విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రమేష్ ఆస్పత్రిపై చర్యలు వద్దంటూ జగన్ సర్కార్‌పై ఒత్తిళ్లు-విచారణ పూర్తి కాకముందే...

|
Google Oneindia TeluguNews

కోవిడ్ కేర్ సెంటర్ నిర్వహణలో నిర్లక్ష్యంతో పది మంది రోగులు ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన రమేష్ ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకునే విషయంలో జగన్ సర్కార్ దూకుడుగా ముందుకెళుతోంది. ఈ ఘటనలో బాధ్యులని తేలితే రమేష్ ఆస్పత్రిని సీజ్‌ చేసేందుకు సైతం వెనుకాడబోమని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ ఆస్పత్రి యాజమాని రమేష్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు కావడం వల్ల విపక్ష నేత చంద్రబాబు దీనిపై స్పందించడం లేదని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో తీవ్ర చర్యలు తప్పవనే అంచనాకు వచ్చేసిన యజమాని రమేష్ బాబు పరారయ్యారు.

దర్యాప్తు ముమ్మరం...

దర్యాప్తు ముమ్మరం...


గత ఆదివారం ఉదయం విజయవాడ స్వర్ణప్యాలెస్ హోటల్లో జరిగిన అగ్నిప్రమాదంలో అక్కడ కోవిడ్ కేర్ సెంటర్లో చికిత్స పొందుతున్న పది మంది రోగులు చనిపోయారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం విచారణ కోసం రెండు వేర్వేరు కమిటీలు నియమించింది. పోలీసులు కూడా విడిగా విచారణ జరుపుతున్నారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు ఇప్పటికే రమేష్ ఆస్పత్రికి చెందిన ముగ్గురు ఉద్యోగులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. ఆస్పత్రి యజమాని రమేష్ బాబును సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆయన పరారైనట్లు గుర్తించారు. దీంతో ఆయన కోసం 8 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఏ క్షణాన్నైనా ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశముంది. ఆయన దొరికినా, దొరక్కపోయినా ఆస్పత్రిని సీజ్‌ చేసేందుకు సైతం ప్రభుత్వం సిద్ధమవుతోందన్న సంకేతాలున్నాయి.

వరుస హెచ్చరికలతో ఒత్తిడి...

వరుస హెచ్చరికలతో ఒత్తిడి...

స్వర్ణప్యాలెస్ లో అగ్నిప్రమాదం జరగ్గానే మంత్రులు, వైసీపీ నేతలు ఈ ఘటనలో తమ తప్పులేదని చెప్పుకునేందుకు హడావిడిగా తీవ్ర ప్రకటనలు చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని, తప్పుందనే తేలితే ఆస్పత్రి సీజ్ చేస్తామని ఆరోగ్యమంత్రి ఆళ్లనాని హెచ్చరించారు. ఆ తర్వాత వైసీపీ నేత శ్రీకాంత్‌రెడ్డి కమ్మ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ నేతృత్వంలో నడుస్తున్న ఆస్పత్రి కాబట్టి ఈ ఘటనపై చంద్రబాబు నోరు మెదపడం లేదన్నారు. దీంతో సహజంగానే ప్రభుత్వం తమను టార్గెట్ చేసిందనే అంచనాకు రమేష్ ఆస్పత్రి యాజమాన్యం వచ్చేసింది. అదే సమయంలో ఆస్పత్రికి చెందిన ముగ్గురు ఉద్యోగులను అరెస్టు చేయడంతో ఇక తన అరెస్టు తప్పదని తేలిసి ఛైర్మన్ రమేష్ బాబు పరారయ్యారు.

డాక్టర్ల సంఘాలతో ప్రభుత్వంపై ఒత్తిడి...

డాక్టర్ల సంఘాలతో ప్రభుత్వంపై ఒత్తిడి...

ప్రస్తుతం విజయవాడ పోలీసుల ప్రకటన ప్రకారం పరారీలో ఉన్న డాక్టర్ రమేష్ బాబు తమపై ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా తెరవెనుక డాక్టర్ల సంఘాలతో ఒత్తిడి చేయిస్తున్నారు. ప్రభుత్వం నియమించిన కమిటీల విచారణ నివేదిక రాకముందే ఆయనపై చర్యలు వద్దంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌తో పాటు కార్డియాలజీ సొసైటీ ప్రభుత్వానికి వేర్వేరు లేఖలు రాశాయి. అగ్నిప్రమాదంలో రమేష్ ఆస్పత్రి తప్పులేదని, స్వర్ణప్యాలెస్ నిర్వహణ బాధ్యత ఆస్పత్రికి కాదని డాక్టర్ల సంఘాలు ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాయి. అలాగే మీరు అనుమతిచ్చిన తర్వాతే స్వర్ణప్యాలెస్‌లో కోవిడ్‌ కేర్ సెంటర్ నిర్వహిస్తున్నారని చెబుతున్నాయి. అక్కడ పరిస్ధితులు తెలియకుండానే వైద్యారోగ్యశాఖ రమేష్ ఆస్పత్రికి అనుమతిచ్చిందని భావించడం లేదన్నారు. ఈ విషయంలో డాక్టర్లను దోషులుగా చూడొద్దంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. తద్వారా ఈ ఘటనకు రమేష్ ఆస్పత్రి బాధ్యత ఎంతుందో దానికి అనుమతిచ్చిన ప్రభుత్వ బాధ్యత కూడా అంతే ఉందని డాక్టర్ల సంఘాలు గుర్తు చేస్తున్నాయి.

Recommended Video

AP 3 Capitals : అమరావతి ముహుర్తానికే ప్రధాని మోదీ చేతుల మీదుగా విశాఖలో శంకుస్థాపన..! || Oneindia
 జగన్‌ కు కఠిన పరీక్ష...

జగన్‌ కు కఠిన పరీక్ష...


రాష్ట్రంలో వరుస ప్రమాదాలపై సీరియస్‌గా ఉన్న ప్రభుత్వం ఏ ఘటనలోనూ బాధ్యులను వదలొద్దనే స్పష్టమైన సంకేతాలు ఇవ్వాలని భావిస్తోఁది. కాస్త ఆలస్యమైనా ఎల్జీ పాలిమర్స్ ఘటనలో 12 మందిని అరెస్టు చేయడమే ఇందుకు నిదర్శనమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో రమేష్ ఆస్పత్రి అగ్నిప్రమాదం విషయంలోనూ ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. కానీ డాక్టర్ల సంఘాలు, కోర్టుల జోక్యంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని చూస్తే మాత్రం వీటికి లొంగే ప్రశ్నే లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ వ్యవహారంలో కులంకోణం, వైద్యుల వ్యవహారంతో పాటు ఇతర అంశాలు మిళితమైనందున సీఎం జగన్ విచారణ కమిటీల నివేదిక తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.

English summary
indian medical association and cardiology society wrote two separate letters to andhra pradesh government against any action on ramesh hospital management in fire accident issue. the reports of two inquiry committees appointed by the government are yet to come.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X