తడంతో, బ్యారేజీ 20 గేట్లను ఎత్తడంతో వినాయక విగ్రహాల నిమజ్జనానికి సురక్షితం కాదని అధికారులు భావిస్తున్నారు
.

 శ్రీశైలం జలాశయానికి పోతెట్టుతున్న వరద .. 29 వేల 110 క్యూసెక్కుల నీరు విడుదల

శ్రీశైలం జలాశయానికి పోతెట్టుతున్న వరద .. 29 వేల 110 క్యూసెక్కుల నీరు విడుదల

ఇక మరోవైపు శ్రీశైలం జలాశయానికి జూరాల నుంచి విద్యుదుత్పత్తి ద్వారా 7,696 క్యూసెక్కుల వరద వస్తోంది. ఇక పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా 24,500 క్యూసెక్కులు, హంద్రీ-నీవా సుజల స్రవంతికి 2,026 క్యూసెక్కులు, మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 2,400 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మొత్తం జలాశయం నుండి 29 వేల 110 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇక గడచిన 24 గంటల వ్యవధిలో శ్రీశైలంలో 5.80 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక ఈ వర్షాలు ఇలాగే కొనసాగితే మరోమారు క్రిష్ణమ్మ ప్రకాశం బ్యారేజి దిగువ ప్రాంతాలను ముంచేసే ప్రమాదం ఉంది. అందుకే అధికారులు ఎప్పటికప్పుడు నీటిని విడుదల చేస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

English summary
Recent days Prakasam Barrage over flow of flood water due to interstate floods , but now because of telugu states rain effect overflowing the krishna river at prakasham barrage . in the Khammam district huge rain fall and the munneru, and madhira lakes are over flowing . due to these rains officials opened prakasham barrage 20 gates .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X