• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

టీడిపి స్టార్ క్యాంపెయినర్ ఆయ‌నే..! ఏపిలో పార్టీని ప‌రుగులు పెట్టించేందుకు రెఢీ...!!

|

విజయవాడ/హైద‌రాబాద్ : పదవుల‌తో ప్ర‌మేయం లేకుడా ప్రజల ఆకాంక్షలే తనకు ముఖ్యమని తేల్చి చెప్పిన వంగవీటి వారసుడికి అరుదైన గౌరవం కలిపించింది టీడీపీ. తెలుగు దేశం స్టార్‌ క్యాంపెయినర్‌ గా రాధాకు అవకాశం కలిపించింది. దీంతో టీడీపీ తరపున రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయబోతున్నారు వంగవీటి రాధా. చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, టీడీపీతో జరగబోయే అభివృద్ధిని ప్రజలకు వివరించేందుకు శ్రీ‌కారం చుడుతున్నారు వంగ‌వీటి రాధా.

రియల్ ఎస్టేట్, పెళ్లిళ్లు, ఉద్యోగాలు.. మాటలే పెట్టుబడిగా కోటిన్నర మాయం

వంగ‌వీటి రాధా.. ఇప్పుడు టీడిపి స్టార్ క్యాంపెయిన‌ర్..!

వంగ‌వీటి రాధా.. ఇప్పుడు టీడిపి స్టార్ క్యాంపెయిన‌ర్..!

వాస్తవానికి వంగవీటి రాధాకు ఎమ్మెల్సీ పదవిని ఆఫర్ చేసింది టీడీపీ. కానీ, పార్టీ ఆఫర్ ను రాధా సున్నితంగా తిరస్కరించటంతో..కోరుకున్న చోట సీటు కేటాయిస్తామని ప్రతిపాదించింది. అయితే...రాధా మాత్రం తాను పదవులు ఆశించి పార్టీలో చేరలేదని తేల్చి చెప్పేశారు.ప్రజల ఆశయాలతో పాటు తన తండ్రిని అవమానించిన వైసీపీ ఓటమే తన లక్ష్యమని వివ‌ర‌ణ ఇచ్చారు రాధా.

రంగా ఆశ‌యాల కోసం ప‌ని చేస్తా..! టీడిపిని గెలిపిస్తానంటున్న రాధా..!!

రంగా ఆశ‌యాల కోసం ప‌ని చేస్తా..! టీడిపిని గెలిపిస్తానంటున్న రాధా..!!

రంగా ఆశయాల సాధన కోసం, రాష్ట్ర పగతి కోసం టీడీపీకి తోడుగా ఉంటానని అంటున్నారు. విజయవాడలో పేద ప్రజలందరికీ ఇళ్ల పట్టాలు అందించటం రంగా కలని గుర్తు చేసిన రాధా..తన తండ్రి కల వాస్తవ రూపంలోకి రావాలంటే టీడీపీ అధికారంలోకి రావటం తప్పనిసరి అని భావిస్తున్నట్టు తెలిపారు. అందుకు అనుగుణంగా తాను టీడీపీకి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తానని చంద్రబాబును కోరారు. రాధా విన్నపంపై సానుకూలంగా స్పందించిన చంద్రబాబు వంగవీటి రాధాను టీడీపీ స్టార్ క్యాంపెయినర్ గా ప్రకటించారు.

రాష్ఠ్ర వ్యాప్తంగా ప్ర‌చారం..! ప్ర‌భావితం చేస్తానంటున్న వంగ‌వీటి..!!

రాష్ఠ్ర వ్యాప్తంగా ప్ర‌చారం..! ప్ర‌భావితం చేస్తానంటున్న వంగ‌వీటి..!!

రాధా ఎన్నికలకు దూరంగా ఉంటూనే అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి జగన్ తీరును ఎండగట్టాలని నిర్ణయించుకున్నారు. సామాజిక సమీకరణాల నేపధ్యంలో వంగవీటి రాధా ప్రచారం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. కృష్ణా జిల్లాలోనూ రెండు భిన్న ధ్రువాలు ఏకం కానున్నాయి. ఈ ప్రభావం టీడీపీ విజయానికి దోహదం చేస్తుందని పార్టీ భావిస్తోంది.

ఒక్క‌టేన ప్ర‌త్య‌ర్థులు..! ఇకక్రిష్ణ జిల్లాలో గెలుపే ల‌క్ష్యం అటున్న యువ నేత‌లు..!!

ఒక్క‌టేన ప్ర‌త్య‌ర్థులు..! ఇకక్రిష్ణ జిల్లాలో గెలుపే ల‌క్ష్యం అటున్న యువ నేత‌లు..!!

రాధా ప్రధానంగా కృష్ణా, ఉభయగోదావరి, ఉత్తరాంధ్రలోని నియోజకవర్గాల్లో ప్రచారం చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరో పక్క, విజయవాడలో వంగవీటి, దేవినేని కుటుంబాల మధ్య ఉన్న విభేదాల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, ప్రస్తుతం ఇరు కుటుంబాల వారసులు వంగవీటి రాధా, దేవినేని అవినాష్ లు ఇద్దరూ ఒకే వేదిక పైకి వచ్చారు. దీంతో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు కూడా పెద్ద ఎత్తున మారే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

English summary
The Telugu Desham has added a chance to Radha as Star Campaigner. Vangaveeti Radha is going to campaign across the state on behalf of TDP. Vangaveeti Radha is working to explain the development of the welfare schemes implemented by the Chandrababu Government and the development of the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X