విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ నిర్లక్షం ఖరీదు .. ప్రజల ప్రాణాలు : దేవినేని ఉమా ఫైర్

|
Google Oneindia TeluguNews

ఏపీలో కరోనా కేసులు పెరగటానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సీఎం జగన్ నిర్లక్ష్యంతో ప్రజల ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి వచ్చిందని టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా వ్యాఖ్యానించారు . కరోనా కట్టడిలో జగన్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని దేవినేని ఉమా పేర్కొన్నారు. జగన్ నిర్లిప్తత ప్రజలను ప్రమాదంలో పడేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు .

వికలాంగ బిచ్చగత్తె ఔదార్యం..కరోనా సమయంలో లాక్ డౌన్ సిబ్బందికి అరటిపండ్లు , మజ్జిగ పంపిణీ వికలాంగ బిచ్చగత్తె ఔదార్యం..కరోనా సమయంలో లాక్ డౌన్ సిబ్బందికి అరటిపండ్లు , మజ్జిగ పంపిణీ

సీఎం జగన్ కు ఈ సమయంలో కూడా రాజకీయాలే ప్రధానంగా మారాయని మండిపడ్డారు.ప్రభుత్వ చేతగాని తనం వల్ల ఐదు కోట్ల మంది ప్రజలు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఉన్నారని పేర్కొన్నారు. ఎన్నికలు నిర్వహించాలని సీఎం జగన్ ప్రయత్నం చెయ్యటం సిగ్గు చేటని వ్యాఖ్యానించారు. రాజ్యాంగం, కోర్టులంటే ప్రభుత్వానికి ఏమాత్రం గౌరవం లేదని దేవినేని ఉమా దుయ్యబట్టారు. రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా స్తంభించిపోయిందన్న ఉమా అధికారులపై సీఎం జగన్ తానూ అనుకున్నది జరగాలని తీవ్ర ఒత్తిడి పెపెడుతున్నారని వ్యాఖ్యానించారు . రెడ్‌జోన్‌లో ఉన్న అధికారులను విధులకు రమ్మంటున్నారని, వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రభుత్వ నిర్ణయాన్ని దేవినేని ఉమ తప్పు పట్టారు .

Jagan negligence cost .. Peoples lives : Devineni Uma Fire

ఇక ప్రభుత్వం అనవసరమైన వాటికి నిధులను కేటాయిస్తూ అవసరమైన వాటిపై నిర్లిప్త ధోరణి కొనసాగిస్తుందని ఆయన అన్నారు . పెన్షనర్లకు 50శాతం జీతాలు కట్ చేశారని, ప్రభుత్వ సలహాదారులకు మాత్రం కోట్లు విడుదల చేస్తున్నారని ప్రభుత్వ తీరుపై ఫైర్ అయ్యారు దేవినేని ఉమా . విశాఖలో పాజిటివ్‌లు వస్తే అది బయటకు రానివ్వటం లేదని పేర్కొన్న ఆయన విశాఖలో పెరిగిన కేసులను కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కలిపేస్తున్నారని నిప్పులు చెరిగారు.

విశాఖకు రాజధానిని తరలించాలని చూస్తున్నారని అందుకే ఇదంతా చేస్తున్నారని అన్నారు. ఇక గుంటూరు , కృష్ణా జిల్లాలలో కేసులు పెరిగాయని చెప్పి రాజధాని ఉద్యమాన్ని అణచివేసే పనిలో ఉన్నారని అన్నారు . సీఎం జగన్ తన స్వప్రయోజనాల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని దేవినేని ఫైర్ అయ్యారు. రాజకీయ ఒత్తిళ్లు లేకుండా అధికారులను పనిచేయిస్తే ఈ పరిస్థితి వచ్చేదా? అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు .

Recommended Video

Tested Negative People And States Situation After ICMR Advises Not to Use Rapid Testing Kits

English summary
TDP leaders have blamed the government's negligence for increasing corona cases in AP. Former TDP leader Devineni Uma said that the CM Jagan negligence has put the lives of people in danger . Devineni Uma claimed that the Jagan government had failed miserably in corona control. He insisted that the Jagan detachment would endanger people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X