విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చెవిరెడ్డి వ‌ర్సెస్ అచ్చంనాయ‌డు: స‌భ‌లో గంద‌ర‌గోళం: చ‌ంద్ర‌బాబు ఇలా స‌ర్దుకున్నారు..!

|
Google Oneindia TeluguNews

ఏపీ శాస‌న‌స‌భా తొలి స‌మావేశాల్లో రెండో రోజే అధికార -విప‌క్షాల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలాయి. నూత‌న స్పీక‌ర్‌గా ఎన్నికైన త‌మ్మినేని సీతారాంను ఛైర్‌లోకి ఆహ్వానించేందుకు విప‌క్ష‌నేత చంద్ర‌బాబు రాక‌పోవ‌టం పైన స‌భ‌లో వైసీపీ నేత‌లు విమర్శ‌లు చేస్తున్నారు. ఆ స‌మ‌యంలో ప్రొటెం స్పీక‌ర్‌గా వ్య‌వ‌హ‌రించిన అప్ప‌ల‌నాయుడు సైతం తాను అన్ని పార్టీల నేత‌ల‌ను ఆహ్వానించాన‌ని చెప్ప‌టంతో చంద్ర‌బాబు ఇరుకున ప‌డ్డారు. అదే స‌మ‌యంలో ప్ర‌భుత్వ విప్ చెవిరెడ్డి భాస్క‌ర రెడ్డి..టీడీపీ ఉప నేత అచ్చంనాయుడును ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపాయి.

చంద్ర‌బాబు బంట్రోతును పంపారు..

చంద్ర‌బాబు బంట్రోతును పంపారు..

ఏపీ శాస‌న‌స‌భా కొత్త స్పీక‌ర్‌గా త‌మ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికైన‌ట్లు ప్ర‌క‌టించిన ప్రొటెం స్పీకర్ చిన అప్ప‌ల నాయుడు ఆయ‌న్ను అన్ని పార్టీల నేత‌లు ఛైర్ వ‌ద్దకు తీసుకురావాల‌ని సూచించారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌.. టీడీపీ నుండి అచ్చంనాయుడు..జ‌న‌సేన నుండి రాపాక వ‌ర‌ప్ర‌సాద్‌లు వ‌చ్చారు. అయితే, చంద్ర‌బాబు రాకుండా అచ్చం నాయుడ‌ను పంప‌టం పైనా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స‌హా వైసీపీ నేత‌లంతా విరుచుకుప‌డ్డారు. అదే స‌మ‌యంలో ప్ర‌భుత్వ విప్ చెవిరెడ్డి మాట్లాడుతూ చంద్ర‌బాబుకు స్పీక‌ర్‌ను అగౌర‌వ‌ప‌రిచార‌ని.. ఆయ‌న స్పీక‌ర్ వ‌ద్ద‌కు రాకుండా బంట్రోతును పంపించార‌ని వ్యాఖ్యానించారు. దీంతో..స‌భ‌లో గంద‌గోళం నెల‌కొంది. చెవిరెడ్డి క్ష‌మాప‌ణ చెప్పాల‌ని టీడీపీ నేత‌లు డిమాండ్ చేసారు. తాను క్ష‌మాప‌ణ చెబుతాన‌ని..అంత కంటే ముందు గ‌త అయిదేళ్ల కాలంలో అచ్చంనాయుడు దివంగ‌త వైయ‌స్సార్‌..నాటి ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ పైన చేసిన వ్యాఖ్య‌ల‌కు క్ష‌మాప‌ణ చెబితే తాను చెబుతాన‌ని స్ప‌ష్టం చేసారు.

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఫైర్‌..

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఫైర్‌..

ప్రొటెం స్పీక‌ర్ కొత్త స్పీక‌ర్ ఎన్నిక త‌రువాత అన్ని పార్టీల నేత‌లు రావాల‌ని ఆహ్వానిస్తే..చంద్ర‌బాబు త‌ప్పు దోవ ప‌ట్టస్తు న్నార‌ని..అబ‌ద్దాలు చెప్ప‌టం మాత్రం మాన‌టం లేద‌ని విరుచుకుప‌డ్డారు. అదే స‌మ‌యంలో ప్రొటెం స్పీక‌ర్ గా వ్య‌వ‌హ రించిన అప్ప‌ల‌నాయ‌డు సైతం మాట్లాడుతూ తాను అన్ని పార్టీల నేత‌లూ రావాలంటూ ఆహ్వానించాన‌ని స్ప‌ష్టం చేసారు. దీంతో మ‌రోసారి జ‌గ‌న్ స్పందిస్తూ...కావాలంటే మ‌రోసారి ప్రొటెం స్పీక‌ర్ ఆహ్వానించిన విష‌యాన్ని వీడియా మ‌రో సారి ఇక్క‌డ ప్ర‌దర్శిద్దామ‌న్నారు. బీసీ వ‌ర్గానికి చెందిన వారికి స్పీక‌ర్ ప‌దవి ఇవ్వ‌టం ఇష్టం లేక‌నే చంద్ర‌బాబు అబ‌ద్దాలు చెబుతున్నార‌ని...ఆయ‌న క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేసారు. చేసిన త‌ప్పు స‌రిదిద్దుకోకుండా..ఇంకా అబ‌ద్దాలు చెప్పే ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ విరుచుకుప‌డ్డారు.

Recommended Video

చంద్రబాబుకు దక్కని కనీస గౌరవం
చంద్ర‌బాబు స‌ర్దుకున్నారు..

చంద్ర‌బాబు స‌ర్దుకున్నారు..

ఈ వివాదం కొన‌సాగుతుండగానే..రోజా మాట్లాటేందుకు ప్ర‌య‌త్నించారు. అచ్చంనాయుడు లేచి చెవిరెడ్డి వ్యాఖ్య‌ల మీద చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేసారు. స్పందించిన స్పీక‌ర్ తాను రికార్డుల‌ను ప‌రిశీలించి..అభ్యంత‌ర‌క‌మైన వ్యాఖ్య‌లు ఉంటే తొలిగిస్తాన‌ని హామీ ఇచ్చారు. ఆ త‌రువాత ప్రొటెం స్పీక‌ర్ ఆహ్వానించిన‌ట్లుగా గుర్తించిన చంద్ర‌బాబు ఈ విష‌యం పై ఇక చ‌ర్చ వ‌ద్ద‌ని..స్పీక‌ర్ త‌గిన నిర్ణ‌యం తీసుకోవాలంటూ స‌ర్దుకున్నారు. ఆ వెంట‌నే మాట్లాడిన రోజా సైతం గ‌తంలో టీడీపీ ప్ర‌భుత్వం త‌న‌ను ఏడాది పాటు స‌స్పెండ్ చేసిన విష‌యాన్ని గుర్తు చేసారు. చంద్ర‌బాబు ఇది తొలి సారి కాద‌ని..గ‌తంలో కిర‌ణ్ కుమార్ రెడ్డి స్పీక‌ర్‌గా ఎన్నికైన స‌మ‌యంలోనూ ఇదే విధంగా వ్య‌వ‌హ‌రించారంటూ చెప్పుకొచ్చారు. చంద్ర‌బాబును ల‌క్ష్యంగా చేసుకొని రోజా ఫైర్ అయ్యారు.

English summary
Govt Whip Chevireedy Bhaskar Reddy comments on Acham Naidu caused disturbance in Ap Assembly. Speaker given ruling that those comments will be expelled from records.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X