విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జ‌గ‌న్ కేసు విచార‌ణ ఇక విజ‌య‌వాడ‌లోనే : కోర్టుకు అందిన అదేశాలు...!

|
Google Oneindia TeluguNews

వైసిపి అధినేత జ‌గ‌న్ కేసులో కీల‌క పరిణామం చోటు చేసుకుంది. ఇప్ప‌టికే జ‌గ‌న్ కేసు ఎన్ఐఏ కు అప్ప‌గించారు. ఈ కేసును ఎన్ఐఏ కు అప్ప‌గించ‌టం పై రాష్ట్ర ప్ర‌భుత్వం అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తోంది. ఇదే స‌మ‌యంలో.. జ‌గ‌న్ పై దాడి కేసును విజ‌య‌వాడ కు బ‌దిలీ చేస్తూ నిర్ణ‌యం జ‌రిగింది. ఈ మేర‌కు కోర్టు ఉత్త‌ర్వులు జారీ చేసింది..

ఏపి ఉద్యోగుల‌కు సెల‌వుల పండుగ‌ : రెండు స్పెష‌ల్ సీఎల్ ల మంజూరు. ఏపి ఉద్యోగుల‌కు సెల‌వుల పండుగ‌ : రెండు స్పెష‌ల్ సీఎల్ ల మంజూరు.

జ‌గ‌న్ కేసు పై విచార‌ణ

జ‌గ‌న్ కేసు పై విచార‌ణ

జ‌గ‌న్ కేసు పై విచార‌ణ ప్రారంభించిన ఎన్ఐఏ అధికారులు విజయవాడలోని మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సీఆర్‌పీసీ సెక్షన్‌ 41 (డి) ప్రకారం నిందితుడిని తమకు అప్పగించాలని, స్థానిక పోలీసులు ఇప్పటివరకూ చేపట్టిన విచారణకు సంబంధించిన అన్ని ఫైళ్లు తమకు అప్పగించాలని న్యాయస్థానాన్ని కోరారు.

ఎన్‌ఐఏ కోర్టులో పిటిషన్‌

ఎన్‌ఐఏ కోర్టులో పిటిషన్‌

విశాఖ పోలీసులు, ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) అధికారులు సహకరించకపోవడంతో ఇప్పటికే ఎన్‌ఐఏ అధికారులు విజయవాడలోని ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టులో ఒక పిటిషన్‌ వేశారు. ఇదే స‌మ‌యంలో.. ఒకట్రెండు రోజుల్లో జగన్‌ కేసుకు సంబంధించిన పత్రాలను విజయవాడ ఎన్‌ఐఏ కోర్టుకు అప్పగించే అవకాశం ఉంది.

ఇక విజ‌య‌వాడ‌లోనే విచార‌ణ‌..

ఇక విజ‌య‌వాడ‌లోనే విచార‌ణ‌..

జగన్‌పై దాడి కేసు విజయవాడ కోర్టుకు బదిలీ అయింది. ఎన్‌ఐఏ కేసులు విచారించే విజయవాడ మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ కోర్టుకు బదిలీ చేశారు. జగన్‌పై దాడి కేసు నిందితుడు శ్రీనివాసరావును విశాఖ సెంట్రల్‌ జైలు నుంచి రాజ మండ్రికి తరలించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. దీంతో ఇకపై ఈ కేసు విచారణ విజయవాడలోనే జ‌ర‌గ‌నుంది. విశాఖపట్నంలోని 7వ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో ఉన్న కేసు విజయవాడకు బదిలీ అయింది. ఈ మేరకు విజయవాడ లోని ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానం, మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి విశాఖ కోర్టుకు ఆదే శాలు జారీ చేశారు. ఆ ఆదేశాలు విశాఖలోని కోర్టుకు మంగళవారం అందాయి. కేసు విచారణ విజయవాడలో జరుగనుండ‌టంతో ఇది రానున్న రోజ‌ల్లో ఈ విచార‌ణ‌ మ‌రింత వేగం పుంజుకొనే అవ‌కాశం ఉంది.

English summary
Attmept on Jagan case is transfer to Vijayawada court. NIA alreday started investigation in this case. who was accused in this casse Mr Srinivasa rao may shifted to Rajahmundry jail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X