విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ సర్కారు పెన్షన్ల పెంపు ఎప్పుడో - రెండో ఏడాదిలో నెరవేరని హామీ- మిగతావన్నీ చకచకా..

|
Google Oneindia TeluguNews

ఏపీలో గతేడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో జగన్ తాము అధికారంలోకి రాగానే నవరత్నాల అమల్లో భాగంగా ఆసరా పింఛన్లను 2 వేల నుంచి మూడు వేల రూపాయలకు పెంచుకుంటూ పోతామని హామీ ఇచ్చారు. దీనిపై అప్పట్లో టీడీపీ అభ్యంతరాలు వ్యక్తం చేసినా వైసీపీ మాత్రం మూడు వేల రూపాయలు ఇస్తుందన్న భరోసాతో జనం ఓట్లేశారు. అధికారంలోకి రాగానే వెంటనే సీఎం జగన్ పింఛన్ల పెంపుపై సంతకం పెట్టేశారు. గతేడాది జూలై నెలలో పింఛన్ మొత్తం 2250కు పెరిగింది. కానీ ఈ ఏడాది మాత్రం తర్వాతి దశ పింఛన్లపై ఎవరూ నోరు మెదపకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

జగన్ కు భారీ ఎదురుదెబ్బ- సీమ ఎత్తిపోతల పథకానికి బ్రేక్- కేసీఆర్ అభ్యంతరాలతో ...జగన్ కు భారీ ఎదురుదెబ్బ- సీమ ఎత్తిపోతల పథకానికి బ్రేక్- కేసీఆర్ అభ్యంతరాలతో ...

పెరగని పింఛన్ల మొత్తం...

పెరగని పింఛన్ల మొత్తం...


గతేడాది వైసీపీ ప్రభుత్వం నవరత్నాల అమల్లో భాగంగా అట్టహాసంగా ప్రారంభించిన వైఎస్సార్ పింఛన్ కానుక పథకం రెండో ఏడాదికి వచ్చే సరికి లైట్ అయిపోయినట్లే కనిపిస్తోంది. ఎన్నికల హామీ అమల్లో భాగంగా తొలి ఏడాది రూ.2000గా ఉన్న పింఛన్ ను రూ.2250కు పెంచారు. అయితే ఆ తర్వాత మూడు సంవత్సరాలు కూడా రూ.250 చొప్పున పెంచాల్సి ఉంది. కానీ జూలైలో పెరగాల్సిన పింఛన్లు ఆగస్టులోనూ పెంపుకు నోచుకోవడం లేదని తెలుస్తోంది. తొలి ఏడాది అధికారంలోకి రాగానే హామీ నెరవేర్చినట్లు ప్రకటించిన ప్రభుత్వం.. రెండోసారి పెంచకపోవడానికి కారణాలు కూడా తెలియడం లేదు.

మొత్తం పెరగలేదు కానీ...

మొత్తం పెరగలేదు కానీ...

పింఛను మొత్తం పెరగలేదనే కానీ లబ్ది దారుల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. నెలనెలా కొత్త లబ్దిదారులను ప్రభుత్వం ఈ పథకంలో చేర్చుకుంటూ పోతోంది.. తాజాగా ఆగస్టు నెల కోసం తాజాగా విడుదల చేసిన లెక్కల్లోనూ కొత్తగా 2 లక్షల మందికి పైగా లబ్దిదారులను గుర్తించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అలాగే సొంత ఊర్లను వదిలి బయటికి వెళ్లిన వారికి సైతం పింఛన్ మొత్తం అందేలా ప్రభుత్వం చర్యలు ప్రకటిస్తోంది. అలాగే ఇప్పటి వరకూ కార్పోరేషన్ల ద్వారా సక్రమంగా అందని పింఛన్లను కూడా ఠంఛనుగా చెల్లించేందుకు ప్రభుత్వం ఆదేశాలు ఇస్తోంది. కానీ పింఛను మొత్తం పెంపు విషయాన్ని మాత్రం ఎందుకో దాటేస్తోంది.

Recommended Video

APSRTC To Run Limited Services అవసరం లేని రూట్లలో APSRTC సర్వీసులు నిలిపివేత!! || Oneindia Telugu
నిధులున్నా.. ప్రశ్నించే వారు లేక..

నిధులున్నా.. ప్రశ్నించే వారు లేక..

గతేడాది పింఛన్ల పెంపు సందర్భంగా బడ్జెట్లలోనే నిధులు కేటాయిస్తున్నారు. కరోనా కారణంగా ఇతరత్రా ఇబ్బందులున్నా మిగతా పథకాలు ఏవైనా ఆగాయా అంటే అదీ లేదు. కానీ పింఛన్ల కొచ్చేసరికి మాత్రం ప్రభుత్వం దాటవేత ధోరణినే ఎంచుకుంటోంది. తొలి ఏడాది పింఛన్ల పెంపు ఇచ్చి, రెండో ఏడాది దాన్ని కొనసాగించకపోతే నాలుగేళ్లలో 3 వేల రూపాయల హామీ ఎలా నేరవేరుతుంది. అయితే ఇప్పట్లో ఎన్నికలు లేకపోవడం, విపక్ష టీడీపీ దీన్ని గట్టిగా ప్రశ్నించే పరిస్ధితుల్లో లేకపోవడంతో ప్రభుత్వం కూడా దీన్ని నానాటికీ ఆలస్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వ హామీని నమ్మి ఓట్లు వేసిన పేదలు మాత్రం పింఛను మొత్తం పెరగకపోతే ప్రస్తుత కరోనా పరిస్ధితుల్లో పనులు లేక ఇబ్బందులు పడుతున్న తమకు ఆసరా ఎలా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు.

English summary
andhra pradesh governemnt has not yet increased pension amount given for old age, widows and helpless poor in the state. as a part of navaratnalu govt has to increase rs.250 pension amount this year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X