విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దాడులపై స్పందించిన హోం మంత్రి సుచరిత .. ప్రతీ చోట కాపలా ఉండలేం కదా అంటూ వ్యాఖ్య

|
Google Oneindia TeluguNews

హత్యా రాజకీయాలు మంచి పద్దతి కాదని మాజీ మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు . కార్యకర్తలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తుందని ఆయన మండిపడ్డారు. ఇక తాజాగా మాజీ మంత్రి నారాలోకేష్ వ్యాఖ్యలపై, టీడీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయన్న ఆరోపణలపై హోం మంత్రి మేకతోటి సుచరిత స్పందించారు.

కేటీఆర్ , హరీష్ ల సరదా సంభాషణ .. బావా ..మళ్ళీ కుదరదేమో మన పాత ఛాంబర్లు చూసుకుందాం రాకేటీఆర్ , హరీష్ ల సరదా సంభాషణ .. బావా ..మళ్ళీ కుదరదేమో మన పాత ఛాంబర్లు చూసుకుందాం రా

దాడులు జరిగే ప్రతి చోట తాము కాపలా ఉండటం సాధ్యం కాదన్న హోం మంత్రి సుచరిత

దాడులు జరిగే ప్రతి చోట తాము కాపలా ఉండటం సాధ్యం కాదన్న హోం మంత్రి సుచరిత

ఏపీలో జరుగుతున్న రాజకీయ దాడులపై మాట్లాడిన హోంమంత్రి మేకతోటి సుచరిత ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు .రాజకీయ దాడులపై కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి జగన్ కూడా చెప్పారని గుర్తు చేసిన మంత్రి సుచరిత గుంటూరులో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, దాడులు జరిగే ప్రతి చోట తాము కాపలా ఉండటం సాధ్యం కాదని పేర్కొన్నారు .ఇక దాడులకు గురైన వారు ఫిర్యాదు చేస్తే నిందితులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి సుచరిత తెలిపారు . ఇక టీడీపీ కార్యకర్తలపై , పార్టీ నేతలపై దాడులు జరగాలని తాము కోరుకోవడం లేదని ఆమె పేర్కొన్నారు .

శాంతి భద్రతలు కాపాడతామని నీతులే తప్ప చేసిందేమీ లేదు.. టీడీపీ నేతలపై దాడులు ఆగలేదు అంటున్న టీడీపీ

శాంతి భద్రతలు కాపాడతామని నీతులే తప్ప చేసిందేమీ లేదు.. టీడీపీ నేతలపై దాడులు ఆగలేదు అంటున్న టీడీపీ

టీడీపీ కార్యకర్తలు, నేతలపై దాడులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని అటు టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా మంగళగిరిలో టీడీపీ కీలక నేత హత్యా కు గురి కావటంతో ఆ కుటుంబాన్ని పరామర్శించటానికి వెళ్ళిన నారా లోకేష్ ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. ఇప్పటి వరకు ఆరుగురు కార్యకర్తలు దాడుల్లో చనిపోయారని.. ప్రభుత్వం కనీసం పట్టించుకున్న పాపానపోలేదన్నారు. మంగళగిరిలో దారుణ హత్యకు గురైన టీడీపీ నేత ఉమా యాదవ్ కుటుంబాన్ని పరామర్శించిన లోకేష్. పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ కార్యకర్తలపై దాడులు పెరిగాయని టీడీపీ నేతలు, కార్యకర్తల్ని దారుణంగా హతమారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శాంతిభద్రతలు కాపాడుతామని నీతులు చెబుతూనే, మరోవైపు అనుకున్నది చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం ఇంటికి అతి దగ్గరలోనే టీడీపీ నేత హత్య జరిగితే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్‌లో ఉన్నట్లా అంటూ ప్రశ్నించారు.

లోకేష్ వ్యాఖ్యలకు స్పందించిన మంత్రి .. ఆమె వ్యాఖ్యలపై టీడీపీ అసహనం

లోకేష్ వ్యాఖ్యలకు స్పందించిన మంత్రి .. ఆమె వ్యాఖ్యలపై టీడీపీ అసహనం

ఇక నారా లోకేష్ వ్యాఖ్యలకు సమాధానంగా హోంమంత్రి మేకతోటి సుచరిత దాడులు జరిగే ప్రతి చోట తాము కాపలా ఉండలేమని షాకింగ్ కామెంట్ చేశారు . రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, తమ పార్టీ నేతలపై దాడులు జరుగుతున్నాయని టీడీపీ చేస్తున్న ఆరోపణలపై ఆమె ఇలా స్పందించారు. మొన్నటికి మొన్న దాడులు ఎక్కువగా వైసీపీ కార్యకర్తలపైనే జరిగాయని కూడా ఆమె చెప్పటం గమనార్హం . ఇక తాజాగా ఆమె స్పందన విషయంలో టీడీపీ అసహనం వ్యక్తం చేస్తుంది.

English summary
Speaking at a programme in Guntur, the minister said that the Chief Minister Jagan had also said the government should be tougher on political attacks, saying that it was impossible to guard every one . victims themselves need to approch wherever attacks took place.Minister Sucharitha said that if the attackers lodged a complaint, action would be taken against the accused. She added that they do not want attacks on TDP activists and party leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X