• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఆ టీడీపీ మంత్రులపై సంచలన వ్యాఖ్యలు చేసిన బొండా ఉమా .. ఓటమికి వారే కారణం అట

|

తెలుగుదేశం పార్టీలో అసలే పార్టీ ఫిరాయింపులు టెన్షన్ పుట్టిస్తుంటే అంతర్గత విబేధాలు కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇక ఈ నేపధ్యంలోనే టీడీపీ ఓటమిపై బోండా ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఓటమికి ఎవరో కారణం కాదని , పార్టీలోని కొందరు మంత్రులే కారణం అని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. కొంతమంది భజనపరులు పార్టీని ముంచారన్న అభిప్రాయం ఆయన వ్యక్తం చేసారు బోండా ఉమ. మంత్రులుగా పనిచేసిన వారే ఇదంతా చేశారని ఆయన వ్యాఖ్యానించటం టీడీపీలో దుమారం రేపుతుంది.

దోపిడీ ముఠాలకు నాయకత్వం మీది అంటూ విజయసాయి రెడ్డికి కౌంటర్ ఇచ్చిన టీడీపీ నేత బుద్దా వెంకన్న

 టీడీపీ ఓటమిపై ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిప్రాయం

టీడీపీ ఓటమిపై ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిప్రాయం

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓటమికి ఎన్నో కారణాలు . అయితే టీడీపీ అధినేత ఓటమికి గల కారణాలపై విశ్లేషిస్తున్నారు. ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి అధినేత చంద్రబాబు వరుసగా సమీక్షలు చేస్తున్నారు. నేతలు, కార్యకర్తల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. ఇక పార్టీ నేతల నుంచి ఒక్కరి నుంచి ఒక్కో అభిప్రాయం వ్యక్తం అవుతుంది . ఇక తాజాగా మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ నేతల భజనే కొంప ముంచిందని ఆయన తీవ్ర విమర్శలు చేశారు .

భజన సంఘంలా తయారైన ఆ మంత్రుల వల్లే పార్టీ ఓటమి పాలైందన్న బోండా ఉమా

భజన సంఘంలా తయారైన ఆ మంత్రుల వల్లే పార్టీ ఓటమి పాలైందన్న బోండా ఉమా

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ మాజీ టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఆశ్చర్యకరమైన ప్రకటనలు చేశారు.ఆయన మాట్లాడుతూ, టిడిపి ఓటమి వెనుక ప్రధాన కారణం చంద్ర బాబు మంత్రివర్గంలో ఉన్న కొంతమంది మంత్రులనీ , వారు బయట ఉన్న వాస్తవ పరిస్థితులను చంద్రబాబుకు తెలీనీకుండా అంతా బాగానే ఉందని వారు సిఎంను మోసగించారని పేర్కొన్నారు. ఇతర పార్టీ సభ్యుల అభిప్రాయాలు కూడా తమ వద్దకు చేరనివ్వలేదని తెలిపారు . ప్రజల అభిప్రాయాల గురించి, ఇక రాష్ట్రంలో మారుతున్న పరిణామాల గురించి వారు చంద్రబాబుకు ఏమీ తెలీకుండా మసి పూసి మారేడు కాయ చేశారని పేర్కొన్నారు.

చంద్రబాబుకు ఏమీ తెలీకుండా మసి పూసి మారేడుకాయ చేశారన్న బోండా ఉమా

చంద్రబాబుకు ఏమీ తెలీకుండా మసి పూసి మారేడుకాయ చేశారన్న బోండా ఉమా

ప్రజా క్షేత్రంలో వ్యతిరేకత ఉందని తెలిసినా దాన్ని దిద్దుకునే ప్రయత్నం చెయ్యలేదని పేర్కొన్నారు. అయితే బొండా ఉమా చేసిన వ్యాఖ్యలతో న్తకీ ఆ మంత్రులు ఎవరు అన్న దానిపై పెద్ద చర్చ జరుగుతుంది. టిడిపి మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా చేసిన పరోక్ష వ్యాఖ్యలు పార్టీలో వివాదాన్ని రేకెత్తించాయి. ఇక ప్రస్తుత తరుణంలో ఈ వ్యాఖ్యలు పార్టీలో రాజకీయ వేడిని మరింత తీవ్రతరం చేశాయి .

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Former TDP MLA of the Vijayawada Central constituency Bonda Uma Maheswara Rao made some surprising statements during an interview.He said, “The main reason behind TDP’s defeat was some of the ministers in Chandra Babu’s cabinet. They tricked the CM into thinking everything was okay and did not let the voices of the other party members reach him. They kept him unaware of important facts about people’s opinions.”The TDP leader’s indirect comments raked controversy in the party with people trying to figure Bonda is referring to. These comments might further intensify the political heat in the party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more