• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కృష్ణా జిల్లాపై ఫోకస్ పెట్టిన జగన్ .... వంశీ,దేవినేని అవినాష్ లతో జిల్లా రాజకీయాల్లో మార్పు

|

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా జిల్లా రాజకీయాలు, తాజా రాజకీయ సమీకరణాల నేపథ్యంలో హాట్ హాట్ గా మారాయి. తెలుగుదేశం పార్టీ కి గుడ్ బై చెప్పి వైసీపీ పాట పాడుతున్న వల్లభనేని వంశీ, టీడీపీ నుండి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి జంప్ అయిన యువనేత దేవినేని అవినాష్ లతో ఆసక్తికర రాజకీయం నడిపించబోతున్నారు అన్నది ఇప్పుడు ఏపీలో ఆసక్తికరంగా మారింది. తాజాగా వల్లభనేని వంశీ జగన్ ను కలవటం , దేవినేని అవినాష్ తూర్పు నియోజక వర్గ ఇంచార్జ్ బాధ్యతలు తీసుకుని పార్టీని బలోపేతం చెయ్యటానికి ప్రయత్నం చేయటం వంటి అంశాలతో ఇప్పుడు జగన్ ఫోకస్ కృష్ణా జిల్లా పాలిటిక్స్ అన్న ఆసక్తికర చర్చ జరుగుతోంది.

బెజవాడ తూర్పులో వైసీపీ బలోపేతం కోసం పని చేస్తున్న దేవినేని అవినాష్

బెజవాడ తూర్పులో వైసీపీ బలోపేతం కోసం పని చేస్తున్న దేవినేని అవినాష్

గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసిపి హవా కొనసాగినప్పటికీ విజయవాడ తూర్పు రాజకీయాల్లో మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన బొప్పన భవ కుమార్ పరాజయం పాలయ్యారు. విజయవాడ తూర్పులో టిడిపి నుండి బరిలోకి దిగిన గద్దె రామ్మోహన్ విజయం సాధించారు. దీంతో స్థానికంగా వైసీపీకి ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే విజయవాడ తూర్పులో వైసిపి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి అని భావించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు దేవినేని అవినాష్ ను విజయవాడ తూర్పు రాజకీయాల్లో రంగంలోకి దించారు. జగన్ అత్యంత కీలకమైన బాధ్యత అవినాష్ పై పెట్టి పార్టీని బలోపేతం చెయ్యాలని సూచించారు.

అవినాష్ చేరికతో వైసీపీలో అప్పటికే ఉన్న నేతల విషయంలో జగన్ వ్యూహం

అవినాష్ చేరికతో వైసీపీలో అప్పటికే ఉన్న నేతల విషయంలో జగన్ వ్యూహం

అవినాష్ చేసే ప్రయత్నానికి సొంత పార్టీ నేతల వల్ల ఎలాంటి అవాంతరం కలగకుండా గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన బొప్పన భవ కుమార్ కు జగన్ టెన్షన్ పడాల్సిన అవసరం లేదని, నామినేటెడ్ పదవి ఇస్తానని హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.ఇక మరో కీలక నేత యలమంచిలి రవి కూడా జగన్ కలిసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఆయన జగన్ ను కలిస్తే ఆయన రాజకీయ భవిష్యత్ మీద కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే బెజవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే, టిడిపి నేత గద్దె రామ్మోహన్ కు చెక్ పెట్టాలనే ఉద్దేశంతోనే దేవినేని అవినాష్ ను జగన్ రంగంలోకి దించినట్లు గా తెలుస్తుంది .

జగన్ ను కలిసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

జగన్ ను కలిసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

ఇక గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయానికి వస్తే తాజాగా ఆయన జగన్ ను కలిసి మాట్లాడారు. వైసీపీలో ఇప్పటికే చేరతారని భావించిన వంశీ ఇంకా వైసీపీలో చేరకుండా తాసారం చేస్తున్నారు. అందుకు కారణం గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావు తన రాకను ఇష్టపడకపోవటమే అని తెలుస్తుంది. ఎలాంటి గొడవలు లేకుండా అందరినీ కలుపుకుపోయేలా వంశీ పార్టీ లో చేరాలని భావిస్తున్నారు. కానీ యార్లగడ్డ ముఖ్యమంత్రి దగ్గర ఒక మాట చెప్పి, బయట మరోలా మాట్లాడటం వంశీకి నచ్చటం లేదు.

వైసీపీ నేతలను గన్నవరంలో కలుపుకు వెళ్ళే ఆలోచనలో వంశీ

వైసీపీ నేతలను గన్నవరంలో కలుపుకు వెళ్ళే ఆలోచనలో వంశీ

ఇక వంశీ అందరినీ కలుపుకుని ముందుకు వెళ్ళాలని వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు మీద సాఫ్ట్ కార్నర్ కూడా ప్రదర్శిస్తున్నారు ఎన్నికల్లో పోటీ చేసి డబ్బు పోగొట్టుకున్నారు అని సానుభూతి ప్రదర్శిస్తున్నారు. ఇక ఇప్పటివరకు వైసీపీ తీర్ధం పుచ్చుకోని వంశీ తాజాగా జగన్ ను కలవటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తన స్నేహితుడికి సంబంధించి ఒక పని కోసం వంశీ వెళ్ళారని చెప్తున్నా జగన్ , వంశీల మధ్య రానున్న అసెంబ్లీ సమావేశాల గురించి చర్చ జరిగినట్టు తెలుస్తుంది.

అసెంబ్లీ సమావేశాల నేపధ్యంలో జగన్ వంశీ భేటీ పై చర్చ

అసెంబ్లీ సమావేశాల నేపధ్యంలో జగన్ వంశీ భేటీ పై చర్చ

వంశీ పార్టీలో చేరటానికి చేస్తున్న జాప్యం వెనుక కారణాలు ఏమైనా, మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలలో వంశీ ఏం చెయ్యబోతున్నారు. సీఎం జగన్ తో భేటీలో ఆయన ఏమి చర్చించారు అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది. ఒకపక్క ప్రతిపక్ష పార్టీ టీడీపీ అసెంబ్లీ సమావేశాలను టార్గెట్ చేసి వైసీపీపై విరుచుకుపడాలి అని వ్యూహం సిద్ధం చేస్తుంది. ఇక ఇదే సమయంలో వంశీ , జగన్ తో భేటీ అసెంబ్లీ సమావేశాలే టార్గెట్ గా మాట్లాడారా అన్న చర్చకు కారణం అవుతుంది.

కృష్ణా జిల్లా రాజకీయాల్లో మార్పుకు జగన్ స్కెచ్

కృష్ణా జిల్లా రాజకీయాల్లో మార్పుకు జగన్ స్కెచ్

ఇక ఇదే సమయంలో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో టిడిపి నుండి వచ్చిన యువనేత దేవినేని అవినాష్ ను రంగంలోకి దించడం, వల్లభనేని వంశీతో వ్యూహాత్మకంగా పావులు కదపటం వైసీపీ వేసిన తెలివైన స్టెప్ అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రానున్న మున్సిపల్ ఎన్నికలకు ఫోకస్ పెట్టిన జగన్ కృష్ణా జిల్లాలో వైసీపీ పట్టు సాధించాలి అంటే వల్లభనేని వంశీ , దేవినేని అవినాష్ ల పాత్ర అవసరం అని భావిస్తున్నారు.దీంతో కృష్ణా జిల్లాలో ప్రస్తుత రాజకీయాలు రసవత్తరంగా మారాయి అని చెప్పాలి.

English summary
YSRCP government has focussed on Krishna district. It has started working to strengthen the party in each constituency. As part of it, the rebel MLA Vallabhaneni Vamshi has left the TDP and is ready to join the YSRCP. However, the suspense remains over his joining into the YSRCP. His recent meeting with CM YS Jagan Mohan Reddy has become the political focal point of his resignation issue. As the Assembly session is going to begin shortly, MLA Vamshi has reportedly met the CM Jagan for his political future, it is learned. On the other hand, Devineni Avinash, who joined the YSRCP recently, has become active again while holding the position of party in-charge of Vijayawada east constituency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X