విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కృష్ణమ్మ పరవళ్లు.. రికార్డు స్థాయిలో వరద ఉధృతి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. గత రికార్డులకు చేరువగా వరద ఉధృతి కొనసాగుతోంది. సెప్టెంబర్ మాసం పూర్తి కాకుండానే 1270 టీఎంసీల వరద నీరు వచ్చి చేరడంతో కృష్ణా నది జలకళ సంతరించుకుంది. రెండు దశబ్దాల చరిత్రలో ఇది నాలుగోసారి కావడం విశేషం. అదలావుంటే కృష్ణా బేసిన్ చరిత్రలో ఈ సంవత్సరం ప్రాధాన్యత సంతరించుకుంది.

కృష్ణమ్మ పరవళ్లు.. భారీగా వరద నీరు

కృష్ణమ్మ పరవళ్లు.. భారీగా వరద నీరు

కృష్ణమ్మ గత రికార్డులకు చేరువగా వరద ఉధృతి నమోదు చేసుకుంది. ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి ఏకంగా 12 వందల 70 టీఎంసీల వరద నీరు వచ్చి చేరింది. ఈసారి సెప్టెంబర్ నెల ముగియకముందే ఊహించని స్థాయిలో వరద ఉధృతి కొనసాగుతుండటం విశేషం. ఆదివారం (30.09.2019) నాడు శ్రీశైలం జలాశయానికి దాదాపు లక్షన్నర క్యూసెక్కులకు పైగా వరద కొనసాగడంతో దిగువకు నీరు విడుదల చేయక తప్పలేదు.

అధికారం కోసం సెక్స్ రాకెట్.. మధ్యప్రదేశ్ స్కాండల్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలుఅధికారం కోసం సెక్స్ రాకెట్.. మధ్యప్రదేశ్ స్కాండల్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

మొదట్లో నిరాశ పరిచినా.. ఇప్పుడు మాత్రం ఫుల్లు

మొదట్లో నిరాశ పరిచినా.. ఇప్పుడు మాత్రం ఫుల్లు

వర్షాకాలం మొదలు సరిగా వానలు పడక ఈసారి కొంత నిరాశకు గురి చేసింది. అయితే అనూహ్యంగా జులై చివరి వారం నుంచి ప్రారంభమైన వరద ఉధృతి ఇప్పటివరకు కంటిన్యూ అవుతూనే ఉంది. ఆ క్రమంలో కృష్ణా జలాలు దిగువకు విడుదల చేయాల్సిన పరిస్థితి వచ్చింది. 2009-10 సంవత్సరంలో శ్రీశైలానికి వచ్చిన మొత్తం వరద నీరు 1218.21 టీఎంసీలు కాగా.. ఈ సంవత్సరం అది 1270 టీఎంసీలుగా నమోదు కావడం విశేషం.

నాలుగోసారి రికార్డు క్రియేట్

నాలుగోసారి రికార్డు క్రియేట్

2005-06 సంవత్సరానికి 1832 టీఎంసీల వరద నీరు కృష్ణ చెంతకు చేరగా.. 2006-07లో 1746 టీఎంసీలు.. 2007-08లో 1695 టీఎంసీలు నమోదైంది. అంతటి స్థాయిలో ఇన్‌ఫ్లో శ్రీశైలం జలాశయానికి వచ్చిన సందర్భాలు అవి. అయితే ఈ ఏడు 1270 టీఎంసీలు రావడం నాలుగోసారి అంటున్నారు అధికారులు. ఆ మూడు సంవత్సరాల్లోనూ సెప్టెంబర్ ముగియడానికి ముందే 1400-1600 టీఎంసీల వరకు వరద వచ్చింది. తాజా నీటి సంవత్సరంలో సెప్టెంబరు 29 నాటికి 1270 టీఎంసీల వరద వచ్చినట్లుగా రికార్డుల్లో నమోదైంది.

హుజుర్‌నగర్‌లో బామ్మ పోటీ.. ఎమ్మెల్యే ఎన్నికలకు సై.. ఎందుకో తెలుసా?హుజుర్‌నగర్‌లో బామ్మ పోటీ.. ఎమ్మెల్యే ఎన్నికలకు సై.. ఎందుకో తెలుసా?

దిగువకు నీటి విడుదల

దిగువకు నీటి విడుదల

తుంగభద్ర నది నుంచి 5 వేల క్యూసెక్కుల మొదలు గరిష్టంగా 12 వేల క్యూసెక్కుల వరకు ప్రతి నిత్యం వరద నీరు వచ్చి చేరుతోంది. జూరాలకు కూడా లక్షకు పైగా క్యూసెక్కుల వరద నీరు వస్తుండటం విశేషం. అయితే ఎంత ఇన్‌ఫ్లో వస్తుందో అదే స్థాయిలో దిగువకు నీరు విడుదల చేస్తున్నారు అధికారులు. దాంతో నాగార్జున సాగర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఆ క్రమంలో రెండు క్రస్టు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

English summary
Flood Water Increases to Krishna River as record level. This is the fourth time huge level flood water came into krishna river as 1270 tmc.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X