ap news ap assembly winter session tdp tdp mla suspension ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వైసీపీ టీడీపీ టీడీపీ ఎమ్మెల్యే చంద్రబాబు politics
టీడీపీ తీరుపై సీఎం జగన్ ఫైర్- తన ప్రసంగం ప్రజలకు చేరకుండా కుట్ర చేస్తోందంటూ...
ఏపీ అసెంబ్లీలో ఇవాళ కూడా గందరగోళం తప్పడం లేదు. కీలకమైన బిల్లులను ఎలాగైనా ఆమోదించుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను టీడీపీ అడ్డుకుంటోంది. రైతులకు పంట బీమా ప్రీమియం చెల్లించకుండా ప్రభుత్వం కుట్ర చేస్తోందంటూ టీడీపీ సభను అడ్డుకుంటోంది. దీంతో సీఎం జగన్ టీడీపీ తీరుపై ఇవాళ మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవాళ మత్స్యశాఖకు సంబంధించిన ఫిషరీస్ యూనివర్శిటీ, అక్వాకల్చర్ సీడ్ కంట్రోల్ బిల్లుతో పాటు మరో బిల్లును ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కానీ టీడీపీ ఆందోళనతో సభలో తీవ్ర గందరగోళం కొనసాగింది. దీంతో జోక్యం చేసుకున్న సీఎం జగన్ టీడీపీ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు.

విపక్ష నేత చంద్రబాబుతో పాటు ఇతర టీడీపీ సభ్యులు పదేపదే సభకు అంతరాయం కలిగించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై కనీస అవగహన లేని విధంగా ప్రతిపక్షం వ్యవహరిస్తోందని సభలో మండిపడ్డారు. కనీస అంశాలపై చర్చించకుండా అసలు అసెంబ్లీకి ఎందుకు వస్తున్నారో కూడా అర్థంకావడంలేదని అన్నారు. ఓవైపు సీఎం ప్రసంగం సాగుతున్నా.. అదిప్రజలకు చేరవద్దనే కట్రతో సభలో గందరగోళం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభలో ముఖ్యమంత్రి ప్రంగాన్ని అడ్డుకోవడం దారుణమన్నారు. అనవసరమైన అంశాలపై రాద్ధాంతం చేస్తున్నారని సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజలకు తాము ఇచ్చిన హామీలు కచ్చితంగా నెరవేరుస్తామని సీఎం జగన్ ఈ సందర్భంగా మరోసారి తెలిపారు. తాము రైతులకు ఇన్సూరెన్స్ ఎప్పుడు చెల్లిస్తే ప్రతిపక్షానికి ఎందుకని, తాము రైతులకు కచ్చితంగా మేలు చేసి తీరుతామని జగన్ చెప్పారు. రైతులకు నివర్ తుపాను కారణంగా కలిగిన నష్టానికి పరిహారాన్ని డిసెంబర్లో చెల్లిస్తామని మరోసారి హామీ ఇచ్చారు. డిసెంబర్ 15న రైతులకు రూ.1227 కోట్ల రూపాయలు కచ్చితంగా చెల్లిస్తామన్నారు.