విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్ ... మన పాలన మీ సూచన కార్యక్రమంలో ప్రకటన

|
Google Oneindia TeluguNews

ఒకటి కాదు రెండు కాదు ఏపీలో రైతు సంక్షేమం కోసం సీఎం తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు అన్నీ ఇన్నీ కావు . ఇప్పటికే రైతు భరోసా అందించి ఆదుకుంటున్న ఏపీ ప్రభుత్వం తాజాగా రైతులకు మేలు చేసేలా ఖరీఫ్ సీజన్ లో విత్తన కష్టాలు లేకుండా విత్తన సరఫరా చేస్తుంది. ఇక అంతేకాదు తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్న సీఎం జగన్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. వైసీపీ ఏడాది పాలన సందర్భంగా నిర్వహిస్తున్న మన పాలన మీ సూచన కార్యక్రమంలో ఆయన ఈ ప్రకటన చేశారు .

Recommended Video

YSR Rythu Bharosa : Another Good News For AP Farmers,Govt Will Dig Borewells For Farming

 ఏపీలో ఇంగ్లీష్ మీడియంపై పట్టువీడని ప్రభుత్వం- మరో కీలక నిర్ణయం... ఏపీలో ఇంగ్లీష్ మీడియంపై పట్టువీడని ప్రభుత్వం- మరో కీలక నిర్ణయం...

 ప్రభుత్వ ఖర్చుతో పొలాల్లో బోర్లు వేస్తామని సీఎం జగన్ ప్రకటన

ప్రభుత్వ ఖర్చుతో పొలాల్లో బోర్లు వేస్తామని సీఎం జగన్ ప్రకటన

మొన్నటికి మొన్న విత్తనాల పేరుతో రైతులు మోసపోకుండా ప్రభుత్వమే విత్తన సరఫరా చెయ్యటం రైతులకు సంతోషం కలిగిస్తే ఇక తాజాగా ప్రభుత్వమే పొలాల్లో బోర్లు వేస్తుందని చేసిన ప్రకటన రైతన్నల్లో సంతోషానికి కారణం అవుతుంది . ఇక వైసీపీ ఏడాది పాలన సందర్భంగా నిర్వహిస్తున్న సదస్సుల్లో ఇవ్వాళ వ్యవసాయ అనుబంధ రంగాల సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏపీ సీఎం జగన్ మాట్లాడుతూ ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ సర్కార్ రైతు సంక్షేమానికి పని చేస్తుందని , రైతులు, రైతు కూలీలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని పేర్కొన్నారు .

 రైతు సంక్షేమానికే కట్టుబడి ఉన్నామన్న సీఎం జగన్

రైతు సంక్షేమానికే కట్టుబడి ఉన్నామన్న సీఎం జగన్

రైతులకు చెప్పిన దానికంటే ఎక్కువే ఇచ్చామన్నారు. రైతు సంక్షేమానికి కట్టుబడిన ప్రభుత్వం తమదని స్పష్టం చేశారు . ఇక రాష్ట్రంలో 50 శాతం మంది రైతులకు 1.25 ఎకరాల్లోపే భూమి ఉంది. వారందరికీ అండగా ఉండేందుకు రైతు భరోసా కింద రూ.13,500 ఇస్తున్నామని ఇక ఆ నగదును నేరుగా రైతుల అకౌంట్లలోనే డబ్బు జమచేశామని ఆయన పేర్కొన్నారు .కేవలం రైతుల కోసమే వైఎస్‌ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని తీసుకొచ్చామని ఆయన అన్నారు. వడ్డీ కోసం రూ.2 వేల కోట్లను ఏపీ ప్రభుత్వమే కడుతుందన్నారు. ఈ సందర్భంగా రైతులకు మరో గుడ్‌న్యూస్ కూడా చెప్పారు సీఎం జగన్.

నీటి వసతి లేని పొలాల్లో తామే బోర్లు వేయిస్తామని మరో నిర్ణయం

నీటి వసతి లేని పొలాల్లో తామే బోర్లు వేయిస్తామని మరో నిర్ణయం

సాగునీటి అవసరాలను తీర్చటానికి ఇప్పటికే ప్రాజెక్ట్ ల నిర్మాణానికి కృషి చేస్తున్న సీఎం జగన్ ఈ ఖరీఫ్ నుంచి రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తామని ప్రకటించారు . గత రబీలోనే 46.69 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరిందన్న ఆయన మొదటి ఏడాదిలోనే ఇప్పటి వరకు రూ.6,534 కోట్లను ఇచ్చామన్నారు . ఈ నెలలోనే 7,800 చొప్పున రూ.3,675 కోట్లను రైతులకు ఇచ్చామన్నారు సీఎం జగన్. ఇక నీటి వసతి లేని పొలాల్లో తామే బోర్లు వేయిస్తామని చెప్పి చల్లటి కబురు చెప్పారు.

English summary
Farmers are happy that the government is supplying the seed and now m jagan announced the borewells digging on the farms is a cause for happiness for the farmers. During the YCP administration, the agriculture affiliate seminar is being held.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X