విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు సన్నిహితులే లక్ష్యంగా ఐటీ దాడులు: డాక్యుమెంట్లు, భారీగా గోల్డ్, రూ. 100వందకోట్లకుపైగా సీజ్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో ఐటీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సన్నిహితులే లక్ష్యంగా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. చంద్రబాబుకు గతంలో వ్యక్తిగత కార్యదర్శిగా వ్యవహరించిన శ్రీనివాస్ తోపాటు పలువురి ఇళ్లపై ఐటీ సోదాలు ఏకకాలంలో జరుగుతుండటం చర్చనీయాంశంగా మారింది.

Recommended Video

Evening News Express : 3 Minutes 10 Headlines | Bodo Agreement | Coronavirus
చంద్రబాబు సన్నిహితులే..

చంద్రబాబు సన్నిహితులే..

చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్‌కు సన్నిహితులైన నరేష్ చౌదరి, కిలారి రాజేష్, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు ప్రత్తిపాటి శరత్, కడప టీడీపీ అధ్యక్షుడు రెడ్డప్పగారి శ్రీనివాస్ రెడ్డి ఇళ్లలో ఐటీ, ఈడీ, జీఎస్టీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేశారు. ఏపీతోపాటు తెలంగాణలోని నివాసాలు, కార్యాలయాల్లోనూ దాడులు కొనసాగించారు.

చంద్రబాబు మాజీ పీఎస్ నివాసాలు, కార్యాలయాల్లో.. రూ. 150కోట్లు..

చంద్రబాబు మాజీ పీఎస్ నివాసాలు, కార్యాలయాల్లో.. రూ. 150కోట్లు..

చంద్రబాబుకు గతంలో మాజీ పీఎస్‌గా పనిచేసిన శ్రీనివాస్‌కు చెందిన విజయవాడ, హైదరాబాద్‌లోని ఇళ్లలో గురువారం ఉదయం నుంచీ శుక్రవారం రాత్రి వరకు అధికారులు సోదాలు నిర్వహించారు. తమ వద్ద ఉన్న సమాచారంతో శ్రీనివాస్‌ను ప్రశ్నించినట్లు తెలిసింది. శ్రీనివాస్ 2019 ఎన్నికల వరకు చంద్రబాబుకు పీఎస్‌గా పనిచేశారు. ప్రస్తుతం జీఏడీలో విధులు నిర్వహిస్తున్నారు. గురువారం రూ. 150 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

కీలక డాక్యుమెంట్లు, భారీగా బంగారం.

కీలక డాక్యుమెంట్లు, భారీగా బంగారం.


కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ద్వారకానగర్‌లోని ఆయన నివాసంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 10 మంది ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో పలు కీలక పత్రాలు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.

కేంద్ర బలగాల సాయంతోనే..

కేంద్ర బలగాల సాయంతోనే..


ఆర్కే ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో శ్రీనివాసుల రెడ్డి చేసిన ఆర్థిక లావాదేవీలు, ఆదాయపుపన్ను చెల్లింపులు తదితర అంశాలపై అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది. కేంద్రస్థాయిలో వచ్చిన కీలక సమాచారం మేరకు ఈ సోదాలు చేస్తున్నట్లు అధికార వర్గాల తెలిసింది. హైదరాబాద్‌లోని శ్రీనివాసుల రెడ్డికి చెందిన నివాసం, కార్యాలయంలో కూడా ఐటీ దాడులు కొనసాగాయి. కేంద్ర పోలీసు బలగాల సాయంతోనే అధికారులు సోదాలు కొనసాగిస్తుండటం గమనార్హం. చంద్రబాబు సన్నిహితులే లక్ష్యంగా ఐటీ దాడులు జరగడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

English summary
IT raids on TDP chief Chandrababu's relatives and friends.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X