విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మళ్ళీ లాక్ డౌన్ చేస్తే ప్రభుత్వాలు చారిత్రక తప్పిదం చేసినట్టే : జనసేన నేత నాగబాబు

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని మాత్రమే కాదు ఇండియాను ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను వణికిస్తుంది. విపరీతంగా కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రభుత్వాలు మరోమారు లాక్ డౌన్ ఆలోచన చేస్తున్నట్టు బయటకు ఫీలర్స్ వస్తున్నాయని పేర్కొన్న నాగబాబు తన అభిప్రాయం వ్యక్తం చేశారు . ఇప్పుడు మరికొన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధించే అవకాశం ఉందనే వార్తలపై స్పందించిన జనసేన నాయకుడు, టాలీవుడ్ నటుడు నాగబాబు మరోసారి లాక్‌డౌన్ ప్రకటించినట్లయితే ఇది చారిత్రక తప్పిదమని అన్నారు.

చైనా వస్తువుల్ని, యాప్స్ ని బ్యాన్ చేద్దామన్న నాగబాబు..కొందరు నెటిజన్ల చురకలు చైనా వస్తువుల్ని, యాప్స్ ని బ్యాన్ చేద్దామన్న నాగబాబు..కొందరు నెటిజన్ల చురకలు

లాక్ డౌన్ ప్రకటించే చర్యను ఉపసంహరించుకోవాలి

లాక్ డౌన్ ప్రకటించే చర్యను ఉపసంహరించుకోవాలి

కరోనావైరస్ వ్యాప్తిని ఆపడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60 నుండి 90 రోజుల వరకు లాక్డౌన్ విధించాయని ఆయన పేర్కొన్నారు. లాక్డౌన్ కాలంలో వైరస్ సోకిన రోగులకు చికిత్స అందించడానికి ప్రభుత్వాలు మెరుగైన ఆరోగ్య మౌలిక సదుపాయాలను, నియంత్రణకు మార్గాలు అన్వేషించాలి అని ఆయన చెప్పారు. లాక్ డౌన్ ను మళ్ళీ ప్రకటించే చర్యను ఉపసంహరించుకోవాలని నాగబాబు విజ్ఞప్తి చేశారు.

మళ్ళీ లాక్ డౌన్ చేయడం ఖచ్చితంగా తప్పే, 100% కరెక్ట్ కాదు

మళ్ళీ లాక్ డౌన్ చేయడం ఖచ్చితంగా తప్పే, 100% కరెక్ట్ కాదు

లాక్ డౌన్ విధించిన ఆవశ్యకతను ఉద్దేశించి మాట్లాడిన నాగబాబు లాక్ డౌన్ కరోనా వ్యాప్తిని నియంత్రించడానికి, అలాగే కావలసిన వైద్య వనరులు సమకూర్చుకోవడానికి అని పేర్కొన్నారు. 60 నుంచి 90 రోజులపాటు విధించిన లాక్ డౌన్ లో ప్రభుత్వం కావాల్సిన వనరులు సమకూర్చుకొని, ఇప్పుడు ప్రజలకు ఆరోగ్య రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని, అలా కాకుండా మరోమారు లాక్ డౌన్ చేయడం అంటే ఖచ్చితంగా తప్పేనని, 100% అది కరెక్ట్ కాదని నాగబాబు తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

జనజీవనం స్తంభింపజేయటం దారుణం

జనజీవనం స్తంభింపజేయటం దారుణం

మళ్ళీ లాక్ డౌన్ నిర్ణయం తీసుకుంటే ప్రజలలో ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందని, అది ఏమాత్రం సమంజసం కాదని నాగబాబుపేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరు ఈ నిర్ణయం తీసుకున్నా తప్పేనని నాగబాబు అన్నారు.జనజీవనాన్నిస్తంభింపజేయడం దారుణమని నాగబాబు వ్యాఖ్యానించారు.లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ,ఇప్పుడు మరోమారు లాక్ డౌన్ విధించి ప్రజలను ఇబ్బందులకు గురి చేయవద్దని నాగబాబు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.

సామాన్య ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ..లాక్ డౌన్ వద్దు

సామాన్య ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ..లాక్ డౌన్ వద్దు

90 రోజులపాటు ప్రజలు ప్రభుత్వానికి సహకరించి లాక్ డౌన్ ను పాటించారని,సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్న నాగబాబు ప్రజలకు అనారోగ్యం ఉంటె ఇళ్లకే వెళ్ళి మరీ టెస్టులు చెయ్యాలని పేర్కొన్నారు. ఇప్పుడు మరోమారు లాక్ డౌన్ ను అమలు చేయాలనే ఆలోచన చేస్తే అది చాలా పెద్ద తప్పు అవుతుందని జనసేన నేత నాగబాబు అంటున్నారు. ప్రజలు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి,ఇప్పుడు ప్రజల ఆరోగ్య రక్షణ కల్పిస్తూ ప్రభుత్వాలు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి తప్ప లాక్ డౌన్ విధించకూడదు అంటూ పేర్కొన్నారు.

English summary
Responding to the news that a lockdown is likely to be imposed in some more states, Jana Sena leader and Tollywood actor Naga Babu said it would be a historical mistake if lockdown was declared once again. He stated that the Central and state governments have imposed lockdown from 60 to 90 days to stop the spread of coronavirus. “The governments should have improved health infrastructure for providing treatment to virus-infected patients during the lockdown period,” he stated. Naga Babu made an appeal to withdraw the move to declare lockdown again.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X