విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హర్ష‌వ‌ర్ద‌న్ విచార‌ణ ముగిసింది: ఇక ఆ హీరో పైనే ఎన్ఐఏ దృష్టి : స్టేకు హైకోర్టు నో..!!

|
Google Oneindia TeluguNews

వైసిపి అధినేత జ‌గ‌న్ పై దాడి కేసులో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్ఐఏ విచార‌ణ పై స్టే విధించా ల న్న రాష్ట్ర ప్ర‌భుత్వ అభ్య‌ర్ధ‌న‌ను హై కోర్టు తిర‌స్క‌రించింది. ఇదే స‌మ‌యంలో విమ‌నాశ్ర‌యంలో క్యాంటీన్ నిర్వ‌హ‌కు డు అయిన హ‌ర్ష వ‌ర్ద‌న్ ను ఎన్ఐఏ విచారించింది. ఇక‌, రాష్ట్రంలో జ‌రిగే ప‌రిణామాల పై ముందే అపరేష‌న్ గరుడ పేరు తో సంచ‌ల‌నం సృష్టించిన సినీ హీరో ను ఎన్ఐఏ విచారించ‌నున్న‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం..

హ‌ర్ష వ‌ర్ద‌న్ విచార‌ణ పూర్తి..

హ‌ర్ష వ‌ర్ద‌న్ విచార‌ణ పూర్తి..

విశాఖ విమానాశ్ర‌యంలో జ‌గ‌న్ పై దాడి కేసులో అక్క‌డి క్యాంటీన్ య‌జ‌మాని హ‌ర్ష‌వ‌ర్ద‌న చౌద‌రిని జాతీయ దర్యాప్తు సం స్థ అధికారులు విచారించారు. ఏయిర్ పోర్టులోని ఫ్యూజన్‌ఫుడ్స్‌ రెస్టారెంట్ లో ప‌ని చేసే వ్య‌క్తే జ‌గ‌న్ పై దాడికి దిగాడు. దీంతో..వైసిపి నేత‌లు క్యాంటీన్ య‌జ‌మాని హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ పై అనేక అరోప‌ణ‌లు చేసారు. తొలుత విచార‌ణ‌కు రావాల‌ని ఎన్ఐఏ పోలీసులు కోర‌గా..తాను యాక్సిడెంట్ కార‌ణంగా ఇంట్లోనే ఉన్నాన‌ని చెప్ప‌టంతో..ఎన్ఐఏ అధికారులే ఆయ న ఇంటికి వెళ్లి విచారించారు. శ్రీనివాస‌రావు ఎలా తెలుసు..ఎంత కాలం నుండి తెలుసు..క‌త్తి అత‌ను క్యాంటీన్ లో ఎలా తీసుకురాగ‌లిగాడు వంటి ప్ర‌శ్న‌ల‌తో స‌మాధానాలు రాబ‌ట్టిన‌ట్లు తెలుస్తోంది. హ‌ర్ష వ‌ర్ధ‌న్ చెప్పిన స‌మాధానాల‌ను రికార్డు చేసిన ఎన్ఐఏ పోలీసులు కేసు కొన‌సాగింపు పై దృష్టి సారించారు.

జగన్‌పై దాడి కేసు విచారణ వాయిదా: వైసీపీ నేతలకి నోటీసులు, 'అతను లోన్లు ఎలా చెల్లిస్తున్నాడు?'జగన్‌పై దాడి కేసు విచారణ వాయిదా: వైసీపీ నేతలకి నోటీసులు, 'అతను లోన్లు ఎలా చెల్లిస్తున్నాడు?'

ఇక ఆ హీరో పైనే ఎన్ఐఏ దృష్టి...!

ఇక ఆ హీరో పైనే ఎన్ఐఏ దృష్టి...!

కొంత కాలం క్రితం ఆప‌రేష‌న్ గ‌రుడ పేరుతో ఏపి లో సంచ‌ల‌నం సృష్టించిన ఓ హీరో పై ఎన్ఐఏ పోలీసులు దృష్టి సారించిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. జ‌గ‌న్ పై దాడి జ‌రిగిన రోజున ముఖ్య‌మంత్రి తో స‌హా మంత్రులు సైతం ఆ న‌టుడు చెప్పిన ఆప‌రేష‌న్ గ‌రుడ గురించి ప్ర‌స్తావించి..అత‌డు చెప్పింది నిజ‌మైంద‌నిపిస్తోంద‌ని పేర్కొన్నారు. ఆ హీరో ను విచారించాల‌ని బిజెపి...వైసిపి నేత‌లు డిమాండ్లు కూడా చేసారు ఇక‌, ఇప్పుడు జ‌గ‌న్ పై దాడి కేసుల విచార‌ణ‌లో భాగంగా.. ఆ హీరోను విచారించే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. ఆప‌రేష‌న్ గ‌రుడ లో వాస్త‌వం ఎంత‌.. ఆ హీరో చెప్పి న దానికి..జ‌గ‌న్ పై దాడికి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో ఈ విచార‌ణ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. అయితే, ఆ హీరో ప్ర‌స్తుతం అందుబాటులో లేర‌ని స‌మాచారం.

స్టేకు హైకోర్టు నో..

స్టేకు హైకోర్టు నో..

జ‌గ‌న్ పై దాడి కేసులో మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) నుంచి తప్పించాలని ఏపీ ప్రభుత్వం హైకోర్టులో స్టే పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ధ ర్మాసనం స్టేను నిరాకరిస్తూ కేసును కొట్టివేసింది. ఈ నెల 30లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇప్పటివరకు చేసిన దర్యాప్తు వివరాలను కోర్టు ముందు పెట్టాలని ఎన్‌ఐఏకు ఆదేశాలు జారీ చేసింది. ఎన్ఐఏ విచార‌ణ కు రాష్ట్ర ప్ర‌భుత్వం తొలి నుండి అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తోంది. దీని పై ఇప్ప‌టికే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నేరుగా ప్ర‌ధానికి లేఖ రాసారు. కోర్టులోనూ దీని పై రాష్ట్ర ప్ర‌భుత్వం పోరాడుతోంది. ఇప్పుడు హైకోర్టు ధ‌ర్మాస‌నం స్టేకు నిరాక‌రించ‌టంతో.. ఏపి ప్ర‌భుత్వం త‌రువాతి అడుగు ఏంటో చూడాలి.

English summary
NIA questioned Visakha Air port canteen owner Harsha Vardhan in Attack on Jagan case. In a shock to AP govt High court rejected a petition to give stay on NIA investigation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X