విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాయలసీమ లిఫ్ట్‌పై జగన్‌ దూకుడు- కలిసొస్తున్న అపెక్స్‌ భేటీ వాయిదా- త్వరలో పనులు ఖరారు..

|
Google Oneindia TeluguNews

రాయలసీమకు వరప్రదాయినిగా భావిస్తున్న సీమ ఎత్తిపోతల పథకంపై జగన్‌ సర్కారు దూకుడుగా ముందుకెళుతోంది. కృష్ణా రివర్ బోర్డు అభ్యంతరాలను బేఖాతర్‌ చేస్తూ ఇప్పటికే టెండర్లను ఖరారు చేసిన ప్రభుత్వానికి అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ వాయిదా మరింత కలిసొచ్చేలా ఉంది. అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ తేదీ ఖరారయ్యే లోపే ఈ వ్యవహారంలో మరింత ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వం వ్యూహరచన చేస్తోంది. దీన్ని గమనించే తెలంగాణ నేతలు అక్కడి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. జల వివాదాలు ఉన్నా వాటిని లెక్కచేయకుండా ముందుకెళ్తున్న జగన్‌ సర్కారుకు అడ్డుకట్టే వేయాలని వారు ఇందులో కోరారు.

Recommended Video

Krishna Water Dispute B/W AP&TS తెలుగురాష్ట్రాల కృష్ణా జలాల పంచాయితీ .. తేల్చాల్సింది కేంద్రమే !!

జగన్ సర్కారుకు కేంద్రం ఝలక్‌- అంతర్‌ రాష్ట్ర రవాణా ఆంక్షలపై సీరియస్‌...జగన్ సర్కారుకు కేంద్రం ఝలక్‌- అంతర్‌ రాష్ట్ర రవాణా ఆంక్షలపై సీరియస్‌...

 జల వివాదాల్లో దూకుడే పనికొస్తుందా ?

జల వివాదాల్లో దూకుడే పనికొస్తుందా ?

ఆధునిక చరిత్రలో జల వివాదాలను గమనిస్తే మందుగా ఎవరు దూకుతారో వారే అంతిమ ప్రయోజనం పొందడం ఖాయమన్నది నానుడి. అల్మట్టి, బాబ్లీ ప్రాజెక్టుల విషయంలో కర్నాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఆనాడు ప్రదర్శించిన దూకుడు తెలుగు రాష్ట్రాలకు ఎంతగా నష్టం కలిగించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారి అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్న తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు తామూ అదే బాటలో పయనిస్తున్నాయి. కేంద్రం, పర్యావరణశాఖ, ట్రైబ్యునల్స్‌, రివర్‌ బోర్డుల అనుమతుల్లేకపోయినా దూకుడుగా ముందుకెళ్లడం ద్వారా అంతిమ ప్రయోజనం పొందాలనేది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని టీఆర్‌ఎస్‌, వైసీపీ ప్రభుత్వాల ఉద్దేశంగా కనిపిస్తోంది. అయితే అనూహ్యంగా ఇదే వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలకు కారణమవుతోంది. ముఖ్యంగా రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌పై వైసీపీ సర్కారు దూకుడు తెలంగాణలోని కేసీఆర్‌ సర్కారుకు రుచించడం లేదు. అయినా సీఎం జగన్‌ తన రాష్ట్ర ప్రయోజనాల కోణంలో ముందుకెళ్లక తప్పని పరిస్ధితి.

సీమ లిఫ్ట్‌పై జగన్‌ దూకుడు...

సీమ లిఫ్ట్‌పై జగన్‌ దూకుడు...


రాయలసీమ తాగు, సాగునీటి అవసరాలు తీరుస్తుందని భావిస్తున్న రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌పై జగన్‌ సర్కారు ముందునుంచీ పట్టుదలగానే ఉంది. అయితే తెలంగాణ నుంచి వ్యక్తమవుతున్న అభ్యంతరాలతో ఈ వ్యవహారంపై మరింత దూకుడు పెంచడం ద్వారా కేంద్రం కానీ ట్రైబ్యునల్స్‌ కానీ జోక్యం చేసుకోకముందే పని పూర్తి చేయాలనే ఉద్దేశంతో జగన్‌ సర్కారు కనిపిస్తోంది. అందుకే కృష్ణా రివర్‌ బోర్డు సీమ లిఫ్ట్‌ టెండర్లపై ముందుకెళ్లొద్దని సూచించినా అవేవీ పట్టించుకోకుండా ఈ ప్రక్రియను దాదాపుగా పూర్తి చేసేసింది. ఇప్పుడు తదుపరి ప్రక్రియపైనా కసరత్తు జరుపుతోంది. ఇందుకు ఢిల్లీలో జరగాల్సిన తాజా అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ వాయిదా కూడా కలిసొస్తోంది.

 కలిసొస్తున్న అపెక్స్‌ భేటీ వాయిదా..

కలిసొస్తున్న అపెక్స్‌ భేటీ వాయిదా..


వైసీపీ సర్కారు నిర్మించ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న తెలంగాణ.. దీన్ని అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీలో ప్రధానంగా ప్రస్తావించేందుకు సిద్ధమైంది. విషయం ముందే గ్రహించిన జగన్.. ఆ మేరకు సీమ టెండర్ల వ్యవహారంలో దూకుడు పెంచారు. చివరికి రాయలసీమ లిఫ్ట్‌ టెండర్లను ఎస్పీబీఎల్‌-ఎన్‌సీసీ సంస్ధకు కట్టబెట్టేశారు. సాంకేతిక నిపుణుల కమిటీ ఆమోదం కూడా తీసుకుని ఇప్పుడు తదుపరి ప్రక్రియపై దృష్టిసారించారు. ఈ నేపథ్యంలో కేంద్ర జలమంత్రికి కరోనా సోకడంతో ఈనెల 25న జరగాల్సిన అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ కాస్తా వాయిదా పడింది. ఇదే అదనుగా పనుల ఖరారుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎక్కడా అధికారిక ప్రకటనలు లేకుండానే జగన్‌ సర్కారు ఈ పనులు పూర్తి చేస్తోంది..

 హైకోర్టుకు తెలంగాణ నేతలు..

హైకోర్టుకు తెలంగాణ నేతలు..

తాజా పరిణామాల నేపథ్యంలో ఏపీ సర్కారు దూకుడుకు అడ్డుకట్టే వేసేందుకు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఏపీ పునర్విభజన చట్టానికి తూట్లు పొడుస్తూ జగన్ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్‌పై ముందుకెళ్తోందని వాదించారు. అయితే ఇందులో హైకోర్టు ఇప్పటికిప్పుడు జోక్యం చేసుకుని ఆదేశాలు ఇస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. తాజాగా వాయిదా పడిన అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ త్వరలో జరిగే అవకాశం ఉన్నందున అక్కడే తేల్చుకోవాలని హైకోర్టు పిటిషనర్లకు సూచిస్తుందా లేక తానే ఈ పథకంపై ముందుకెళ్లొద్దంటూ ఆదేశాలు ఇస్తుందా అన్నది చూడాల్సి ఉంది.

English summary
andhra pradesh government has been planning to go forward on rayalaseema lift irrigation scheme amid postponement of apex council meet on projects in delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X