విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీలో కరోనా కేసులు పెరగటానికి టెస్టులే కారణం ... ఆరోగ్య శాఖామంత్రి ఆళ్ళ నానీ

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని రాష్ట్రంలో కరోనాకేసులు పెరగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెస్టులు ఎక్కువగా చేస్తున్న కారణంగానే కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయని మంత్రి ఆళ్ల నాని వ్యాఖ్యానించారు . తిరుపతి కోవిడ్ ఆసుపత్రిలో ఈ రోజు తనిఖీలు నిర్వహించిన ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నానీ ఈ వ్యాఖ్యలు చేశారు.

 క్వారంటైన్ కేంద్రం నుండి పరారైన కరోనా పాజిటివ్ ఉన్న మర్డర్ కేసు నిందితుడు క్వారంటైన్ కేంద్రం నుండి పరారైన కరోనా పాజిటివ్ ఉన్న మర్డర్ కేసు నిందితుడు

ఖర్చు లెక్క చెయ్యకుండా కరోనా కట్టడికి ప్రభుత్వ చర్యలు

ఖర్చు లెక్క చెయ్యకుండా కరోనా కట్టడికి ప్రభుత్వ చర్యలు

చిత్తూరు జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల ఖర్చు అవుతున్నా, కరోనా వ్యాప్తిని అరికట్టడం కోసం ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.

 టెస్ట్ లు పెరగడం వల్లే రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నాయి

టెస్ట్ లు పెరగడం వల్లే రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నాయి

ఏపీ సీఎం జగన్ ఆదేశాల మేరకు కరోనా కట్టడి కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇక టెస్ట్ లు పెరగడం వల్లే రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నాయని చెప్పిన ఆళ్ల నాని ఏపీ ప్రభుత్వం కరోనా నియంత్రణకు నడుంబిగించింది అని తెలిపారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆసుపత్రిలో కరోనా బాధితులకు అందుతున్న వైద్య సేవలపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారని, తీసుకోవలసిన చర్యలను సూచిస్తున్నారు అని ఆయన అన్నారు.

Recommended Video

Amit Shah Tests Coronavirus Positive ఆస్పత్రిలో చేరుతున్నా అని అమిత్ షా ట్వీట్ ! || Oneindia Telugu
నెలకు 350 కోట్ల రూపాయలు కరోనా నియంత్రణకు ఖర్చు

నెలకు 350 కోట్ల రూపాయలు కరోనా నియంత్రణకు ఖర్చు

రాష్ట్ర వ్యాప్తంగా నెలకు 350 కోట్ల రూపాయలు కరోనా నియంత్రణ కోసం ఖర్చు చేస్తున్నామని పేర్కొన్న ఆళ్లనాని కరోనా బారిన పడిన వాళ్ళందరూ ఏపీలోనే వైద్య సేవలు పొందవచ్చు అన్నారు. ఎవరు పక్క రాష్ట్రాలకు వెళ్లి చికిత్స పొందని ఆళ్ల నాని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఏపీలో కరోనా బారిన పడిన వాళ్ళు చాలామంది ఐఏఎస్ లు, మంత్రులు హైదరాబాద్ లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎవరూ చికిత్స కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లవద్దని ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని విజ్ఞప్తి చేశారు.

English summary
Andhra Pradesh Health Minister Alla Nani made interesting remarks on the rise of corona Cases in the state. Minister Alla Nani commented that the number of cases was increasing due to the high number of tests being conducted in the state of Andhra Pradesh. The remarks were made by Health Minister Alla Nani while conducting inspections at Tirupati covid Hospital today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X