విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీఎం జగన్ మాటలు కోటలు దాటుతున్నాయి... పనులు గడప దాటడం లేదు : చంద్రబాబు

|
Google Oneindia TeluguNews

ఏపీలో జరగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. సభలో మాట్లాడేందుకు అనుమతిస్తే వాస్తవాలు బయటపడతాయని ప్రభుత్వం బయపడుతోందని ఆయన విమర్శించారు. బలం ఉందని ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు అన్నారు. మరోవైపు స్పీకర్ వ్యవహరశైలి కూడ అభ్యంతకరంగా ఉందని అన్నారు.

 టీడీపీ ప్రతిపక్ష హోదాపై వైసీపీ గురి పెట్టిందా? అసెంబ్లీ సమావేశాల్లోనే ఆ పని పూర్తవుతుందా? టీడీపీ ప్రతిపక్ష హోదాపై వైసీపీ గురి పెట్టిందా? అసెంబ్లీ సమావేశాల్లోనే ఆ పని పూర్తవుతుందా?

 బలం ఉందని పట్టించుకోవడం లేదు

బలం ఉందని పట్టించుకోవడం లేదు


ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సభలో ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అసెంబ్లీ అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ఉల్లిసమస్యలపై ప్రజలు ఇబ్బంది పడుతుంటే సభలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదని అన్నారు. ఉల్లిగడ్డ కోసం క్యూ లైన్లో నిలబడి ప్రజలు ప్రాణాలను పోగొట్టుకుంటున్నారని విమర్శించారు. మరోవైపు ఆర్టీసీ చార్జీలను కూడ దారుణంగా పెంచారని చంద్రబాబు ఆరోపించారు. చార్జీల పెంపుపై సభలో చర్చించాలని కోరినా పట్టించుకోవడం లేదని అన్నారు.

సీఎం మాటలు తప్ప చేతలు లేవు

సీఎం మాటలు తప్ప చేతలు లేవు


ముఖ్యంగా అసెంబ్లీలో జగన్ మాటలు కోటలు దాటుతున్నాయని పనులు మాత్రం గడప దాటడం లేదని అన్నారు. ఈ నేపథ్యంలోనే రాయలసీమ జిల్లాకు నీళ్లు ఇవ్వాలని ముందుగా సంకల్పించింది ఎన్టీఆర్ అని తెలిపారు. ఇందుకోసం హంద్రీనివా, గాలేరు-నగరికి శ్రీకారం చుట్టారని చెప్పారు. ఈ ప్రాజెక్టులకు ఎన్టీఆర్ శంకుస్థాపన చేస్తే..తాను వచ్చిన వచ్చిన తర్వాత వాటిని పూర్తి చేశామని అన్నారు. దీంతో పాటు గోదావరి-పెన్నా నదుల అనుసంధానంతో రాయలసీమకు నీళ్లివ్వాలని అలోచించామని చెప్పారు. ఇక రాయలసీమకు ద్రోహం చేసింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం జరిగే సమయంలో వాటిని వైఎస్ అడ్డుకున్నారని అన్నారు.

వైసీపీ కార్యకర్తలకే 4 లక్షల ఉద్యోగాలు

వైసీపీ కార్యకర్తలకే 4 లక్షల ఉద్యోగాలు

మరోవైపు రాష్ట్రంలో కియా మోటార్స్ తీసుకువచ్చిన ఘనత టీడీపీదేనని అన్నారు. నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్న ప్రభుత్వం వైకాపా కార్యకర్తలకే ఇచ్చిందని ఆరోపించారు. ఇక అగ్రిగోల్డ్ భాదితులకు న్యాయం జరగాలని టీడీపీ ప్రభుత్వం కోరుకుందని అన్నారు. ఇందుకోసం వారికి ఇచ్చేందుకు 336 కోట్లు కూడ సిద్దం చేశామని తెలిపారు. ఇక హయ్ లాండ్‌పై కూడ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలోనే అందరు వైసీపీ నేతల్లాగే నేరస్థులని అనుకుంటున్నారని మండిపడ్డారు.

English summary
Opposition leader Chandrababu Naidu has alleged that the government is not giving opportunity to talk in the assembly for issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X