విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజ్యాంగ వ్యవస్థపై జగన్ సర్కార్ పోరాటం, న్యాయ వ్యవస్థల నిర్ణయం : ఏపీ ఎన్నికలపై దేశం ఫోకస్

|
Google Oneindia TeluguNews

రాజ్యాంగ వ్యవస్థ అయిన ఎన్నికల సంఘం పై జగన్ సర్కారు పోరాటం చేస్తోంది. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ అడ్డుకోవాలని అడుగడుగునా ప్రయత్నాలు చేసింది. సుప్రీం కోర్టు మెట్లెక్కింది. ప్రభుత్వ అనుకున్నది సాధించాలని పట్టిన పట్టు విడవకుండా ప్రయత్నాలు సాగించినా, ప్రభుత్వ ఉద్యోగుల సహాయ నిరాకరణ ప్రకటించినా ఫైనల్ గా సుప్రీం తీర్పుతో ప్రస్తుతానికి ఎన్నికల సంఘానిదే పైచేయిగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల పోరు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు కారణమైంది.

Recommended Video

Ap Sec Letter To Central Government | Andhra Pradesh Local Body Polls | Oneindia Telugu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ పోరు దేశవ్యాప్తంగా రాజకీయవర్గాలకు ఆసక్తికర అంశంగా మారింది.

 పంచాయతీ వార్ .. గోపాలకృష్ణ ద్వివేది,గిరిజా శంకర్ బదిలీలో కొత్త ట్విస్ట్; బదిలీలకు ఎస్ఈసి నో పంచాయతీ వార్ .. గోపాలకృష్ణ ద్వివేది,గిరిజా శంకర్ బదిలీలో కొత్త ట్విస్ట్; బదిలీలకు ఎస్ఈసి నో

ఏపీలో ఎన్నికల సంఘం వర్సెస్ ప్రభుత్వం

ఏపీలో ఎన్నికల సంఘం వర్సెస్ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం, ఎన్నికల సంఘంతో పంచాయితీ పెట్టుకుంది. మొదటి నుంచి ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ, రాజ్యాంగ వ్యవస్థపైనే తిరుగుబాటు బావుటాను ఎగురవేసింది. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని టార్గెట్ చేసి, ఆయనకు ప్రభుత్వ అధికారులు ఎవరూ సహకరించకుండా ఒంటరిని చేసి, ఎన్నికల కమిషన్ పై పైచేయి సాధించాలని ప్రయత్నించింది. అయితే ఎన్నికల సంఘానికి ఉన్న ప్రత్యేక అధికారి అధికారాలు ఎలాంటివో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రమేష్ కుమార్ ఒంటరిగా పోరాడి ప్రభుత్వానికి అర్థం అయ్యేలా చేశారు.

ఏపీలో జరుగుతున్న రగడపై దేశ వ్యాప్తంగా రాజకీయ పార్టీల దృష్టి

ఏపీలో జరుగుతున్న రగడపై దేశ వ్యాప్తంగా రాజకీయ పార్టీల దృష్టి

స్వయం ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ సంస్థల నిర్ణయాల ముందు, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు నిలబడవని ఎన్నికల కమిషనర్ నిరూపించారు. న్యాయవ్యవస్థ సహకారంతో రమేష్ కుమార్ అంతిమంగా సుప్రీం తీర్పు ద్వారా పైచేయి సాధించారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఎన్నికలను ఆపితే లబ్ది జరుగుతుంది అనుకునే పార్టీలు, ఎన్నికల సంఘం పైన పై చెయ్యి సాధించాలని ఆలోచిస్తున్న ప్రభుత్వాలు, అలాగే అన్ని రాష్ట్రాలలోనూ ఎన్నికల కమీషన్ లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న దానిపై ప్రత్యేకమైన దృష్టి సారించాయి.

 ఎన్నికల సంఘానిదే పై చెయ్యి .. అయినా సరే జగన్ సర్కార్ పై ప్రత్యేకమైన ఆసక్తి

ఎన్నికల సంఘానిదే పై చెయ్యి .. అయినా సరే జగన్ సర్కార్ పై ప్రత్యేకమైన ఆసక్తి

ప్రభుత్వం అనుకున్నది సాధిస్తుందా ? లేక ఎన్నికల కమిషన్ నిర్ణయానికి మద్దతు లభిస్తుందా ? అన్న అంశంపై దృష్టిసారించిన దేశం ఫైనల్ గా రాజ్యాంగ వ్యవస్థల నిర్ణయమే శిరోధార్యంగా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని సుప్రీం నిర్ణయంతో అర్థం చేసుకుంది. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న జగన్ సర్కార్ ఏదైనా ఒక ఒక విషయం పై పట్టుదలతో ఉంటే, చివరి వరకూ పోరాటం సాగించే స్వభావం ఉన్న ప్రభుత్వం కావడంతో ఎన్నికల విషయంలో మళ్లీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్న ఆసక్తి, ఎన్నికల కమిషన్ ను ఇరకాటంలో పెట్టడానికి ఏం చేయబోతున్నారు అని ఆలోచన ఇప్పుడు దేశవ్యాప్తంగా అనేక రాజకీయ పార్టీలలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీల్లో ఏపీ ఎన్నికల పరిణామాలపై చర్చ

దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీల్లో ఏపీ ఎన్నికల పరిణామాలపై చర్చ

ఇప్పటి వరకు దేశంలో ఎప్పుడూ , ఎక్కడా ఎన్నికల నేపథ్యంలో ఎదురు కాని విచిత్ర పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయాలు, ఎన్నికల కమిషన్ పోరాటం, న్యాయ వ్యవస్థల నిర్ణయాలపై దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీల్లో ప్రధానంగా చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలతో, తమ రాష్ట్రంలో తమకు అనుకూలమైన, ఏపీలో సక్సెస్ అయిన విధానాలను అమలు చేయాలన్న ఆసక్తి పలు రాజకీయ పార్టీలలో వ్యక్తమైందని సమాచారం.

ఏపీ పంచాయతీ వార్ ను జాగ్రత్తగా గమనిస్తున్న దేశం

ఏపీ పంచాయతీ వార్ ను జాగ్రత్తగా గమనిస్తున్న దేశం


ఏది ఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి సర్కార్ పాలన చేపట్టినప్పటి నుంచి, సంచలన నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా, సంచలన పోరాటాలకు శ్రీకారం చుట్టడంతో దేశవ్యాప్తంగా చాలా రాజకీయ పార్టీల దృష్టి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం పై పడింది అని చెప్పడం, ప్రస్తుత ఎన్నికలను దేశం మొత్తం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంది అని చెప్పడం నిర్వివాదాంశం.

English summary
The Jagan government is fighting the Election Commission, a constitutional body. Attempts were made at every step to prevent the conduct of elections in the state. The Supreme Court stepped down. Despite the government's relentless efforts to achieve what it set out to do, the Supreme Court has now ruled that the Election Commission has the upper hand. The struggle of local bodies in the state of Andhra Pradesh has now caused a nationwide debate. The panchayat war in the state of Andhra Pradesh has become an interesting topic for political parties across the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X