• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

జగన్ అమ్మ ఒడి పథకం ఎఫెక్ట్ .. పిల్లల్ని ఎత్తుకెళ్ళి స్కూళ్ళలో పడేస్తున్న తల్లిదండ్రులు

|

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించటం కోసం టీచర్లు నానా పాట్లు పడే పరిస్థితి , పిల్లల్ని చదువు కోసం స్కూల్ కి పంపించటానికి తల్లిదండ్రులు నానా పాట్లు పడే స్థితి వచ్చింది . ఎత్తుకెళ్ళి మరీ స్కూల్ లో పడేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది . సీఎం జగన్ అందిస్తున్న అమ్మ ఒడి పథకం వల్ల తల్లిదండ్రుల చూపు సర్కారీ బడులలో స్ట్రెంత్ ను బాగా పెంచేసింది . ఏపీలోని స్కూల్స్ లో ఇప్పుడు విద్యార్థులతో కళకళలాడుతూ కనిపిస్తున్నాయి . ఏపీలో చాలా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు అడ్మిషన్లు ఫుల్ అని బోర్డ్ పెట్టేశారంటే సర్కారు స్కూళ్ళ జోష్ ఎలా ఉందో అర్ధం అవుతుంది.

కేశినేని, బుద్దాల ట్వీట్ వార్ పై వైసీపీ నేత పొట్లూరి ఘాటు వ్యాఖ్యలు

 అమ్మ ఒడి సక్సెస్ .. అందరూ బడిబాట

అమ్మ ఒడి సక్సెస్ .. అందరూ బడిబాట

ఏపిలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అమ్మ ఒడి కార్యక్రమాన్ని ప్రకటించడంతో ప్రభుత్వ పాఠశాలలకు భారీ డిమాండ్ పెరిగింది . నేను వెళ్ళను బడికి అన్న వాళ్ళంతా ఇప్పుడు ప్రభుత్వ పాఠశాల వైపు పరుగులు పెడుతున్నారు. నిన్నటి దాకా బడికి ఏం పంపుదాంలే అని భావించిన వారు ఇప్పుడు పిల్లలని నిర్బంధంగా స్కూల్స్ లో విడిచి పెట్టి వస్తున్నారు. మోడల్ పాఠశాలలు, మున్సిపల్, జెడ్‌పి మరియు ఎంపిపి పాఠశాలలతో సహా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్య ఈ ఏడాది గణనీయంగా పెరిగింది.

 ప్రభుత్వ పాఠశాలల్లో గణనీయంగా పెరిగిన ప్రవేశాలు

ప్రభుత్వ పాఠశాలల్లో గణనీయంగా పెరిగిన ప్రవేశాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరానికి మొత్తం 1,51,719 కొత్త ప్రవేశాలు జరిగాయని, వారిలో 42,893 మంది విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో ప్రవేశం పొందారని అధికారులు తెలిపారు. తెలుగు మీడియం ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశానికి మొత్తం 30,327 మంది విద్యార్థులు చేరినట్టు తెలుస్తుంది . ఈ గణాంకాలు తల్లిదండ్రులలో 'అమ్మ ఒడి' ఎలాంటి ప్రభావాన్ని చూపించిందో చెబుతుంది. అమ్మ ఒడి పథకం వల్లే స్కూల్ కు వెళ్ళని పిల్లలు , ఆసక్తి చూపించని తల్లిదండ్రులు కూడా ఇప్పుడు పిల్లలని బడికి పంపించటానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ స్కూల్స్ లో విద్యార్థుల చేరిక బాగా పెరిగింది.

15 వేల ఆర్ధిక సాయంతో చదువుపై ఆసక్తి ... ఎత్తుకెళ్ళి స్కూల్స్ లో కూర్చోబెడుతున్న తల్లిదండ్రులు

15 వేల ఆర్ధిక సాయంతో చదువుపై ఆసక్తి ... ఎత్తుకెళ్ళి స్కూల్స్ లో కూర్చోబెడుతున్న తల్లిదండ్రులు

ప్రస్తుతం ఏపీలో బడికి వెళ్ళని చిన్నారులను కాళ్ళు చేతులు పట్టుకుని ఎత్తుకెళ్ళి మరీ స్కూల్ లో కూర్చోబడుతున్నారు. ఇక దీనికి సంబంధించి ఒక వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. అమ్మ ఒడి పథకం వల్ల ఏపీ ప్రభుత్వ స్కూల్స్ లో విద్యార్థులు సంఖ్య గణనీయంగా పెరిగింది. .ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్నారులను అందరినీ చదివించటం కోసం జగన్ ప్రభుత్వం చేసిన ప్రధాన ప్రయత్నం అమ్మ ఒడి పథకం , ఇది పాఠశాలలలో తమ పిల్లలను చేర్చిన తల్లులందరికీ రూ .15 వేల ఆర్థిక సహాయం అందించే పథకం . ఇటీవల, ఇది అన్ని పాఠశాలలకు వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది మరియు ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా వర్తిస్తుందని తెలిపింది . ఇక ఆపై చదివే వారికి 20 వేల రూపాయలు అందించనున్నట్టు కూడా ఈ పథకాన్ని విస్తరించింది. ఇక పథకం నేపధ్యంలో ఇంతకాలం బడిబాట పట్టని పిల్లలు సైతం కచ్చితంగా బడిబాట పడుతున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
At present, children who do not go to school in AP are forcebully sending to the school. A video related to this has now gone viral. Amma Odi Scheme has significantly increased the number of students in AP government schools. The main effort of the Jagan government to educate all the children after coming to power in AAP is the Amma ODi scheme, which provides financial assistance of Rs 15,000 to all mothers who enroll their children in schools.The same applies to intermediate students. The scheme has also been extended to offer Rs 20,000 to those who is going to higher studies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more