• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

గంటాకు జగన్ సర్కార్ షాక్ ... అనుమతుల్లేవని గంటా క్యాంప్ ఆఫీస్ కూల్చివేతకు రంగం సిద్ధం

|

ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు షాక్ ఇస్తోంది. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతామని ప్రజా వేదిక కూల్చివేతతో ప్రారంభం అయిన కూల్చివేతల పర్వం ఏపీలో నేటికి కొనసాగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా అక్రమ నిర్మాణాలపై టౌన్ ప్లానింగ్ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు . తాజాగావిశాఖపట్టణం జిల్లాలోని భీమిలిలో టీడీపీ నేత, మాజీ మంత్రివర్యులు గంటా శ్రీనివాసరావు గెస్ట్ హౌస్ కూల్చివేతకు రంగం సిద్ధం అయింది.

 ఇరవై నాలుగు గంటల్లోగా గంటా క్యాంప్ ఆఫీస్ ను కూల్చివేస్తామని నోటీసులు

ఇరవై నాలుగు గంటల్లోగా గంటా క్యాంప్ ఆఫీస్ ను కూల్చివేస్తామని నోటీసులు

మొన్నటికి మొన్న టిడిపి నేత మాజీ ఎంపీ మురళీమోహన్ కు సంబంధించిన భవనాలను, పీలా గోవింద్ కు సంబంధించిన ఐదు అంతస్థుల భవనాలను కార్పొరేషన్ సిబ్బంది కూల్చివేశారు. ఇప్పుడు గత ప్రభుత్వంలో మంత్రిగా కీలకంగా పనిచేసిన గంటా శ్రీనివాసరావుకు సంబంధించిన భవనాల కూల్చివేతకు రంగం సిద్ధం చేసుకున్నారు అధికారులు.

జీవీఎంసీ ప్లానింగ్ విభాగం ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. ఇరవై నాలుగు గంటల్లోగా గెస్ట్ హౌస్ ను కూల్చివేస్తామని ఆ నోటీసుల్లో పేర్కొంది. గంటా గెస్ట్ హౌస్ వద్దకు జీవీఎంసీ సిబ్బంది చేరుకున్నారు. ఇక భవనాల కూల్చివేత సమయంలో ఎలాంటి ఉద్రిక్తత చోటు చేసుకోకుండా భవన సమీప ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో పెట్టనున్నారు.ఇందుకోసం భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు.

సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ కు ఏపీ సర్కార్ బంపర్ ఆఫర్ .. ప్రభుత్వ సలహాదారుగా నియామకం

అనుమతులు లేకుండా భవనం నిర్మించారన్న జీవీఎంసి .. కోర్టును ఆశ్రయించిన భవన యజమాని

అనుమతులు లేకుండా భవనం నిర్మించారన్న జీవీఎంసి .. కోర్టును ఆశ్రయించిన భవన యజమాని

భీమిలి బీచ్ వద్ద ఉన్న గంటా శ్రీనివాసరావు క్యాంప్ ఆఫీసు అనుమతులు లేకుండా నిర్మించారని, ఈ భవనానికి సంబంధించి ఎటువంటి అనుమతులు ఉన్నా తమకు చూపించాలని జీవీఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. రెండు సార్లు నోటీసులు జారీ చేసిన అధికారులు చివరకు సమాధానం రాకపోవడంతో భవనాన్ని కూల్చివేయాలని నిర్ణయించారు. అందులో భాగంగానే 24 గంటల్లో కూల్చి వేస్తామని నోటీసు ఇచ్చారు. అయితే ఈ భవనం కంచర్ల రవీంద్రనాథ్ అనే వ్యక్తి పేరిట ఉన్న భవనం. ఈ వ్యవహారంపై భవన యజమాని కంచర్ల రవీంద్రనాథ్ హైకోర్టును ఆశ్రయించారు.

బీపీఎస్ క్రింద రెగ్యులరైజ్ చెయ్యాలని కోరిన అనుమతించలేదని ఆరోపణ .. కక్ష సాధింపు అంటున్న టీడీపీ

బీపీఎస్ క్రింద రెగ్యులరైజ్ చెయ్యాలని కోరిన అనుమతించలేదని ఆరోపణ .. కక్ష సాధింపు అంటున్న టీడీపీ

బీపీఎస్ కింద ఈ భవనాన్ని రెగ్యులరైజ్ చేయాలని దరఖాస్తు చేసిన అధికారులు ఆమోదించలేదని రవీంద్రనాథ్ కోర్టులో కేసు వేశారు. ఆగస్టు 13న దీనిపై తీర్పునిచ్చిన కోర్టు భవాని యజమానికి వారం రోజులు గడువు ఇవ్వాలని నిబంధనలు పాటించారా లేదా అన్నది పరిశీలించాలని అధికారులను ఆదేశించింది. కోర్టు ఉత్తర్వులు రవీంద్రనాథ్ కు ఆగస్టు 22న అందాయని దీని ప్రకారం ఇంకా గడువు ఉందని రవీంద్రనాధ్ అనుచరులు చెప్తున్నారు. అయినప్పటికీ కూల్చివేయాలని ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు.

టిడిపి నాయకులు పైన వైసిపి కక్ష సాధింపు చర్యల్లో భాగంగా నే భవనాల కూల్చివేత చేపడుతుందని మండిపడుతున్నారు. ఇక క్యాంప్ ఆఫీస్ కు సంబంధించిన కూల్చివేత సమాచారం తెలుసుకున్న గంటా వర్గీయులు వైసిపి సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Officials who prepared the field for demolition of buildings related to Manika Srinivasa Rao, who served as a key minister in the last government.GVMC Planning Department has issued notices to this extent. The notice stated that the guest house would be demolished within twenty-four hours.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more