• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

రాజకీయాలకు ఇంటర్వల్..! ఫాన్స్ కోరిక మేరకు సినిమాలల్లో నటించనున్న గబ్బర్ సింగ్..?

|

అమరావతి/హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాలపట్ల ఎలా ఆలోచిస్తున్నారు.? రానున్న రోజుల్లో తన వైఖరి ఎలా ఉండబోతుంది..? ఏపి రాజకీయాలను పూర్తి స్థాయిలో నెరవుతారా లేక పార్ట్ టైమర్ గా రాజకీయాలు చేస్తారా అనే అంశం జనసేన పార్టీలో వేడి రగిలిస్తోంది. వెనక్కి తగ్గేది లేదు., తన చివరి శ్వాస వరకూ ప్రజల పక్షాన పోరడతానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించినప్పటికి ప్రజా సమస్యలపై పోరడుతూనే భవిష్యత్ కార్యాచరణపై లోతైన సమాలోచన జరుతున్నారు గబ్బర్ సింగ్. ప్రజా సమస్యలను విడిచి పెట్టకుండా, ప్రజలకు అందుబాటులో ఉంటూనే, అభిమానుల కోరిక మేరకు సినిమాల్లో నటిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో కాటమరాయుడు ఉన్నట్టు తెలుస్తోంది.

సినీ పరిశ్రమలో పవన్ ది పెద్ద మార్కెట్..! సినిమాలు చేయాలంటున్న ఫాన్స్..!!

సినీ పరిశ్రమలో పవన్ ది పెద్ద మార్కెట్..! సినిమాలు చేయాలంటున్న ఫాన్స్..!!

పవన్ కళ్యాణ్ సినిమాలంటే తెలుగు రాష్ట్రాల్లో చెప్పలేని ప్రజాదరణ ఉంటుంది. చిన్న పిల్లలనుండి పెద్దల వరకూ పవన్ కళ్యాణ్ సినిమాలకు ఫిదా అవుతుంటారు. పవన్ కళ్యాణ్ ఒక సినిమా హిట్ అయితే మార్కెట్ లో రెండు మూడు సంవత్సరాలు తిరుగుండదు. వచ్చే ఎన్నికలకు ఎలాగూ నాలుగేళ్లకు పైనే సమయం ఉండడంతో సినిమాలు చేసుకుంటే శ్రేయస్కరంగా ఉంటుందనేది జనసైనికుడి ఆలోచనగా తెలుస్తోంది. అంతే కాకుండా పవన్ సినిమా అంటే నటులు కాకుండా దాదాపు 500మందికి ఏడాది పాటు జీవనోపాది ఉంటుందనేది పరిశ్రమలో చెప్పుకునే మాట. ఏడాదికా ఒక సినిమా చొప్పున మూడేళ్లు మూడు సినిమాలు ఒప్పుకున్నా వేల కోట్లలో వ్యాపారం ఉంటుందనేది కూడా సిని పరిశ్రమ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. దీంతో ప్రజా సమస్యలనై స్పందిస్తూనే వచ్చే ఎన్నికలలోపు మూడు లేదా నాలుగు సినిమాలు చేయాలనేది జనసైనికుడి మనసులోని మాటగా తెలుస్తోంది.

ఎదురు చూస్తున్న ప్రశ్నలు..! సప్త సముద్రాలు దాటి ఎప్పుడొస్తావు పవన్..?

ప్రజా సమస్యలపై స్పందిస్తూనే సినిమాలు చేయాలి..! జనసైనికుల ఆకాంక్ష..!!

ప్రజా సమస్యలపై స్పందిస్తూనే సినిమాలు చేయాలి..! జనసైనికుల ఆకాంక్ష..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ పొజిషన్లో కెరియర్ వున్న సమయంలో ప్రజల కోసం మరియు ప్రశ్నించడం కోసం రాజకీయాల్లోకి వచ్చాను అంటూ జనసేన పార్టీని 2014 ఎన్నికల సమయంలో స్థాపించి ఆ సమయంలో చంద్రబాబు కి మద్దతు తెలిపి టిడిపి అధికారంలోకి రావటం లో కీలక పాత్ర పోషించారు పవన్ కళ్యాణ్. ఇదిలా ఉండగా తర్వాత జరిగిన 2019 ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ పార్టీ ఘోరంగా ఓడిపోవడం టాలీవుడ్ ఇండస్ట్రీలో మరియు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. కేవలం ఒకే ఒక స్థానాన్ని గెలుచుకుంది పవన్ కళ్యాణ్ పార్టీ. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 2 చోట్ల కూడా ఓడిపోవడంతో శ్రేణులు కొంత అసంతృప్తికి లోనయ్యారు.

అటు రాజకీయాలు..ఇటు సినిమాలు..! సమన్వయం చేసుకోవాలంటున్న కార్యకర్తలు..!!

అటు రాజకీయాలు..ఇటు సినిమాలు..! సమన్వయం చేసుకోవాలంటున్న కార్యకర్తలు..!!

ఎన్నో అంచనాలు పెట్టుకున్న జనసేన పార్టీ 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడంతో పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తే బెటర్ అంటూ ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఇప్పటికిప్పుడు సినిమా చేస్తాను అంటే చాలా మంది నిర్మాతలు క్యూ కడతారని...పవన్ ఎంత ఆఫర్ చేస్తే అంత ఇవ్వటానికి చాలామంది ఇండస్ట్రీలో ఉన్న నిర్మాతలు రెడీగా ఉన్నారని ఫిలింనగర్ టాక్. మరోపక్క పవన్ కళ్యాణ్ సినిమాలు చేయాలని చాలామంది అభిమానులు ప్రస్తుతం కోరుకుంటున్నారు.

అమెరికా నుండి వచ్చాకే నిర్ణయం..! కీలక ప్రకటన చేయనున్న గబ్బర్ సింగ్..!!

అమెరికా నుండి వచ్చాకే నిర్ణయం..! కీలక ప్రకటన చేయనున్న గబ్బర్ సింగ్..!!

జనసేన పార్టీని ఆర్థికంగా ముందుకు నడిపించాలంటే పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రావాలని చాలామంది ఇండస్ట్రీకి చెందిన వారు కూడా అంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం సినిమాలు చేయటం ఇంకా కుదరదని ఒక్కసారి మాట తీసుకుంటే వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఉన్న జీవితం ప్రజా పోరాటం కోసమే ఉందని...కట్టే కాలే వరకు..జనసేన పార్టీ కి ప్రాతినిధ్యం వహిస్తాను అంటూ చెప్పటం జరిగింది. మరోపక్క అభిమానులు మాత్రం పవన్కళ్యాణ్ సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు. ఇటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్ అభిమానుల కోరిక తీరుస్తారో లేదో చూడాలి.

English summary
Gabbar Singh is in the process of taking a deeper look into the future of the AP as it struggles on public issues. Pavan seems to have been thinking about how to act in films without giving up on public issues and making them available.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X