• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

రౌడీలకే రౌడీని, బట్టలిప్పడం ఖాయం -విజయవాడలో చంద్రబాబు నిప్పులు -పెద్దిరెడ్డి, కొడాలి నానికి వార్నింగ్

|

ఆంధ్రప్రదేశ్ రాజకీయ రాజధాని విజయవాడలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చండ్రనిప్పులు కురిపించారు. అధికార వైసీపీపై కనీవినీ ఎరుగని రీతిలో విరుచుకుపడ్డారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం విజయవాడలో పర్యటిస్తోన్న ఆయన.. దుర్గమ్మ సాక్షిగా తాను రౌడీలకే రౌడీనని, వైసీపీ గుండాల గుండెల్లో నిద్రపోతానంటూ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నానిలకు వార్నింగ్ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే..

viral video: జగన్ సీటుకు ఎసరు -సాయిరెడ్డి పెద్ద బేకార్ -ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సంచలనం

ఎక్కడ తగ్గాలో తెలిసినోడే..

ఎక్కడ తగ్గాలో తెలిసినోడే..

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆదివారం విజయవాడ నగరంలో పర్యటించారు. పలు డివిజన్లను కవర్ చేస్తూ రోడ్ షో చేపట్టిన ఆయన.. ప్రధాన కూడళ్లలో ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడారు. అదే సమయంలో వర్గపోరాటాలు చేసుకుంటోన్న సొంత నేతలకూ బాబు క్లాస్ పీకారు. రోడ్ షో ఆసాంతం ముఖ్య నేతలే ముందు వరుసలో ఉండరాదని, ఆయా వార్డుల్లో పార్టీ అభ్యర్థులను ముందుంచి ప్రచారం నిర్వహించాలని సూచించారు. ‘ఎక్కడ తగ్గాలో, ఎక్కడ ముందుండాలో నాయకులు తెలుసుకోవాలి. అభ్యర్థుల్ని ప్రజలకు పరిచయం చేస్తూ, వారిని ముందుంచడం వల్ల నాలుగైదు ఓట్లు ఎక్కువ వస్తాయని టీడీపీ నేతలకు చంద్రబాబు సూచించారు. ఇక వైసీపీపై విమర్శల పర్వంలో..

రౌడీలకే రౌడీని నేను..

రౌడీలకే రౌడీని నేను..

విజయవాడ కార్పొరేషన్ పరిధిలో ఎన్నికల ప్రచారం సందర్బంగా కృష్ణా జిల్లా ఇంచార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై టీడీపీ చీఫ్ చంద్రబాబు నిప్పులు చెరిగారు. పనికిమాలిన మంత్రి అంటూ పెద్దిరెడ్డిపై ఫైరయ్యారు. ‘‘రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి ఈ(కృష్ణా)జిల్లాకు ఇన్‌చార్జ్ కూడా. తాను పెద్ద రౌడీ అనుకుంటున్నాడు. నిజం చెప్పాలంటే రౌడీలకు రౌడీని నేను. వైసీపీ గుండాల గుండెల్లో నిద్రపోతా.. ప్రజలు తిరగబడితే ఈ రౌడీలు పారిపోవడం ఖాయం. బట్టలిప్పించడం ఖాయం... జాగ్రత్త. సిగ్గు.. ఎగ్గు, మానం ఏమీ లేవు. అన్నిటినీ వదిలేశారు. దౌర్జన్యాలు చేసి గెలవాలనుకుంటున్నారు. అసలే ప్రతిపక్షం లేకపోతే... అడిగేవాడు లేకపోతే.. ఎలా? అటు విశాఖపట్నానికి విజయసాయి రెడ్డి శనిలా పట్టాడు'' అంటూ చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు..

viral video: బాలుణ్ని మింగిన భారీ మొసలి -దాన్ని బంధించి, పొట్ట చీల్చి చూడగా...

బూతుల మంత్రికి సీఎం ఆశిస్సులు

బూతుల మంత్రికి సీఎం ఆశిస్సులు

బెజవాడ సాక్షిగా టీడీపీ అధినేత చంద్రబాబు గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో వైసీపీ మంత్రులపై వరుచుకుపడ్డారు. రౌడీలకే రౌడీని అంటూ మంత్రి పెద్దిరెడ్డికి వార్నింగ్ ఇవ్వడానికి కొద్ది నిమిషాల ముందు.. కృష్ణా జిల్లాకే చెందిన కీలక మంత్రి కొడాలి నానిపైనా బాబు నిప్పులు చెరిగారు. ‘‘ఒకడు బూతుల మంత్రి... నోరు పారేసుకుంటాడు.. పేకాట ఆడిస్తాడు. ఆడితే తప్పేముంది అంటాడు. ఘోరమైన నేరాలు చేసి ఎంత సింపుల్ గా సమాధానం చెబుతాడో. సమాధానం. అలాంటి వ్యక్తి నేరుగా తాడేపల్లిలో సీఎం దగ్గరకు వెళ్లి, దర్జాగా బయటకు వస్తాడు. అంటే తన దొంగ పనులకు సీఎం ఆశీస్సులు తీసుకున్నట్టా?'' అంటూ కొడాలిని ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇక,

గెలవకుంటే తలెత్తుకు తిరగలేం..

గెలవకుంటే తలెత్తుకు తిరగలేం..

ఇప్పటికే పంచాయితీ ఎన్నికల్లో దారుణంగా దెబ్బతిన్న టీడీపీ.. ఈనెల 10న జరుగనున్న మున్సిపల్ ఎన్నికల్లోనైనా గెలిచి, పరువు కాపాడుకోవాల్సిన పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు విజయవాడ పర్యటన కీలకంగా మారింది. ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ మేయర్ పదవిని సాధించాలని, లేదంటే విజయవాడ జనం తలెత్తుకు తిరగలేరని చంద్రబాబు అన్నారు. నేరస్థుల అడ్డాగా ఆంధ్రాను తయారు చేస్తున్నారని వైసీపీపై ఫైరయ్యారు. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీ మెడలు వంచుతానన్న జగన్ ప్రజల్ని దారుణంగా మోసం చేశాడని, టీడీపీ హయాంలోనే ఎన్నో మంచి పథకాలను అన్యాయంగా ఆపేసి, పేదల ఉసురు పోసుకుంటున్నారని విమర్శించారు. ఇదిలా ఉంటే..

అమరావతి ఆంధ్రుల హక్కు..

అమరావతి ఆంధ్రుల హక్కు..

బెజవాడ పర్యటనలో భాగంగా టీడీపీ చీఫ్ చంద్రబాబు మరోసారి రాజధాని అంశాన్ని లేవనెత్తారు. రెండ్రోజుల కిందట విశాఖ పర్యటనకు వెళ్లిన ఆయనకు రాజధాని సెగ తగిలిన సంగతి తెలిసిందే. విశాఖలో నిరసనకారులపై మౌనం వహించిన బాబు.. ఇవాళ విజయవాడలో మాట్లాడుతూ అమరావతి రాజధాని తన కోసం కాదని, యావన్మంది ప్రజల కోసమేనని చెప్పారు. అమరావతి రాజధాని కోసం రైతులు భూములిచ్చారని గుర్తుచేసిన ఆయన.. విశాఖ ఉక్కు తరహాలో ‘‘అమరావతి ఆంధ్రుల హక్కు''పై ప్రజలందరూ పోరాడాలని పిలుపునిచ్చారు. అమరావతి కోసం ఇంటికొక్కరు బయటకు రావాలని చెప్పారు. వైసీపీ దౌర్జన్యాలను అడ్డుకోవాలంటే టీడీపీ గెలిచితీరాలని చంద్రబాబు అన్నారు.

English summary
The former chief minister of Andhra Pradesh and TDP national president Chandrababu Naidu called on everyone to fight against the government's decision of shifting the capital from Amaravati and termed that Amaravati is farmers pride. He toured Vijayawada 41st division as part of the municipal election campaign. He said that one from each home in Vijayawada should come forward for protecting Amaravati as capital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X