రాజకీయాల్లోకి లగడపాటి రీఎంట్రీ: వైసీపీ వైపు చూపు: విజయవాడ ఎంపీ సీటు ఆఫర్?: ఆ ఎమ్మెల్యేతో భేటీ
విజయవాడ: లగడపాటి రాజగోపాల్.. రెండు తెలుగు రాష్ట్రాలకు చిరపరిచితమైన పేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగిన నాయకుడు. ఎన్నికల ఫలితాలను అంచనా వేయడంలో దిట్ట. విజయవాడ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వరుసగా రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. రాష్ట్ర విభజన అనంతరం క్రియాశీలక రాజకీయాలకు దూరం అయ్యారు. దాదాపుగా తెరమరుగయ్యారు. అటు కాంగ్రెస్ పార్టీతోనూ టచ్‌లో లేరు. రాజకీయ సన్యాసం తీసుకున్నట్టుగా భావిస్తున్నారు.

టీడీపీ అనుకూలుడిగా..
ఇదివరకు లగడపాటి రాజగోపాల్ వైఎస్ఆర్సీపీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలుడిగా ముద్ర సైతం సంపాదించుకున్నారు. 2019 ఎన్నికలకు ముందు వరకూ లగడపాటిపై టీడీపీ సానుభూతిపరుడనే పేరు ఉండేది. అప్పట్లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని కూడా ఆయన ఎగ్జిట్ పోల్స్ సర్వేలో స్పష్టం చేశారు. ఆయన అంచనాలు, ఎగ్జిట్ పోల్స్ తలకిందులయ్యాయి..ఘోరంగా తప్పాయి.

రాజకీయాలకు దూరంగా..
ఆ
తరువాత
ఆయన
రాజకీయాల్లో
కనిపించిన
సందర్భాలు
చాలా
తక్కువ.
వైఎస్ఆర్సీపీ,
టీడీపీ,
కాంగ్రెస్..
ఇలా
ఏ
ఒక్కపార్టీతోనూ
లగడపాటి
తన
రాజకీయ
ప్రయాణాన్ని
కొనసాగించలేదు.
అన్నింటికీ
పుల్‌స్టాప్
పెట్టారు.
దాదాపుగా
రాజకీయ
సన్యాసం
తీసుకున్నట్టుగా
భావించారందరూ.
ఇలాంటి
పరిణామాల
మధ్య
లగడపాటి
రాజగోపాల్
పేరు..
మళ్లీ
తెరమీదికి
వచ్చింది.
ఆయన
క్రియాశీలక
రాజకీయాల్లోకి
పునః
ప్రవేశించడానికి
ప్రయత్నాలు
సాగిస్తున్నట్లు
తెలుస్తోంది.

వైసీపీ వైపు చూపు..
అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే దిశగా పావులు కదుపుతున్నట్లు చెబుతున్నారు. అన్నీ సవ్యంగా సాగితే- త్వరలోనే ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. రాజకీయాల్లో తన పునఃప్రవేశాన్ని వైఎస్ఆర్సీపీతో ఆరంభించాలని లగడపాటి భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ బలాన్ని కోల్పోయిందని, అందులో చేరడం వల్ల తన రాజకీయ ప్రయోజనం ఉండబోదని లగడపాటి అంచనా వేస్తున్నట్లు సమాచారం.

వైసీపీ ఎమ్మెల్యేతో భేటీ..?
ఈ
పరిణామాల
మధ్య
లగడపాటి
రాజగోపాల్-
ఎన్టీఆర్
జిల్లా
మైలవరం
శాసన
సభ్యుడు
వసంత
కృష్ణప్రసాద్‌తో
సమావేశం
అయ్యారనే
ప్రచారం
సాగుతోంది.
నిప్పు
లేనిదే
పొగ
రాదన్నట్లుగా..
లగడపాటి
రాజగోపాల్-వసంత
కృష్ణప్రసాద్
మధ్య
కీలక
భేటీ
జరిగిందని
అంటున్నారు.
రాజకీయాల్లోకి
రీ
ఎంట్రీ
ఇవ్వాలనే
అజెండాపైనే
వారిద్దరి
మధ్య
భేటీ
కొనసాగిందని
చెబుతున్నారు.
విజయవాడ
లోక్‌సభ
స్థానాన్ని
తనకు
కేటాయించాలనేది
ఆయన
ప్రధాన
డిమాండ్‌గా
ఉందని
అంటున్నారు.

గన్నవరం స్థానం కోసం..
గన్నవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ స్థానంలో లగడపాటి పెద్ద కుమారుడు ఆశ్రిత్‌ను తెలుగుదేశం పార్టీకి తెరమీదికి తీసుకుని రావడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదని సమాచారం. టీడీపీలో చేరడానికి రాజగోపాల్ పెద్దగా ఆసక్తిగా లేరని, అందువల్లే ఈ ఆఫర్‌ను తిరస్కరించానే ప్రచారం సైతం లేకపోలేదు. అందుకే ఇక ప్రత్యామ్నాయంగా ఆయన చూపు వైఎస్ఆర్సీపీ వైపు పడిందని, ఆ ఒక్క డిమాండ్‌కు అంగీకరిస్తే- అధికార పార్టీ కండువా కప్పుకోవడం ఖాయమనీ అంటున్నారు.