గోవాలో కాసినో, బీజేపీ ప్రభుత్వమే కదా.. బీజేపీ నేతలపై మంత్రి కొడాలి నాని, పేకాట ఆడిన బాబు
గుడివాడలో కాసినోపై దుమారం కంటిన్యూ అవుతుంది. మంత్రి కొడాలి నానిపై టీడీపీ నేతలంతా ఒక్కటై దాడి చేస్తున్నారు. ఇవాళ బీజేపీ నేతలు కదం తొక్కారు. సంక్రాంతి అంటే ఎలా నిర్వహించాలని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి కొడాలి నాని కౌంటర్ అటాక్ ఇచ్చారు. గుడివాడ ప్రజలకు సంక్రాంతి సంబరాలు అంటే ఏంటో చూపిస్తామని అంటున్న బీజేపీ నేతల తీరు సరికాదని అన్నారు. గోవా కల్చర్‌ను గుడివాడకు తీసుకువచ్చారని ఆరోపణలు చేస్తున్న బీజేపీ నేతలు.. అక్కడ ఉన్న కాసినోలను ఎందుకు నిషేధించలేదని ప్రశ్నించారు.

గోవాలో బీజేపీ ప్రభుత్వమే..
గోవాలో
ఉన్నది
బీజేపీ
ప్రభుత్వమేనని
కొడాలి
నాని
గుర్తుచేశారు.
కేంద్రంలో
ఉన్నది
బీజేపీ
ప్రభుత్వమేనని
వివరించారు.
గోవాలో
ఎందుకు
కాసినోలను
నిషేధించలేదో
బీజేపీ
నేతలు
చెప్పాలని
ఆయన
డిమాండ్
చేశారు.
చంద్రబాబు
ఎక్కడ
చర్చ
పెట్టినా
వచ్చి
సమాధానం
చెప్పడానికి
తాను
సిద్ధమని
కొడాలి
నాని
సవాల్
చేశారు.
గుండాటను
చూసి
కాసినో
అని
చెప్పే
పార్టీ
టీడీపీ
అని
ఆరోపణలు
గుప్పించారు.
టీడీపీలో
ఉన్నప్పుడు
తాను
నీతివంతుడిని..
వైసీపీలో
ఉంటే
అవినీతిపరుడిలా
కనిపిస్తున్నానా
అని
ప్రశ్నించారు.

గవర్నర్.. అవసరమైతే రాష్ట్రపతిని కలిసినా..
టీడీపీ,
బీజేపీ
నేతలు
గవర్నర్‌ను
కలిస్తే
తనకేం
ఇబ్బంది
లేదన్నారు.
రాష్ట్రపతిని
కలిసినా
అభ్యంతరం
లేదని
తేల్చి
చెప్పారు.
టీడీపీని
ఎన్టీఆర్
నుంచి
లాక్కున్న
చంద్రబాబు,
తనపై
విమర్శలు
చేయడంలో
అర్థం
లేదన్నారు.
గతంలో
చంద్రబాబు
వల్ల
ఇబ్బంది
పడిన
వాళ్లంతా
ఇప్పుడు
ఒక్కొక్కరుగా
బయటికి
వస్తున్నారని..
వాళ్లతో
కేసులు
పెట్టించి
బడితపూజ
చేయడం
ఖాయమని
నాని
హెచ్చరించారు.
ఏ
పార్టీ
నేత
అయినా
సరే..
తనపై
విమర్శలు
చేస్తే
గంటలోపే
తగిన
సమాధానం
చెబుతానని
తేల్చి
చెప్పారు.
కాసినోతో
తనకు
సంబంధం
లేదు
కాబట్టే..
తాను
పెట్రోల్
పోసుకుని
చనిపోతానని
చెప్పిన
విషయాన్ని
నాని
గుర్తు
చేశారు.

పేకాట ఆడిన బాబు
గతంలో
హైదరాబాద్
ఖైరతాబాద్‌లో
ఉన్న
టీడీపీ
ఆఫీస్‌లో
పేకాట
ఆడిన
చరిత్ర
చంద్రబాబుది
అని
తీవ్రంగా
ఆరోపించారు.
గతంలో
చంద్రబాబును
ఎన్టీఆర్
చెప్పు
దెబ్బ
కొట్టారంటూ..
ఎన్టీఆర్
కుటుంబ
సభ్యులే
తనకు
చెప్పారన్నారు.
అలాంటి
నేతలు
తన
గురించి
ఆరోపణలు
చేస్తే..
తగిన
విధంగా
సమాధానం
చెప్పడానికి
సిద్ధమని
తేల్చి
చెప్పారు.
గుండాటను
చూసి
కాసినో
అని
ఆరోపిస్తున్న
టీడీపీ
నేతల
ఉచ్చులో
ఏపీ
బీజేపీ
అధ్యక్షుడు
సోము
వీర్రాజు
పడవద్దని
నాని
సూచించారు.
గతంలో
తెలుగుదేశం
కారణంగానే
బీజేపీ
తీవ్రంగా
నష్టపోయిందని
గుర్తుచేశారు.
ఆ
పార్టీ
నేతలే
కామెంట్లు
చేశారని
గుర్తు
చేశారు.
టీడీపీ
నేతల
ఉచ్చు
నుంచి
బయటపడితేనే
రాజకీయంగా
సోము
వీర్రాజు..
బీజేపీకి
మంచిదని
అభిప్రాయపడ్డారు.
ఆ
పార్టీ
ఇమేజ్
గురించి
మంత్రి
కొడాలి
నాని
కామెంట్
చేయడం
ప్రాధాన్యం
సంతరించుకుంది.
వ్యక్తిగత
విమర్శల
నేపథ్యంలో..
బీజేపీ
బలహీనం
అని
నాని
కోట్
చేశారు.