విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మీడియా ఆంక్షలపై ఏపీ అసెంబ్లీలో దుమారం, చంద్రబాబుపై శ్రీకాంత్‌రెడ్డి, పుష్పశ్రీవాణి ఫైర్

|
Google Oneindia TeluguNews

ఏపీ అసెంబ్లీలో గురువారం ధరలపై చర్చ కాస్త మీడియాపైకి మళ్లింది. మీడియాపై 2430 జీవో గురించి టీడీపీ సభ్యుల ఆందోళన వాగ్వివాదానికి దారితీసింది. గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులను, కొన్ని మీడియా సంస్థలను ప్రోత్సహించారని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అనడంతో అగ్గిరాజేసింది. తర్వాత సీఎం జగన్ ఆన్సర్‌తో చంద్రబాబు రెచ్చిపోయారు. పెరుగుతున్న ధరలపై చర్చ కాస్త.. మీడియా అంశంపై చర్చకు దారితీసింది.

 చంద్రబాబు అత్తగారికి కూడా పదవీ, ఎస్సీ,ఎస్టీ,బీసీలకు 50శాతం పదవులు, అసెంబ్లీలో జగన్ చంద్రబాబు అత్తగారికి కూడా పదవీ, ఎస్సీ,ఎస్టీ,బీసీలకు 50శాతం పదవులు, అసెంబ్లీలో జగన్

జగన్‌పై ఇలా..

జగన్‌పై ఇలా..

అంతకుముందు వైసీపీ ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి టీడీపీ సభ్యుల ప్రవర్తన గురించి మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి ప్రతిపక్ష నేత జగన్‌మోహన్ రెడ్డిని దూషించిన సంగతి మరచిపోలేదన్నారు. తమ పార్టీకి చెందిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాపై చంద్రబాబు ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించిందని చెప్పారు. ప్రతిపక్షంపై టీడీపీ నేతలు ఎలా ప్రవర్తించారో జనం చూశారని.. ఇప్పుడు వారు నీతులు చెప్పడం సరికాదన్నారు. అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి నీతుల గురించి చెబితే దెయ్యాల వేదాలు వల్లించినట్టు ఉందని పుష్ప శ్రీవాణి అన్నారు.

దూషించి, దాడి చేసి

దూషించి, దాడి చేసి

సభా సంప్రదాయాలను టీడీపీ తుంగలో తొక్కిందని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. సభలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై దాడి చేయలేదా అని ప్రశ్నించారు. రోజాను దూషించారని.. ఎస్పీ ఎమ్మెల్యేలపై కూడా చేయిచేసుకున్నారని చెప్పారు. జీవో 2430 గురించి వారు ఆందోళన చేయడం చూస్తూ నవ్వొస్తుందని చెప్పారు. సభా సంప్రదాయాల ప్రకారం నడుచుకుంటే సరిపోతుంది.. తప్ప ఆందోళన చేయాల్సిన అవసరం ఏముందని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు.

లిఖితపూర్వకంగా..

లిఖితపూర్వకంగా..

ఏదైనా సమస్య ఉంటే లిఖితపూర్వకంగా స్పీకర్‌కు అందజేయాలి.. అలా కాకుండా హింసాత్మక ధోరణిలో ఆందోళన చేయడం సరికాదన్నారు. మీడియా గురించి మాట్లాడుతున్న చంద్రబాబు.. వ్యవస్థను నాశనం చేసింది ఆయన కాదా అని ప్రశ్నించారు. నిజాలు రాయని మీడియా సంస్థలను వెనకెసుకురావడం సరికాదన్నారు. ఇప్పటికీ తన ఎల్లో మీడియాను కాపాడేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

 ఐదు కేసులు

ఐదు కేసులు

గత ప్రభుత్వం సాక్షి పేపర్‌పై ఐదు కేసులు పెట్టిందని శ్రీకాంత్ రెడ్డి సభ దృష్టికి తీసుకొచ్చారు. రాజధాని భూముల ధరలు తగ్గాయని వార్త రాస్తే ఐదు కేసులు పెట్టారని పేర్కొన్నారు. వార్త, ఎఫ్ఐఆర్ కాపీలను స్పీకర్ తమ్మినేని సీతారాంకు అందజేశారు. గత ప్రభుత్వంలో టైమ్స్ నో చంద్రబాబు గురించి తప్పుగా వార్త ప్రసారం చేస్తే నేషనల్ మీడియా అమ్ముడుపోయిందని కామెంట్ చేశారు. అంటే మీ అనుకూలం కానీ మీడియాపై నిందలు వేస్తారా అని శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు.

English summary
hot discussion on media Restrictions in ap assembly
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X