విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కోటిన్నర కొల్లగొట్టిన కేటుగాళ్లు..! బెడిసికొట్టిన డెకాయిట్ ఆపరేషన్

|
Google Oneindia TeluguNews

విజయవాడ : టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల పేరుతో వ్యాపారికి కుచ్చుటోపి పెట్టారు కేటుగాళ్లు. కోటి 66 లక్షల రూపాయలు కొల్లగొట్టారు. ప్లాన్ బెడిసి కొట్టడంతో నిందితులు పోలీసులకు చిక్కారు. అయితే ఇదంతా కూడా హవాలా సొమ్ముగా భావిస్తున్నారు పోలీసులు. ఈ కేసులో ఐదుగుర్ని అరెస్ట్ చేసి కోటి 26 లక్షల రూపాయలు రికవరీ చేశారు.

ఈ నగదు హైదరాబాద్ వ్యాపారి అభినవ్ రెడ్డికి చెందినదిగా గుర్తించారు. ఆయన దగ్గర పనిచేసే నాగరాజు.. వివిధ ప్రాంతాల నుంచి డబ్బు వసూలు చేసి అభినవ్ రెడ్డికి అందించేవాడు. ఆ క్రమంలో తన మిత్రుడు నానితో కలిసి విజయవాడలో ఇంత పెద్ద మొత్తం వసూలు చేశాడు నాగరాజు. అయితే దుర్బుద్ధి పుట్టిన నాని డెకాయిటీ ఆపరేషన్ కు తెర లేపాడు. కొందరు స్నేహితులతో కలిసి ఆ సొమ్ము దోచుకునేందుకు ప్లాన్ చేశాడు. లెక్కల్లో లేని డబ్బే కాబట్టి అభినవ్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడనేది నాని ప్లాన్. ఆ మేరకు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తమను అడ్డగించి నగదు పట్టుకెళ్లారని కథ అల్లాడు. అయితే హోటల్ రూమ్ లో ఉన్న మరో 40 లక్షలను ఇద్దరం పంచుకుందామంటూ నాగరాజును ఒప్పించడంతో సరేనన్నాడు.

 huge money caught in vijayawada as hot topic in election time

12న లీవ్ పెడితే 4 రోజులు బంద్..! లీడర్లకు సెలవుల భయం12న లీవ్ పెడితే 4 రోజులు బంద్..! లీడర్లకు సెలవుల భయం

వ్యాపారి అభినవ్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ డబ్బుకు సంబంధించి అభినవ్ రెడ్డి పొంతన లేని వివరాలు చెప్పాడట. దాంతో ఈ డబ్బుకు లెక్క లేదని గుర్తించారు. ఐటీ, ఈడీ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. విచారణలో అసలు విషయం తేలుతుందని చెబుతున్నారు. ఇది మనీలాండరింగా, లేక హవాలా సొమ్మా అనే విషయం ఇప్పుడే చెప్పలేమన్నారు. మరోవైపు ఎన్నికల వేళ ఇంత పెద్ద మొత్తంలో నగదు పట్టుబడటం చర్చానీయాంశమైంది.

English summary
Huge Money Caught In Vijayawada during election time is going hot topic. Some persons planned for decoity as cheating his owner. Five persons were arrested and Rs one crore 26 lakh was recovered.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X